Ferrari electric vehicle: ఫెరారీ నుంచి ఎలక్ట్రిక్ వాహనం.. 2025లో మార్కెట్లోకి విడుదల.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ఇటీవల నిర్వహించిన యాన్యువల్ జనరల్ మీటింగ్‌లో ఫెరారీ పూర్తిగా బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ వాహనాన్ని అభివృద్ధి చేస్తున్నట్టు ప్రకటించింది. మొట్టమొదటి ఎలక్ట్రానిక్ వేకిల్‌ను ఫెరారీ 2025లో విడుదల చేయనున్నట్లు తెలిపింది.

  • Share this:
వాతావరణ మార్పులు, పర్యావరణ కాలుష్యాన్ని ఎదుర్కొనేందుకు వాహన తయారీ సంస్థలు తమవంతు ప్రయత్నం చేస్తున్నాయి. వాహనాల నుంచి వెలువడే కాలుష్యాన్ని తగ్గించేందుకు కంపెనీలు అదునాతన ఇంజిన్లను వినియోగిస్తున్నాయి. మన దేశంలో కూడా బీఎస్-6 ఇంజిన్లను మాత్రమే కొత్త వాహనాల తయారీలో వాడాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో గ్రీన్ ఎనర్జీ నినాదాన్ని అంతర్జాతీయ కార్ల తయారీ సంస్థలు అందిపుచ్చుకుంటున్నాయి. ప్రపంచం వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలను కంపెనీలు రూపొందిస్తున్నాయి. ఈ జాబితాలో ప్రఖ్యాత సంస్థ ఫెరారీ కూడా చేరింది. ఇటీవల నిర్వహించిన యాన్యువల్ జనరల్ మీటింగ్‌లో ఫెరారీ పూర్తిగా బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ వాహనాన్ని అభివృద్ధి చేస్తున్నట్టు ప్రకటించింది. మొట్టమొదటి ఎలక్ట్రానిక్ వేకిల్‌ను ఫెరారీ 2025లో విడుదల చేయనుంది.

ఫెరారీ సంస్థ ఇటీవల యాన్యువల్ జనరల్ మీటింగ్‌ నిర్వహించింది. సమావేశంలో సంస్థ సీఈఓ జాన్ ఎల్కాన్ మాట్లాడారు. చరిత్రలో నిలిచిపోయే విధంగా కంపెనీ నుంచి ఎలక్ట్రిక్‌ వాహనం విడుదల కానుందని చెప్పారు. ఫెరారీ ఇంజనీర్లు, డిజైనర్లు ఇందుకు ఎంతగానో కృషి చేస్తున్నారని చెప్పారు. 2025లో ఫెరారీ ఈవీని లాంఛ్ చేస్తామని వెల్లడించారు. దీంట్లో క్వాడ్ మోటార్ సెటప్‌తో మొత్తం నాలుగు ఇంజిన్లు ఉంటాయని సంస్థ తెలిపింది. ఫెరారీ ఇప్పటికే కొన్ని వాహనాలను ఎలక్ట్రిఫికేషన్ చేసింది. లాఫెరారీ, SF90 స్ట్రాడేల్, స్పైడర్ వంటి హైబ్రిడ్ సూపర్ కార్లను సంస్థ విడుదల చేసింది. కానీ 2025లో విడుదల కానున్న వాహనం.. సంస్థ నుంచి రానున్న మొట్టమొదటి పూర్తిస్తాయి ఎలక్ట్రిక్ వేకిల్ కావడం విశేషం. ఈ ఆల్- ఎలక్ట్రిక్ కారు కోసం సంస్థ ఇంజినీర్లు విస్తృతమైన ప్రయోగాలు చేస్తున్నారు.

ప్రీమియం కార్ల విభాగంలో ఫెరారీకి ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. పోటీ సంస్థలు ఇప్పటికే కొత్త మోడళ్లతో కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారుల అవసరాలకు తగ్గట్టు పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాన్ని రూపొందించాలని సంస్థ భావించింది. దీంతో పాటు రానున్న రోజుల్లో విడుదల చేయనున్న మూడు కొత్త మోడళ్లను కూడా ఫెరారీ ప్రకటించింది. 2023లో జరగనున్న లే మాన్స్ రేస్‌ సందర్భంగా కొత్త మోడళ్లను విడుదల చేయనున్నట్లు తెలిపింది. మొట్టమొదటి ఫెరారీ ఈవీ మార్కెట్లోకి రాకముందే ‘పురోసాంగ్వే’ అనే ఎస్‌యూవీని ఫెరారీ విడుదల చేయనుంది. 2022లో ఈ వాహనం రోడ్ల పైకి రానుంది. ఇది ఫెరారీ నుంచి రానున్న మొదటి స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం కావడం విశేషం.
Published by:Nikhil Kumar S
First published: