Bank | ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంకుల్లో ఒకటైన ఫెడరల్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంక్ అకౌంట్లపై (Bank Account) వడ్డీ రేట్లు సవరించింది. ఈ కొత్త నిర్ణయం ఇప్పటికే అమలులోకి వచ్చింది. జనవరి 23 నుంచి వడ్డీ రేట్ల సవరణ వర్తిస్తుందని బ్యాంక్ (Bank News) తెలిపింది. అందువల్ల బ్యాంక్‌లో అకౌంట్ కలిగిన వారు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ఇప్పుడు సేవింగ్స్ ఖాతాపై ఎంత వడ్డీ వస్తోందో తెలుసుకోవడం ఉత్తమం.
ఫెడరల్ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్లు ఆర్‌బీఐ రెపో రేటుతో అనుసంధానమై ఉంటాయి. అంటే రెపో రేటు మారితే.. అందుకు అనుగుణంగా ఫెడరల్ బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలపై కూడా వడ్డీ రేట్లు మారతాయి. ప్రస్తుతం ఆర్‌బీఐ రెపో రేటు 6.25 శాతం వద్ద కొనసాగుతోంది. బ్యాంక్ వడ్డీ రేట్ల సవరణ నేపథ్యంలో ప్రస్తుతం బ్యాంక్ అకౌంట్లపై ఎంత వడ్డీ రేటు వస్తోందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎస్‌బీఐ బంపరాఫర్.. ఈ యాప్‌తో ఇంట్లోంచే రూ.35 లక్షల వరకు లోన్ పొందండి!
రూ. 5 లక్షలలోపు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే.. అలాంటి అకౌంట్లపై వడ్డీ రేటు రెపో రేటుకు 3.2 శాతం తక్కువగా ఉంటుంది. రూ. 5 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు బ్యాలెన్స్ ఉన్న అకౌంట్లపై కూడా వడ్డీ రేటు రెపో రేటుకు 3.15 శాతం నుంచి 3.2 శాతం వరకు తక్కువగా ఉంటుంది. రూ.50 లక్షల నుంచి రూ. 2 కోట్ల వరకు బ్యాలెన్స్ ఉన్న ఖాతాలపై వడ్డీ రేటును గమనిస్తే.. రెపో రేటుకు 2.5 శాతం నుంచి 3.2 శాతం వరకు తక్కువగా లభిస్తుంది.
బ్యాంక్ కస్టమర్లకు ఆర్‌బీఐ శుభవార్త.. కీలక ప్రకటన!
అలాగే రూ.2 కోట్ల నుంచి రూ. 5 కోట్ల వరకు బ్యాలెన్స్ ఉన్న ఖాతాలపై అయితే వడ్డీ రేటు రెపో రేటుకు 3.2 శాతం నుంచి 2.25 శాతం వరకు తక్కువగా లభిస్తుంది. రూ. 5 కోట్ల నుంచి రూ. 50 కోట్ల వరకు బ్యాలెన్స్ ఉన్న అకౌంట్లపై వడ్డీ రేటు రెపో రేటుకు 0.75 శాతం నుంచి 3.2 శాతం వరకు తక్కువగా వస్తుంది. రూ. 50 కోట్లు లేదా ఆపైన బ్యాలెన్స్ ఉంటే.. అప్పుడు వడ్డీ రేటు రెపో రేటుకు 0.25 శాతం నుంచి 3.2 శాతం వరకు తక్కువగా లభిస్తుంది. రోజూవారీ బ్యాలెన్స్ లెక్కింపు ప్రాతిపదికన వడ్డీ మొత్తాన్ని నిర్ణయిస్తారు. ఇకపోతే వడ్డీ డబ్బులు మూడు నెలలకు ఒకసారి చెల్లిస్తారు. కాగా ఆర్‌బీఐ రెపో రేటు పెంపు నేపథ్యంలో చాలా బ్యాంకులు ఇప్పటికే సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేట్లను సవరించాయి. ఇప్పుడు ఈ బ్యాంక్ కూడా ఈ జాబితాలో చేరింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank, Bank account, Banks, Interest rates, Saving account