Bank Account | ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంక్ ఫెడరల్ బ్యాంక్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. కస్టమర్లకు ఊరట కలిగే ప్రకటన చేసింది. దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటు పెంపు నేపథ్యంలో ఈ బ్యాంక్ (Bank) కూడా వడ్డీ రేట్లను పెంచేసింది. సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేటును పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ రోజు నుంచే రేట్ల పెంపు అమలులోకి వస్తుందని బ్యాంక్ తెలిపింది. కాగా ఆర్బీఐ రెపో రేటు 35 బేసిస్ పాయింట్ల పెరుగుదలతో 5.9 శాతం నుంచి 6.25 శాతానికి చేరింది.
బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం చూస్తే.. ఫెడరల్ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేట్లు రెపో రేటుతో అనుసంధానం అయ్యి ఉంటాయి. అందువల్ల ఆర్బీఐ రెపో రేటు పెంచితే.. అప్పుడు ఆటోమేటిక్‌గా సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేట్లు పైకి కదులుతాయి. బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్లపై వడ్డీ రేట్లను గమనిస్తే.. రూ. 5 లక్షల వరకు బ్యాలెన్స్ కలిగిన ఖాతాలపై వడ్డీ రేటు 3.2 శాతంగా ఉంది.
వాహనదారులకు అలర్ట్.. ఈ రూల్స్ మారాయి, ఉల్లంఘిస్తే రూ.2 వేలు జరిమానా!
రూ. 5 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు బ్యాలెన్స్ ఉన్న బ్యాంక్ ఖాతాలపై వడ్డీ రేటును గమనిస్తే.. రూ.లక్ష వరకు మొత్తానికి రెపో రేటు కన్నా 3.2 శాతం తక్కువ వడ్డీని, రూ.లక్ష పైన మొత్తానికి ఆర్బీఐ రెపో రేటు కన్నా 3.15 శాతం తక్కువ వడ్డీని అందించనుంది. అలాగే రూ. 50 లక్షల నుంచి రూ.5 కోట్ల మొత్తం కలిగిన ఖాతాలపై అయితే.. రూ. లక్ష వరకు మొత్తంగా రెపో రేటు కన్నా 3.2 శాతం తక్కువ వడ్డీని, ఆపైన ఉన్న మొత్తంపై రెపో రేటు కన్నా 3 శాతం తక్కువ వడ్డీని అందించనుంది.
కొత్త స్కీమ్.. రూ.5 లక్షల నుంచి రూ. 30 లక్షల వరకు రుణం పొందండిలా!
ఇంకా రూ. 5 కోట్ల నుంచి రూ. 50 కోట్ల బ్యాలెన్స్ ఉన్న ఖాతాలపై అయితే.. రూ.లక్ష మొత్తానికి రెపో రేటు కన్నా 3.2 శాతం తక్కువ వడ్డీని అందించనుంది. అలాగే ఆపైన మొత్తంపై అయితే రెపో రేటు కన్నా 0.75 శాతం తక్కువ వడ్డీ లభిస్తుంది. ఇక రూ. 50 కోట్లు, ఆపైన బ్యాలెన్స్‌పై గమనిస్తే.. రూ.లక్ష మొత్తానికి రెపో రేటు కన్నా 3.2 శాతం తక్కువ వడ్డీని, మిగిలిన మొత్తంపై రెపో రేటు కన్నా 0.25 శాతం తక్కువ వడ్డీని పొందొచ్చు. కాగా ఫెడరల్ బ్యాంక్ వడ్డీ మొత్తాన్ని మూడు నెలలకు ఒకసారి బ్యాంక్ కస్టమర్లకు అందిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank account, BANK ACCOUNTS, Banks, Interest rates