Home /News /business /

FEATURES AND BENEFITS OF THE BAJAJ HOUSING FINANCE ONLINE HOME LOAN GH SSR

Bajaj Housing Finance: బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ సరికొత్త చొరవ.. ఆన్‌లైన్‌లో తక్షణమే హోంలోన్ పొందే సౌలభ్యం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇల్లు లేదా ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేయడానికి హోంలోన్లు తీసుకునేవారి సంఖ్య మన దేశంలో చాలా ఎక్కువ. అయితే ఈ గృహరుణాలు అంత సులభంగా రావు. ఇందుకోసం ఎంతో డాక్యుమెంటేషన్ వర్క్, క్లిష్టమైన ప్రాసెసింగ్ విధానాలు ఉంటాయి. అయితే ఇటీవల కాలంలో చాలా వరకు హోంలోన్ సంస్థలు ఈ విధానానికి స్వస్తి పలుకుతున్నాయి.

ఇంకా చదవండి ...
ఇల్లు లేదా ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేయడానికి హోంలోన్లు తీసుకునేవారి సంఖ్య మన దేశంలో చాలా ఎక్కువ. అయితే ఈ గృహరుణాలు అంత సులభంగా రావు. ఇందుకోసం ఎంతో డాక్యుమెంటేషన్ వర్క్, క్లిష్టమైన ప్రాసెసింగ్ విధానాలు ఉంటాయి. అయితే ఇటీవల కాలంలో చాలా వరకు హోంలోన్ సంస్థలు ఈ విధానానికి స్వస్తి పలుకుతున్నాయి. తాజాగా బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ వేతనదారులు, ప్రొఫెషనల్ దరఖాస్తుదారుల కోసం హోంలోన్ ప్రక్రియను పునరుద్ధరించింది. ఆన్‌లైన్‌లోనే గృహరుణాల కోసం దరఖాస్తు చేసుకునే సౌలభ్యాన్ని ప్రవేశపెట్టింది. ఇందుకోసం DIY జర్నీని ప్రారంభించింది.

దీని ద్వారా కొత్తగా హోంలోన్ల కోసం దరఖాస్తు చేసుకునేవారు, బ్యాలెన్స్ బదిలీ చేసే దరఖాస్తుదారులు డిజిటల్ శాంక్షన్ లెటర్‌ను స్వీకరించడానికి కేవలం 8 ఫీల్డ్‌లను మాత్రమే పూర్తిచేయాలి. ఇందులో మీ పేరు, పాన్ కార్డు, ఆదాయం, తప్పనిసరిగా పొందుపరచాలి. ఈ ప్రక్రియకు కేవలం 10 నిమిషాలు మాత్రమే పడుతుంది.

వివరాలను నమోదు చేసిన తర్వాత దరఖాస్తుదారులు లోన్ ఆఫర్.. అంటే పొందగలిగే రుణ మొత్తం చూస్తారు. ఈఎంఐ క్యాలిక్యులేటర్ ఉపయోగించి మీ లోన్‌ను ఎన్ని ఈఎంఐల రూపంలో చెల్లించాలో లెక్కించవచ్చు. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ దాదాపు 30 ఏళ్ల వరకు కాలపరిమితిని ఇచ్చింది. ఫలితంగా దీర్ఘకాలంలో సౌకర్యవంతంగా తిరిగి చెల్లించడానికి వీలు కల్పిస్తుంది. ప్రాపర్టీ నుంచి వచ్చే అద్దే, పెట్టుబడి డివిడెంట్ లాంటి అదనపు అదనపు ఆదాయ మార్గాల వివరాలను నమోదు చేసే నిబంధన ఈ ఫారంలో ఉంటుంది. పెద్ద మొత్తంలో రుణం పొందాలనుకునేవారు సహ-దరఖాస్తుదారుని చేర్చే మరో ఆప్షన్ కూడా ఉంది.

* పండుగ ఆఫర్..
బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లో హోంలోన్ పొందాలనుకువారికి ఈ సంస్థ పండుగ ఆఫర్ ప్రకటించింది. దరఖాస్తుదారులు ప్రాసెసింగ్ ఫీజును కేవలం రూ.1999 (జీఎస్టీ అదనం)లనే చెల్లించే సౌలభ్యాన్ని కల్పించింది. ఇది రుణ మొత్తంలో 0.25 శాతం నుంచి ప్రారంభమయ్యే సాధారణ రుసుము కంటే చాలా తక్కువ. ఈ ఆఫర్ అక్టోబరు 30 వరకే అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా ప్రొఫెషనల్ దరఖాస్తుదారుల కోసం బజాజ్ సంస్థ వడ్డీ రేటును 6.75 నుంచి 6.70 శాతానికి తగ్గించింది. ఫలితంగా దరఖాస్తుదారులు తక్కువ వడ్డీని పొందవచ్చు.

* ఆన్‌లైన్‌ హోంలోన్ ఫీచర్లు, ప్రయోజనాలు..
ఈ ప్రక్రియలో ఎన్నో రుణగ్రస్తులు ఎన్నో ఫీచర్లు, ప్రయోజనాలు పొందుతారు.

- 10 నిమిషాల్లోనే డిజిటల్ శాంక్షన్ లెటర్ లభిస్తుంది.

- కాంపిటీటివ్ వడ్డీ రేటు ఏడాదికి 6.70 శాతం కాగా.. ఈఎంఐ నెలవారీగా లక్షకు రూ.645 నుంచి ప్రారంభమవుతుంది.

- బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ సౌకర్యం ఉంది. అంటే అర్హత ప్రాతిపదికన టాప్-అప్ లోన్ కోటి వరకు ఉంటుంది.

- సీజబుల్ లోన్ అమౌంట్ రూ.5 కోట్లు లేదా అర్హత ప్రకారం అంతకంటే ఎక్కువ లభిస్తుంది

- సౌకర్యవంతమైన రీపేమెంట్ ఆప్షన్ ఉంది. అంటే 30 ఏళ్ల వరకు చెల్లించవచ్చు.

- 48 గంటల లోపల ఇబ్బంది లేకుండా త్వరితగతిన లోన్ ప్రాసెసింగ్ అవుతుంది.

- రెపో రేటు లాంటి బాహ్య బెంచ్ మార్కులకు గృహ రుణాలు అనుసంధానమై ఉంటాయి

- ఆన్‌లైన్‌ అకౌంట్ మేనెజ్మెంట్ ఫీచర్ తో రుణం పొందిన తర్వాత డిజిటల్ అనుభూతి లభిస్తుంది.

- PMAY పథకం కింద ఎల్ఐజీ, ఈడబ్ల్యూఎస్ విభాగాల ద్వారా 6.5 శాతం వరకు వడ్డీ రాయితీ

- 5 వేలకు పైగా ఆమోదిత ప్రాజెక్టులు

- దరఖాస్తుదారుని అవసరాలకు అనుగుణంగా రీపేమెంట్ ఆప్షన్లు.

* డిజిటల్ శాంక్షన్ లెటర్ లో ఏం ఉంటుంది?
ఇది ఓ అధికారిక డాక్యుమెంట్. అర్హతను నిరూపించడానికి, విక్రయదారునితో మంచి చర్చలు జరపడానికి ఉపయోగిస్తారు. ఈ డాక్యుమెంట్ 180 రోజుల వరకు చెల్లుబాటు అవుతుంది. ఇందులో శాంక్షన్ అమౌంట్, రుణ కాల వ్యవధి, వడ్డీ రేటు లాంటి కీలక వివరాలు ఉంటాయి.

* ఎవరు అర్హులు?
స్థిర వేతనం పొందుతున్న వ్యక్తులు, ప్రొఫెషనల్ దరఖాస్తుదారులు ఇద్దరూ ఈ ఆన్‌లైన్‌ హోంలోన్ కు అర్హులే. అయితే వీరు కొన్ని ప్రమాణాలను కలిగి ఉండాలి.

- భారతీయ పౌరుడై.. ఇక్కడ నివసిస్తూ ఉండాలి.

- ప్రభుత్వ లేదా ప్రైవేటు సంస్థలో లేదా ఏదైనా ఎంఎన్సీ కంపెనీ 3 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.

- లోన్ మెచూరిటీ సమయం 62 ఏళ్లుగా లెక్కించడం వల్ల వయస్సు 23 నుంచి 62 ఏళ్ల మధ్య ఉండాలి.

- నివసిస్తున్న నగరం, వయస్సు ఆధారంగా నెలకు రూ.35 వేల కంటే ఎక్కువ వేతనాన్ని సంపాదిస్తూ ఉండాలి.

* ఏయే పత్రాలు కావాలి?
కాగితం రహిత ఆన్‌లైన్‌ హోంలోన్ కోసం దరఖాస్తుదారులు కొన్ని కీలక పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ దరఖాస్తు దారుడు ఫిజికల్ డాక్యుమెంట్ కాపీలను అందజేయాలనుకుంటే రుణదాత కూడా ఇంటి వద్ద నుంచే తీసుకునే సేవలను అందిస్తుంది.

- కేవైసీ పత్రాలైన పాన్ కార్డు, ఆధార్ కార్డు, యుటిలిటీ బిల్లులు తదితరాలు.

- ఆదాయ సంబంధిత పత్రాలైన పే స్లిప్స్(3 నెలలు), బ్యాంక్ స్టేట్మెంట్లు, ఐటీఆర్(2 ఏళ్లు).

- ప్రాపర్టీ సంబంధిత పత్రాలైన రిజిస్ట్రేషన్ రసీదు, అగ్రిమెంట్ కాపీ, ఆస్తి పన్ను రసీదుతో పాటు అమ్మకపు దస్తావేజు.

- ఇప్పటికే హోంలోన్ ఉన్నట్లయితే దానికి సంబంధించిన శాంక్షన్ లెటర్, అకౌంట్ స్టేట్మెంట్, ఫోర్ క్లోజర్ లెటర్(foreclosure letter) ను సమర్పించాలి.

- చివరగా సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యేందుకు బ్రాంచ్‌ను సందర్శించాలి లేదా రుణ ఒప్పందంలో సంతకం చేసి రిజిస్ట్రేషన్ ఫార్మాలిటీస్ పూర్తి చేయడానికి ఆ సంస్థ ప్రతినిధికి కాల్ చేయాలి.
Published by:Sambasiva Reddy
First published:

Tags: Bajaj finance, Business, Finance, Home loan, Housing Loans

తదుపరి వార్తలు