Make In India: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో సరికొత్త రికార్డు...ఈ ఏడాది 13 శాతం పెరుగుదల...

2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత్ రికార్డు స్థాయిలో. 49.97 బిలియన్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డిఐ) ఆకర్షించింది. ఇది 2018-19 ఆర్థిక సంవత్సరం కంటే 13 శాతం ఎక్కువ.

news18-telugu
Updated: May 29, 2020, 7:03 AM IST
Make In India: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో సరికొత్త రికార్డు...ఈ ఏడాది 13 శాతం పెరుగుదల...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత్ రికార్డు స్థాయిలో. 49.97 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డిఐ) ఆకర్షించింది. ఇది 2018-19 ఆర్థిక సంవత్సరం కంటే 13 శాతం ఎక్కువ. గురువారం విడుదల చేసిన అధికారిక డేటాలో ఈ విషయం పేర్కొన్నారు. డేటా ప్రకారం, గత నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో భారతదేశంలో FDIలు వేగంగా వృద్ధి చెందాయి. 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఎఫ్‌డిఐని 35 శాతం పెంచారు. అయితే 2000-01 నుండి ఎఫ్డిఐకి సంబంధించిన గణాంకాలు విడుదల చేస్తున్నారు. 2015-16 ఆర్థిక సంవత్సరం వృద్ధి అప్పటి నుండి అత్యధికం. అంతకుముందు, 2018-19 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం 44.36 బిలియన్ డాలర్ల ఎఫ్డిఐని అందుకుంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో పాత ఎఫ్డిఐ ఆదాయంలో తిరిగి పెట్టుబడులు పెట్టడం, అలాగే ఇతర మూలధన ప్రవాహాలపై ఏడాది క్రితం 62 బిలియన్ డాలర్లతో పోలిస్తే, ఈ సంవత్సరంలో మొత్తం ఎఫ్డిఐ 73.45 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. దీనిపై వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ ట్వీట్‌లో మాట్లాడుతూ, మేక్ ఇన్ ఇండియాకు విజయానికి ఇది సాక్ష్యమని అన్నారు. భారతదేశంలో ఎఫ్‌డిఐ 18 శాతం పెరిగి 2019-20లో 73 బిలియన్ డాలర్లకు చేరుకుంది. మొత్తం ఎఫ్డిఐ 2013-14 స్థాయికి రెండింతలు అన్నారు. ఈ దీర్ఘకాలిక పెట్టుబడులు ఉపాధి కల్పనను వేగవంతం చేస్తాయని పేర్కొన్నారు.

"పరిశ్రమ, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ గణాంకాల ప్రకారం, సేవల రంగానికి 2019-20లో అత్యధికంగా 7.85 బిలియన్ డాలర్ల FDI లభించింది. దీని తరువాత కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ మరియు హార్డ్‌వేర్‌లో 7.67 బిలియన్ డాలర్లు, టెలికమ్యూనికేషన్స్‌లో 4.44 బిలియన్ డాలర్లు, వ్యాపారంలో 4.57 బిలియన్ డాలర్లు, వాహనాలలో 2.82 బిలియన్ డాలర్లు, నిర్మాణంలో 2 బిలియన్ డాలర్లు , 1 బిలియన్ డాలర్ల రసాయనాలు ఉన్నాయి. ఈ కాలంలో, సింగపూర్ అత్యధిక ఎఫ్డిఐని 14.67 బిలియన్ డాలర్లను భారత్ లో పెట్టుబడులుగా పెట్టింది. ఇక  సింగపూర్ ద్వారా భారతదేశంలో గరిష్ట ఎఫ్‌డిఐలు రావడం ఇది వరుసగా రెండవ ఆర్థిక సంవత్సరం. అయితే, ఇది 2018-19లో 16.22 బిలియన్ డాలర్ల ఎఫ్డిఐ కంటే తక్కువ. అంతేకాకుండా, మారిషస్ నుండి 8.24 బిలియన్ డాలర్లు, నెదర్లాండ్స్ నుండి 6.5 బిలియన్ డాలర్లు, యుఎస్ నుండి 4.22 బిలియన్ డాలర్లు, కేమాన్ దీవుల నుండి 3.7 బిలియన్ డాలర్లు, జపాన్ నుండి 3.22 బిలియన్ డాలర్లు, ఫ్రాన్స్ నుండి 1.89 బిలియన్ డాలర్లు, బ్రిటన్ నుండి 1.42 బిలియన్ డాలర్లు, సైప్రస్ నుండి 87.9 మిలియన్ డాలర్లు, 488 మిలియన్ డాలర్ల ఎఫ్డిఐ జర్మనీ నుండి వచ్చింది.
First published: May 29, 2020, 7:03 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading