బ్యాంకులు రుణ వడ్డీ రేట్లపై తమ మార్జిన్‌ను తగ్గిస్తాయి. అంటే రుణాలపై రేట్లు కూడా తగ్గుతాయి. అలాగే, ఫిక్స్ డ్ డిపాజిట్లపై కూడా వడ్డీలను బ్యాంకులు తగ్గించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ శక్తికాంత్ దాస్ రెపో రేట్(Repo Rate Cuts) కోత విధిస్తూ మళ్లీ 0.40 శాతం తగ్గింపును ప్రకటించారు. ఈ నిర్ణయాల వల్ల చిన్న కంపెనీలు, బ్యాంకులు లబ్ధి పొందుతాయి. కానీ ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లపై ఇది ప్రభావం చూపే అవకాశం ఉందని ఎకనామిక్ టైమ్స్ పేర్కొంది. బ్యాంకులు రుణ వడ్డీ రేట్లపై తమ మార్జిన్‌ను తగ్గిస్తాయి. అంటే రుణాలపై రేట్లు కూడా తగ్గుతాయి. అలాగే, ఫిక్స్ డ్ డిపాజిట్లపై కూడా వడ్డీలను బ్యాంకులు తగ్గించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆర్బిఐ దశల వారీగా బ్యాంక్ డిపాజిట్ల రేట్లపై వడ్డీ రేట్లను తగ్గించగలవని నిపుణులు అంటున్నారు. ఆర్థిక వ్యవస్థలో అధిక ద్రవ్యత వడ్డీ రేట్లపై ఒత్తిడి తెస్తుంది. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 0.25 నుండి 0.50 శాతానికి తగ్గించే వీలుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గతంలో కూడా ఆర్బిఐ వడ్డీ రేట్లను 0.75 శాతం తగ్గించినప్పుడు, అప్పట్లో ఎస్బిఐతో సహా చాలా పెద్ద బ్యాంకులు ఎఫ్‌డిపై వడ్డీ రేట్లను తగ్గించాయి. మే 12న ఎస్బిఐ (SBI fixed Deposits) 3 సంవత్సరాల ఫిక్స్డ్ డిపాజిట్లపై నుంచి 0.20 శాతానికి తగ్గించింది. బ్యాంక్ లిక్విడిటీని దృష్టిలో ఉంచుకుని, రిటైల్ టర్మ్ డిపాజిట్ల రేటులో 3 సంవత్సరాల కాలానికి కోత పెడుతున్నామని బ్యాంక్ ఒక ప్రకటన విడుదల చేసింది.
ఇప్పుడు ఏమి చేయాలి పెట్టుబడిదారు - పెట్టుబడి ఎంపికల గురించి ఆలోచించే ముందు, పెట్టుబడిదారులు వారి రిస్క్ తీసుకునే సామర్థ్యాన్ని చూడాలి. వడ్డీ రేట్లు తగ్గినప్పుడు, రాబడికి బదులుగా, పెట్టుబడిదారులు తమ మూలధనాన్ని రక్షించుకోవడం గురించి ఆలోచించాలి.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.