FD RATES INDIAN OVERSEAS BANK REVISES INTEREST RATES ON FIXED DEPOSITS HERE ARE THE LATEST INTEREST RATES GH VB
Fixed Deposit Rates: ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించిన ప్రముఖ బ్యాంక్.. తాజా వడ్డీ రేట్లు ఇవే..
(ప్రతీకాత్మక చిత్రం)
బ్యాంక్ (IOB) కీలక నిర్ణయం తీసుకుంది. ఫిక్స్డ్ డిపాజిట్ (FD)లపై వడ్డీ రేట్లను బ్యాంకు సవరించింది. స్వల్పకాలిక వ్యవధికి రూ.2 కోట్ల కంటే తక్కువ మొత్తంలో చేసే ఎఫ్డీలపై వడ్డీ రేట్లను ఐఓబీ తాజాగా తగ్గించింది.
కొత్త ఆర్థిక సంవత్సరంలో వివిధ బ్యాంకులు వడ్డీ రేట్లను సమీక్షిస్తున్న నేపథ్యంలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB) కీలక నిర్ణయం తీసుకుంది. ఫిక్స్డ్ డిపాజిట్ (FD)లపై వడ్డీ రేట్లను బ్యాంకు సవరించింది. స్వల్పకాలిక వ్యవధికి రూ.2 కోట్ల కంటే తక్కువ మొత్తంలో చేసే ఎఫ్డీలపై వడ్డీ రేట్లను ఐఓబీ తాజాగా తగ్గించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), HDFC బ్యాంక్, ICICI బ్యాంక్, ఇతర రుణదాతలు తమ టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్న సమయంలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం, కొత్త రేట్లు ఏప్రిల్ 11 నుంచి అమల్లోకి వచ్చాయి. ఏడు రోజుల నుంచి ఒక సంవత్సరం టెన్యూర్ వరకు చేసే FDలపై వడ్డీ రేట్లు 40 బేసిస్ పాయింట్లు తగ్గాయి. ఈ FDలపై ఇప్పుడు 3 శాతం వడ్డీ మాత్రమే లభిస్తుంది.
46 నుంచి 90 రోజుల గడువుతో చేసే ఎఫ్డీలపై వడ్డీ రేట్లు 40 బేసిస్ పాయింట్లు తగ్గాయి. ఈ FDలపై ఇప్పుడు 3.50 శాతం వడ్డీ లభిస్తుంది. 91 నుంచి 179 రోజుల్లో మెచ్యూర్ అయ్యే టర్మ్ డిపాజిట్లపై ఈ బ్యాంక్ కస్టమర్లకు ఇప్పుడు 4 శాతం వడ్డీ లభిస్తుంది. 180 రోజుల నుంచి ఒక సంవత్సరం కంటే తక్కువ వ్యవధిలో మెచ్యూర్ అయ్యే FDలపై వడ్డీ రేటు 4.50 శాతంగా ఉంది. ఒక సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల వరకు చేసే డిపాజిట్లపై వడ్డీ రేట్లు మారవు. ఫిక్స్డ్ డిపాజిట్ల కనీస మొత్తం రూ. 1 లక్ష ఉండాలి. బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం, సీనియర్ సిటిజన్లకు 0.50% అదనపు రేటును ఐఓబీ అందిస్తుంది. సూపర్ సీనియర్ సిటిజన్లకు.. అంటే 80 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారికి 0.75% అదనపు రేటు కొనసాగుతుంది.
* తాజా ఎఫ్డీ వడ్డీరేట్ల వివరాలు..
7- 14 రోజులు - 3 శాతం
15- 29 రోజులు - 3 శాతం
30- 45 రోజులు - 3 శాతం
46- 60 రోజులు - 3.50 శాతం
61- 90 రోజులు - 3.50 శాతం
91- 120 రోజులు - 4 శాతం
121- 179 రోజులు - 4 శాతం
180- 269 రోజులు - 4.50 శాతం
270 రోజుల నుంచి ఒక సంవత్సరం వరకు - 4.50 శాతం
ఒక సంవత్సరం నుంచి రెండేళ్ల వరకు (444 రోజులు మినహా) - 5.15 శాతం
అయితే బ్యాంక్ ఒక సంవత్సరం నుంచి 3 సంవత్సరాల వరకు వడ్డీ రేట్లను మార్చలేదు. IOB వెబ్సైట్ ప్రకారం 7- 14 రోజులకు ఫిక్స్డ్ డిపాజిట్ కోసం కనీస మొత్తం రూ. 1 లక్షగా ఉంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.