FD INVESTMENTS WANT TO GET MAXIMUM RETURN FROM YOUR BANK FDS FOLLOW THESE STEPS GH VB
FD Investments: ఈ స్టెప్స్ ఫాలో అయితే.. ఫిక్స్డ్ డిపాజిట్లతో ఎక్కువ రాబడి తెచ్చుకోవచ్చు.. ఎలా అంటే..
ప్రతీకాత్మక చిత్రం
అత్యంత సురక్షతమైన పెట్టుబడి మార్గాల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు (fixed deposits) ముందు వరుసలో ఉంటాయి. ఇతర ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ కంటే ఎఫ్డీలపై రాబడి తక్కువగా ఉన్నప్పటికీ.. వీటిలో ఎలాంటి నష్టభయం (fear of loss) ఉండదు. అలాగే నిరంతరంగా వడ్డీ (interest) అందుకోవచ్చు.
అత్యంత సురక్షతమైన పెట్టుబడి మార్గాల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు (fixed deposits) ముందు వరుసలో ఉంటాయి. ఇతర ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ కంటే ఎఫ్డీలపై రాబడి తక్కువగా ఉన్నప్పటికీ.. వీటిలో ఎలాంటి నష్టభయం (fear of loss) ఉండదు. అలాగే నిరంతరంగా వడ్డీ (interest) అందుకోవచ్చు. అయితే కోవిడ్-19 కారణంగా ఇటీవలి ఆర్థిక మందగమనంతో (economic slowdown) ఎఫ్డీ రేట్లలో కరెక్షన్ (correction) తలెత్తింది. ఫలితంగా ప్రస్తుతం అవి అత్యంత కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఇటువంటి పరిస్థితిలో మీరు మీ ఎఫ్‌డీల రాబడి (returns)ని ఎలా పెంచుకోవాలి? ఎఫ్డీలపై మీ రాబడిని పెంచడానికి ఎలాంటి స్ట్రాటజీని ఫాలో కావాలి? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అన్ని ఆప్షన్లను సరిపోల్చండి
ఇటీవల కాలంలో దాదాపు అన్ని ప్రముఖ బ్యాంకుల ఎఫ్డీ రిటర్న్ రేట్లు కొంత కరెక్షన్కు గురయ్యాయి. అయితే ప్రముఖ బ్యాంకుల ఎఫ్డీ రేట్లు ఒక్కసారిగా కరెక్షన్ బాటపట్టినా.. మంచి రిటర్న్ రేటుకు ఎఫ్డీ స్కీమ్‌లు ఆఫర్ చేసే బ్యాంకులు చాలానే ఉన్నాయి. కాబట్టి ఎఫ్డీ స్కీమ్ తీసుకునేముందు.. అందుబాటులో ఉన్న అన్ని ఆప్షన్లను సరిపోల్చండి. ముఖ్యంగా అందుబాటులో ఉన్న కార్పొరేట్ ఎఫ్డీ ఆఫర్లతో బ్యాంక్ ఎఫ్డీ స్కీమ్‌లను సరిపోల్చండి. మీ అవసరానికి సరిపోయే ఎఫ్డీ స్కీమ్ ఎంపిక చేసుకోండి. ప్రతి స్కీమ్ దాని స్వంత రిస్క్, పదవీకాలం, వడ్డీ రేటుతో వస్తుంది. పెట్టుబడిదారుడిగా కనీస రిస్క్‌తో ఉత్తమ రాబడిని అందించే పథకాన్ని ఎంచుకోవడం మీ లక్ష్యం. మీరు CRISIL వంటి ఏజెన్సీలు అందించే రేటింగ్ చెక్ చేసుకొని ఫలానా ఎఫ్డీ స్కీమ్ లాభాలు, నష్టాలను మరింత మెరుగ్గా అర్థం చేసుకోవచ్చు.
స్వల్పకాలిక పథకాలకు వెళ్లండి
స్వల్పకాలిక పెట్టుబడి ఆప్షన్స్ (short term investment) అనేవి అవసరమైనప్పుడు మీ నిధులను తరలించడానికి సౌలభ్యాన్ని కలిగి ఉంటాయి. ఎఫ్డీ రిటర్న్ ప్రస్తుతం అత్యల్పంగా ఉంది కాబట్టి దీర్ఘకాలిక స్కీమ్‌లో మీ ధనాన్ని జమ చేయడం అంత మంచిది కాదు. ఇలా చేస్తే భవిష్యత్తులో మంచి రిటర్న్స్ అందించే పెట్టుబడుల్లో ఇన్వెస్ట్ చేసేంత డబ్బులు మీ దగ్గర ఉండవు. అందుకే షార్ట్ టర్మ్ ఎఫ్డీ ఆప్షన్స్ ఎంపిక చేసుకోండి.
మీ పోర్ట్‌ఫోలియోలో వైవిధ్యం
మీ పోర్ట్‌ఫోలియోలో వివిధ రకాల పెట్టుబడి ఆప్షన్స్ చేర్చడం ద్వారా మీ నష్టాలను పరిమితం చేయవచ్చు. ఒకే ఎఫ్డీలో భారీ మొత్తంలో జమ చేయడం కంటే.. చిన్న పథకాల్లో పెట్టుబడి పెట్టడం మంచిది. దీనివల్ల వివిధ రాబడి రేట్లు, పదవీకాలం, రిస్క్ లిమిట్స్ తో మీ క్యాపిటల్ ను సురక్షితంగా ఉంచుకోవచ్చు.
మీ వడ్డీని మళ్లీ పెట్టుబడి పెట్టండి
కళ్లు చెదిరే రాబడి సంపాదించడానికి మీరు ఎఫ్డీలపై పొందిన వడ్డీని మళ్లీ పెట్టుబడి పెట్టండి. తిరిగి పెట్టుబడి పెట్టినప్పుడు వచ్చే వడ్డీ మీ ప్రిన్సిపల్‌ను పెంచుతుంది. తద్వారా మరింత రాబడిని పొందవచ్చు.
ఫ్లోటింగ్ రేట్ ఎఫ్డీలు
ఫ్లోటింగ్ రేట్ ఎఫ్డీలు డైనమిక్ వడ్డీ రేట్ల సౌలభ్యాన్ని అందిస్తాయి. ఈ పథకంలో వడ్డీ రేటు స్థిరంగా ఉండకుండా.. తరచూ హెచ్చుతగ్గులకు గురవుతుంది. మీరు ఇప్పటికే ఉన్న ఎఫ్డీలు మూసివేసి, మళ్లీ బుక్ చేసుకోనవసరం లేకుండా ఫ్లోటింగ్ ఎఫ్‌డీల వడ్డీ రేట్ల హెచ్చుతగ్గుల ప్రయోజనాలను పొందేందుకు మిమ్మల్ని అనుమతిస్తాయి. సంవత్సరానికి ఒకసారి రీసెట్ అయ్యే మార్క్-అప్‌తో రెండు వారాలపాటు వేలానికి వెళ్లే బ్యాంక్ ట్రెజరీ బిల్లు రేట్లలో కదలిక ప్రకారం ఈ వడ్డీ రేట్లు నిర్ణయిస్తారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.