FD INTEREST RATES MAY 2022 THESE BANKS OFFERING 6 PER CENT TO 7 PER CENT INTEREST RATE ON FIXED DEPOSITS SS
FD Interest Rates: ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారా? ఈ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ఎక్కువ
FD Interest Rates: ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారా? ఈ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ఎక్కువ
(ప్రతీకాత్మక చిత్రం)
FD Interest Rates | బ్యాంకులు ఇటీవల ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు పెంచుతున్నాయి. మూడేళ్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై (Fixed Deposits) బ్యాంకులు 6 నుంచి 7 శాతం వరకు వడ్డీని ఇస్తున్నాయి.
మీరు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ (Fixed Deposit) చేయాలనుకుంటున్నారా? బ్యాంకులు ఇటీవల ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను (FD Interest Rates) పెంచాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేట్ 40 బేసిస్ పాయింట్స్ పెంచడంతో బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంటున్నాయి. మరి ఏ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఎక్కువ వడ్డీ వస్తుంది? ప్రస్తుతం ఏ బ్యాంకులో ఎఫ్డీ వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయి అనే వివరాలను కస్టమర్లు సెర్చ్ చేస్తున్నారు. Bank Bazaar అందిస్తున్న సమాచారం ప్రకారం బ్యాంకులు 7 శాతం వరకు వడ్డీని ఇస్తున్నాయి. వడ్డీ రేట్లు 6 శాతం నుంచి ప్రారంభం అవుతున్నాయి. మరి ఏ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
ఒకటి నుంచి రెండేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్లకు వడ్డీ రేట్లు ఇవే
ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్- 6.50 శాతం
బంధన్ బ్యాంక్- 6.25 శాతం
డీసీబీ బ్యాంక్- 6.25 శాతం
ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్- 6.50 శాతం
ఫిన్కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్- 6.50 శాతం
ఇండస్ఇండ్ బ్యాంక్- 6.50 శాతం
జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్- 6.50 శాతం
ఆర్బీఎల్ బ్యాంక్- 6.50 శాతం
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్- 6.50 శాతం
టీఎన్ఎస్సీ బ్యాంక్- 6.00 శాతం
ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్- 6.60 శాతం
యెస్ బ్యాంక్- 6.00 శాతం
రెండు నుంచి మూడేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్లకు వడ్డీ రేట్లు ఇవే
ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్- 6.75 శాతం
బంధన్ బ్యాంక్- 6.25 శాతం
డీసీబీ బ్యాంక్- 6.25 శాతం
ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్- 6.75 శాతం
ఫిన్కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్- 6.50 శాతం
ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్- 6.00 శాతం
ఇండస్ఇండ్ బ్యాంక్- 6.50 శాతం
జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్- 6.75 శాతం
ఆర్బీఎల్ బ్యాంక్- 6.50 శాతం
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్- 7.00 శాతం
ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్- 6.75 శాతం
యస్ బ్యాంక్- 6.25 శాతం
ఫిక్స్డ్ డిపాజిట్లపై 6 నుంచి 7 శాతం మధ్య వడ్డీ ఆఫర్ చేస్తున్న బ్యాంకులు ఇవే. 2022 మే 13 నాటికి ఆయా బ్యాంకులు అందిస్తున్న వడ్డీ వివరాలను BankBazaar.com సేకరించింది. ఈ వడ్డీ రేట్లు రూ.1 కోటి లోపు ఫిక్స్డ్ డిపాజిట్లకు వర్తిస్తుంది. కస్టమర్లు దగ్గర్లో ఉన్న బ్యాంక్ బ్రాంచ్లో ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్ల వివరాలను తెలుసుకోవచ్చు.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.