news18-telugu
Updated: June 19, 2020, 9:50 PM IST
తండ్రి అనిల్ కామినేనితో ఉపాసన కొణిదెల
(ఎం. బాలకృష్ణ, సీనియర్ కరస్పాండెంట్, న్యూస్18)
చిరంజీవి కోడలుగానూ, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ భార్యగా తెలుగు ప్రజందరికి దగ్గరైన వ్యక్తి ఉపాసన సామాజిక అంశాలపై తనదైన రీతిలో స్పందిస్తూ.... ప్రజల్లో అవగాహన కల్పించడానికి కృషి చేస్తోన్నారు. ప్రస్తుతం ఆపోలో లైఫ్ వైస్ చైర్మన్ గా ఉంటూ వైద్య రంగంలో తన తండ్రి ఒరవడిని కొనసాగిస్తోన్నారు ఉపాసన. తన తండ్రి స్థాపించిన కంపెనీలకు బిలియన్ డాలర్ల కంపెనీ స్టేటస్ తీసుకురావడం కోసం కృషి చేస్తోన్నారు. 1983లో 150 బెడ్స్ తో చెన్నైలో ప్రారంభమైన ఆపోలో హస్పటల్స్ ఇప్పుడు దాదాపు 9 వేల బెడ్స్ తో దేశవ్యాప్తంగానే కాకుండా విదేశాల్లో కూడా వైద్య రంగంలో విశేష సేవలు అందిస్తోంది. అయితే అంత పెద్ద బాధ్యతను తీసుకున్న ఉపాసనకు ఎవరు చేదోడు వాదోడుగా నిలుస్తోన్నారు? ఉపాసన ఇంతటి సక్సెస్ వెనుక తన తండ్రి, తాత ప్రోత్సాహం ఎలా ఉండేది? ఈ ఫాధర్స్ డే రోజు ప్రత్యేకం. ఉపాసన తండ్రి అనిల్ కామినేనితో తనకున్న అనుబంధం ఎలాంటిదో తెలుసుకుందాం.

పుట్టిల్లు, అత్తింటి వారితో ఉపాసన
ఉపాసనకి చిన్నప్పటి నుంచి అన్ని తన ఇష్టానికే వదిలేసేవారు తండ్రి అనిల్ కుమార్. ఏది మంచి? ఏది చెడు చెబుతూ నిర్ణయాలను తనకే వదిలేసేవారు. బహుశా ఇదే ఉపాసనలో సామాజిక స్పృహ పెరగడానికి దోహాద పడిందేమో అనిపిస్తోంది. ఎంత ఉన్నత స్థానానికి ఎదిగినా ఏ రోజూ కొంచం గర్వం కూడా ఆమెలో చూడలేదు అంటారు ఉపాసన సన్నిహితులు. మొన్నటికి మొన్న ఇండియన్ టాయిలెట్ ఉపయోగాలు చెప్పడం కోసం తాను ఇచ్చిన ఫోజులు అందర్ని ఆశ్చర్యపరిచాయి.

ఇండియన్ టాయిలెట్ ఉపయోగాలు చెబుతున్న ఉపాసన కొణిదెల (Upasana Konidela/Twitter)
ఒక మెగాస్టార్ కోడలు, కొన్ని కోట్ల రూపాయలకు వారసురాలు అయిన ఆమె ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఆ విధంగా పోజులు ఇవ్వడం సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. అదే కాకుండా తాను అపోలో బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఎన్నో సంస్కరణలకు పునాది వేశారు ఉపాసన. అందులో ముఖ్యంగా అపోలో 17% మేనేజర్ లెవల్ ఉద్యోగులు, 55% ఇతర ఉద్యోగులు అందరు మహిళలు కావడం విశేషం. ఇలా చేయడానికి చాలా గర్వంగా ఉంది అంటారామె. తన చిన్నప్పటి నుంచి ఇంట్లో పురుషులు, స్త్రీలు అనే బేధాలు లేకుండా తన తండ్రి పెంచారని అందులో నుంచి నేర్చుకున్నదే అంటారు ఉపాసన.

తాత ప్రతాప్ రెడ్డితో ఉపాసన
నాన్న, తాత...
బహుశా వీళ్లిద్దరు లేకపోతే నేను లేను అనే చెప్పుకోవాలి. చిన్నప్పటి నుంచి నాన్న చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. ఏదైనా విషయానికి సంబంధించి పరిణామాలను వివరించి నిర్ణయాన్ని నాకే వదిలేసేవారు. అందుకే చిన్నప్పటి నుంచి జాగ్రత్త అనే గుణం అలవడింది. దాంతో పాటు చాలా ఆర్గనేజ్డ్ గా ఉండడం కూడా అలవడింది. నేను అమెరికా, లండన్ లో చదువుకుంటున్న రోజుల్లో నాన్న తాత ప్రతి నెలా వచ్చి కలిసి వెళ్లేవారు. కాలేజ్ లో ఎలా ఉండాలనే దగ్గర నుంచి జీవిత విషయాలు వరకు చెప్పేవారు. ప్రతి రోజు ఎన్ని పనుల్లో ఉన్నా ఎక్కడ ఉన్నా నాన్న, తాత రోజూ ఫోన్ చేస్తారు. ఇక్కడే ఉంటే కలుస్తారు కూడా. కలవగానే ఫస్ట్ అడిగే మాట ఈ రోజు ఏం మంచి పని చేశాం? అని. చిన్నప్పటి నుంచి అదే విధంగా అడిగేవాళ్లు వాళ్లుకు చెప్పడానికైనా రోజూ ఒక మంచి పని చేసేదాన్ని. అదే ఇప్పుడు అలవాటైంది. అని నవ్వుతూ చెప్పారు ఉపాసన కొణిదెల.
First published:
June 19, 2020, 9:12 PM IST