FATHERS DAY 2020 MY FATHER DHIRUBHAI AMBANI IS THE ONLY ICONIC LEADER FOR ME SAYS MUKESH AMBANI SS
Father's Day 2020: మా నాన్న నా ఐకానిక్ లీడర్: ముఖేష్ అంబానీ
Father's Day 2020: మా నాన్న నా ఐకానిక్ లీడర్: ముఖేష్ అంబానీ
(ప్రతీకాత్మక చిత్రం)
Fathers Day 2020 | తన విషయంలో ఒకే ఒక్క ఐకానిక్ లీడర్ తన తండ్రి ధీరూబాయి అంబానీయేనని, రిలయెన్స్ విషయంలో పెద్దపెద్ద కలలు కనాలని, భారతదేశం కోసం ఆ కలలను సాకారం చేయాలని తన తండ్రి నేర్పించినట్టు ముఖేష్ అంబానీ తెలిపారు.
ముఖేష్ అంబానీ... ప్రపంచానికి పరిచయం అక్కర్లేని బిజినెస్ టైకూన్. ఎవరికైనా ఈ స్థాయి ఊరికే రాదు. దాని వెనుక కష్టాలుంటాయి. కఠిన శ్రమ ఉంటుంది. ముఖేష్ అంబానీ కూడా అంతే. తాను ఈ స్థాయికి రావడానికి కారణం తన తండ్రి ధీరూబాయి అంబానీ అని ఎప్పుడూ గర్వంగా చెబుతుంటారు రిలయెన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ. ఇటీవల భారతదేశంలో నెంబర్ 1 బిజినెస్ ఛానల్ సీఎన్బీసీ-టీవీ18 నిర్వహించిన ఇండియన్ బిజినెస్ లీడర్ అవార్డ్స్ కార్యక్రమంలో మరోసారి తన తండ్రిని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బిజినెస్ లీడర్ ఆఫ్ ది డికేడ్ అవార్డు గెలుచుకున్నారు ముఖేష్ అంబానీ. అయితే ఈ అవార్డును తన తండ్రి ధీరూబాయి అంబానీకి అంకితం ఇచ్చారు. తన ఐకానిక్ లీడర్ తన తండ్రేనని గర్వంగా చెప్పుకున్నారు.
ధీరూబాయి అంబానీ స్థాపించిన రిలయెన్స్ గ్రూప్ భారతదేశంలోనే అతిపెద్ద కంపెనీగా ఎదిగిన సంగతి తెలిసిందే. టెక్స్టైల్ కంపెనీగా ప్రారంభమైన రిలయెన్స్ గత నాలుగు దశాబ్దాల్లో పెట్రో కెమికల్ కంపెనీతో పాటు టెలికాం రంగంలో సంచలనాలు సృష్టించిందని, గత పదేళ్లలో ప్రపంచస్థాయి రీటైల్, టెక్ బిజినెస్ నిర్మించామని ముఖేష్ అంబానీ అన్నారు. తన విషయంలో ఒకే ఒక్క ఐకానిక్ లీడర్ తన తండ్రి ధీరూబాయి అంబానీయేనని, రిలయెన్స్ విషయంలో పెద్దపెద్ద కలలు కనాలని, భారతదేశం కోసం ఆ కలలను సాకారం చేయాలని తన తండ్రి నేర్పించినట్టు ముఖేష్ అంబానీ వెల్లడించారు.
తన తండ్రి స్థాపించిన రిలెయన్స్ కంపెనీని అప్పులు లేని కంపెనీగా మార్చారు ముఖేష్ అంబానీ. రిలయెన్స్ అప్పులు లేని కంపెనీగా మారడం గర్వించదగ్గ సందర్భమని, రిలయెన్స్ వ్యవస్థాపకులు ధీరూబాయి అంబానీ ఆశయాల సాధన కోసం, భారతదేశం శ్రేయస్సు, సమగ్ర అభివృద్ధికి మా సహకారాన్ని స్థిరంగా పెంచేందుకు రిలయెన్స్ స్వర్ణ దశాబ్దంలో మరింత ప్రతిష్టాత్మక లక్ష్యాలను నిర్దేశించడంతో పాటు వాటిని సాధిస్తామని భరోసా ఇస్తున్నామన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.