Electric Vehicles | కమర్షియల్ ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ కంపెనీ అల్టిగ్రీన్ తాజాగా ఎనర్జీ స్టార్టప్ ఎక్స్‌పొనెంట్ ఎనర్జీ భాగస్వామ్యంతో కొత్త ఇ-వెహికల్ (Electric Vehicle) లాంచ్ చేసింది. కంపెనీ తన కార్గో ఈవీ ఎన్ఈఈవీలో కొత్త వేరియంట్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని రేటు 3.55 లక్షలుగా ఉంది. ఎక్స్‌పోనెంట్ ఎనర్జీ అనేది ఈ ఎలక్ట్రిక్ త్రివీలర్‌కు (EV) బ్యాటరీ ప్యాక్‌ను అందిస్తుంది. అలాగే చార్జింగ్ స్టేషన్ ఫెసిలిటీ కల్పిస్తుంది.
ఎన్ఈఈవీ తేజ్‌ను ఫాస్టెస్ట్ చార్జింగ్ ఎలక్ట్రిక్ వెహికల్‌గా చెప్పుకుంటున్నారు. 0 నుంచి 100 శాతం చార్జింగ్ కేవలం 15 నిమిషాల్లోనే ఎక్కేస్తుంది. ఎక్స్‌పోనెంట్ ఇపంప్ చార్జింగ్ నెట్‌వర్క్‌పై ఇలా చార్జ్ చేసుకోవచ్చు. ఇందులో 8.2 కేడబ్ల్యూహెచ్ ఇప్యాక్ ఉంటుంది. ఎక్స్‌పోనెంట్ ఎనర్జీ ఈ బ్యాటరీలను తయారు చేస్తుంది. ఎల్ఎఫ్‌పీ సెల్ కెమిస్ట్రీ ద్వారా ఈ బ్యాటరీని రూపొందించారు.
రూ.45 వేలకే అదిరే ఎలక్ట్రిక్ స్కూటర్ .. ఒక్కసారి చార్జింగ్ పెడితే 100 కి.మి. వెళ్లొచ్చు!
ఇకపోతే ఎన్ఈఈవీ తేజ్ ఎలక్ట్రిక్ వెహికల్ ఒక్కసారి చార్జింగ్ పెడితే 98 కిలోమీటర్లు వెళ్తుంది. ఏఆర్ఏఐ సర్టిఫైడ్ ప్రకారం ఈ మైలేజ్ ఇస్తుంది. అదే సిటీ డ్రైవ్ రేంజ్ అయితే 85 కిలోమీటర్లు ఉంటుంది. ఎన్ఈఈవీ తేజ్ వెహికల్‌కు 5 ఏళ్లు లేదా లక్ష కిలోమీటర్ల వరకు వారంటీ ఉంటుంది. అలాగే 5 ఏళ్లు లేదా 1.55 లక్షల కిలోమీటర్ల వరకు బ్యాటరీ వారంటీ వస్తుంది. 2022 ఆగస్ట్ నెలలోనే అల్టిగ్రీన్, ఎక్స్‌పోనెంట్ ఎనర్జీ మధ్య ఒప్పందం కుదిరింది. ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు వేగంగా చార్జింగ్ అందించే సర్వీసులు లాంచ్ చేయడం కోసం ఈ ఇరు సంస్థలు చేతులు కలిపాయి.
యమ క్రేజ్.. జనాలు ఎక్కువగా కొంటున్న టాప్ 5 కార్లు ఇవే!
ఈ రెండు కంపెనీల భాగస్వామ్యంతో మార్కెట్‌లోకి వచ్చిన తొలి ప్రొడక్ట్ ఎన్ఈఈవీ తేజ్. ఇందులోని లిక్విడ్ కూల్డ్ బ్యాటరీ కేవలం 15 నిమిషాల్లోనే ఫుల్ అవుతుంది. అంటే ఏ రేంజ్‌లో ఫాస్ట్ చార్జింగ్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. తక్కువ చార్జింగ్ టైమ్, ఎక్కువ దూరం వెళ్లాలని భావించే వారు ఈ ఎలక్ట్రిక్ త్రి వీలర్‌ను కొనుగోలు చేయొచ్చు. పట్టణాల్లో ఆటో డ్రైవర్లకు ఈ కార్గో వెహికల్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు. డీజిల్ ఖర్చు లేకుండా తక్కువ వ్యయంతో ఈ వెహికల్ ద్వారా ప్రయాణం చేయొచ్చు. అందువల్ల డ్రైవర్లకు బెనిఫిట్ లభిస్తుంది.
ఇకపోతే ఈ ఎలక్ట్రిక్ త్రివీలర్ మూడు వేరియంట్ల రూపంలో కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. హై డెక్, లో డెక్, తేజ్ అనేవి వేరియంట్లు. ప్రస్తుతం కంపెనీ 12 పట్టణాల్లో సర్వీసులు అందిస్తోంది. 30 పట్టణాలకు సేవలను విస్తరించాలని భావిస్తోంది. తొలి ధశలో 2000 ఎన్ఈఈవీ తేజ్‌లను తయారు చేస్తామని తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Auto, Automobiles, Electric Vehicles