SBI FASTag: డిసెంబర్ 1 నుంచి ఫాస్ట్‌ట్యాగ్ తప్పనిసరి... ఎస్‌బీఐలో కొనండి ఇలా

SBI FASTag | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు ఫాస్ట్‌ట్యాగ్‌లు అమ్ముతోంది. ఎస్‌బీఐ పాయింట్ ఆఫ్ సేల్‌ లేదా ఆథరైజ్డ్ ఏజెంట్ల దగ్గర ఫాస్ట్‌ట్యాగ్ తీసుకోవచ్చు.

news18-telugu
Updated: November 20, 2019, 11:35 AM IST
SBI FASTag: డిసెంబర్ 1 నుంచి ఫాస్ట్‌ట్యాగ్ తప్పనిసరి... ఎస్‌బీఐలో కొనండి ఇలా
SBI FASTag: డిసెంబర్ 1 నుంచి ఫాస్ట్‌ట్యాగ్ తప్పనిసరి... ఎస్‌బీఐలో కొనండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
జాతీయ రహదారులపై ఉన్న టోల్ గేట్ల దగ్గర ఎలక్ట్రానిక్ పద్ధతిలో టోల్ ఫీజు వసూలు చేసేందుకు డిసెంబర్ 1 నుంచి అన్ని వాహనాలకు ఫాస్ట్‌ట్యాగ్ తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం. టోల్ గేట్ నుంచి వెళ్లే ప్రతీ వాహనానికి ఇక ఫాస్ట్‌ట్యాగ్ ఉండాల్సిందే. లేకపోతే రెండింతలు టోల్ ఫీజు చెల్లించాల్సి వస్తుంది. దీంతో ఇప్పుడు ఫాస్ట్‌ట్యాగ్‌ అమ్మకాలకు డిమాండ్ పెరిగిపోయింది. ఫాస్ట్‌ట్యాగ్‌ను ఎక్కడైనా కొనొచ్చు. వేర్వేరు బ్యాంకులు, నేషనల్ హైవే టోల్ ప్లాజాలు, ఆర్‌టీఓలు, కామన్ సర్వీస్ సెంటర్లు, ట్రాన్స్‌పోర్ట్ హబ్స్, బ్యాంక్ బ్రాంచ్‌లు, ఎంపిక చేసిన పెట్రోల్ బంకులు, వ్యాలెట్ సర్వీసులు అందించే సంస్థల దగ్గర్నుంచి ఫాస్ట్‌ట్యాగ్ కొనుగోలు చేయొచ్చు. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, పేటీఎం పేమెంట్ బ్యాంక్, అమెజాన్‌లో కూడా మీకు ఫాస్ట్‌ట్యాగ్ తీసుకోవచ్చు. 12,000 పైగా బ్యాంక్ బ్రాంచ్‌లు, 28,500 పాయింట్ ఆఫ్ సేల్‌ లొకేషన్స్ దగ్గర ఫాస్ట్‌ట్యాగ్‌లు అందుబాటులో ఉంటాయి.

SBI FASTag: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఫాస్ట్‌ట్యాగ్ కొనండి ఇలా...స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు ఫాస్ట్‌ట్యాగ్‌లు అమ్ముతోంది. ఎస్‌బీఐ పాయింట్ ఆఫ్ సేల్‌ లేదా ఆథరైజ్డ్ ఏజెంట్ల దగ్గర ఫాస్ట్‌ట్యాగ్ తీసుకోవచ్చు. కస్టమర్లు రెండు రకాలుగా అకౌంట్లు ఓపెన్ చేయొచ్చు. అందులో ఒకటి లిమిటెడ్ కేవైసీ హోల్డర్ అకౌంట్.ఇది ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఈ ఫాస్ట్‌ట్యాగ్ ప్రీపెయిడ్ అకౌంట్‌లో రూ.10,000 కన్నా ఎక్కువ ఉండకూడదు. నెలకు రూ.10000 కన్నా ఎక్కువ రీలోడ్ చేయలేరు. రెండోది ఫుల్ కేవైసీ హోల్డర్ అకౌంట్. ఇది కూడా ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఇందులో రూ.1,00,000 వరకు లోడ్ చేసుకోవచ్చు. రీలోడ్‌కు ఎలాంటి పరిమితి లేదు. కానీ... ఫాస్ట్‌ట్యాగ్ అకౌంట్‌లో రూ.1,00,000 కన్నా ఎక్కువ ఉండకూడదు. టోల్ ప్లాజా దగ్గర పేమెంట్ పూర్తి కాగానే కస్టమర్‌కు ఎస్ఎంఎస్ అలర్ట్ వస్తుంది. ఛార్జీలు ఈ విధంగా ఉంటాయి.

Read this: Business Idea: రూ.50,000 పెట్టుబడితో ఫాస్ట్‌ట్యాగ్ బిజినెస్ స్టార్ట్ చేయండి ఇలా


వెహికిల్ క్లాస్ వాహనం సెక్యూరిటీ అమౌంట్ మినిమమ్ బ్యాలెన్స్
4 కార్, జీప్, వ్యాన్, టాటా ఏస్, మినీ లైట్ కమర్షియల్ వెహికిల్ రూ.200 రూ.100
5 లైట్ కమర్షియల్ వెహికిల్ రూ.300 రూ.140
6 3 యాక్సిల్ కమర్షియల్ వెహికిల్ రూ.400 రూ.300
7 బస్, ట్రక్ రూ.400 రూ.300
12 4 నుంచి 6 యాక్సిల్ రూ.400 రూ.300
15 7 కన్నా ఎక్కువ యాక్సిల్ రూ.400 రూ.300
16 హెవీ కన్‌స్ట్రక్షన్ మెషినరీ, ఎర్త్ మూవింగ్ ఎక్విప్‌మెంట్ రూ.400 రూ.300

మీరు ఎస్‌బీఐ ఫాస్ట్‌ట్యాగ్ కొనాలనుకుంటే పాయింట్ ఆఫ్ సేల్‌కు వెళ్లాలి. లేదా టోల్ ప్లాజాల దగ్గర బ్యాంక్ ఆథరైజ్డ్ ఏజెన్సీలను సంప్రదించాలి. పీఓఎస్ లేదా ఏజెంట్ లొకేషన్ వివరాలను fastag.onlinesbi.com వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ఒరిజినల్ డాక్యుమెంట్లతో పాటు వాహనాన్ని కూడా తీసుకెళ్లాలి. ఆర్‌సీ కాపీ, ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, ఫోటో ఉండాలి. ఎస్‌బీఐ ఫాస్ట్‌ట్యాగ్‌కు మూడేళ్ల గ్యారెంటీ ఉంటుంది. ఫాస్ట్‌ట్యాగ్ జారీ చేసేందుకు రూ.200 నుంచి రూ.400 వరకు వసూలు చేస్తుంది ఎస్‌బీఐ.

Redmi Note 8T: రెడ్‌మీ నోట్ 8టీ రిలీజ్... ఎలా ఉందో చూడండిఇవి కూడా చదవండి:

Credit Card: క్రెడిట్ కార్డ్ ఉన్నవారికి ఈ ప్లాన్‌‌తో అనేక లాభాలు

SBI: ఏటీఎం పనిచేయట్లేదా? కిరాణా షాప్‌లో డబ్బులు తీసుకోవచ్చు ఇలా

Indian Railways Tatkal Rules: రైలు టికెట్ తత్కాల్‌లో బుక్ చేస్తున్నారా? ఈ రూల్స్ తెలుసా?
Published by: Santhosh Kumar S
First published: November 20, 2019, 11:35 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading