ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan) పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 10వ ఇన్‌స్టాల్‌మెంట్‌ను త్వరలో రిలీజ్ చేయనుంది. రైతుల ఖాతాల్లోకి రూ.2,000 చొప్పున నిధుల్ని జమ చేయనుంది మోదీ ప్రభుత్వం (Modi Government). కొత్త ఏడాదిలో పీఎం కిసాన్ 10వ ఇన్‌స్టాల్‌మెంట్ జమ చేయొచ్చన్న వార్తలు వస్తున్నాయి. అయితే గతంలో కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసినప్పుడు సాంకేతిక కారణాల వల్ల రైతుల అకౌంట్లలో జమ కాలేదు. ఇందుకు రైతుల వివరాలు మ్యాచ్ కాకపోవడమే కారణమని తేలింది. అందుకే రైతులు పీఎం కిసాన్ డబ్బుల్ని పొందాలనుకుంటే ముందుగా ఈ సమస్య రాకుండా చూడాలి.
రైతులు పీఎం కిసాన్ డబ్బుల్ని పొందాలనుకుంటే తమ పీఎం కిసాన్ అకౌంట్‌కు ఆధార్ కార్డు తప్పనిసరిగా లింక్ చేయాలి. పీఎం కిసాన్ అకౌంట్‌లోని వివరాలు, ఆధార్ కార్డులోని వివరాలు మ్యాచ్ అయితేనే డబ్బులు అకౌంట్‌లో జమ అవుతాయి. ఈ వివరాలు మ్యాచ్ కాకపోతే అకౌంట్లలో డబ్బులు జమ కావు. పీఎం కిసాన్ మాత్రమే కాదు... ఇతర ప్రభుత్వ పథకాలు పొందాలన్నా ఆధార్ లింకింగ్ తప్పనిసరి. కాబట్టి పీఎం కిసాన్ లబ్ధిదారులు 10వ ఇన్‌స్టాల్‌మెంట్ పొందాలంటే వెంటనే తమ ఆధార్ కార్డును పీఎం కిసాన్ అకౌంట్‌తో లింక్ చేయాలి. ఎలాగో తెలుసుకోండి.
PM Kisan Scheme: రైతులకు అలర్ట్... వీరికి పీఎం కిసాన్ స్కీమ్ వర్తించదు
రైతులు ముందుగా ఏ బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్ కార్డును లింక్ చేశారో ఆ బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లాలి.
అక్కడ ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీపై సంతకం చేసి బ్యాంకు సిబ్బందికి ఇవ్వాలి.
ఒరిజినల్ ఆధార్ కార్డుపై సంతకం చేయకూడదు. ఆధార్ జిరాక్స్ కాపీ ఇస్తే చాలు.
మీ ఆధార్ వివరాలు వెరిఫై చేసిన తర్వాత ఆన్‌లైన్ సీడింగ్ చేస్తారు.
వెరిఫికేషన్ పూర్తైన తర్వాత మీకు ఎస్ఎంఎస్ లభిస్తుంది.
PM Kisan: రైతులకు శుభవార్త... పీఎం కిసాన్ డబ్బులు రూ.4,000 చేసే అవకాశం
రైతులు తమ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో https://pmkisan.gov.in/ వెబ్‌సైట్‌లో కూడా తెలుసుకోవచ్చు. ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత Farmers Corner సెక్షన్‌లో Edit Aadhaar Failure Records పైన క్లిక్ చేయాలి. ఆధార్ నెంబర్, అకౌంట్ నెంబర్, మొబైల్ నెంబర్, ఫార్మర్ నేమ్‌లో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత రైతు పేరు, తండ్రి పేరు, జెండర్, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్, సబ్ డిస్ట్రిక్ట్ పేరు, బ్లాక్ పేరు, ఊరి పేరు లాంటివన్నీ సరిచూసుకోవాలి. అన్నీ కరెక్ట్‌గా ఉంటే పీఎం కిసాన్ డబ్బులు జమ అవుతాయి. వివరాల్లో తప్పులు ఉంటే Edit పైన క్లిక్ చేసి సరిచేసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Farmer, Pm kisan, PM Kisan Scheme, Pmkisan samman nidhi, Pradhan Mantri Kisan Samman Nidhi