బైక్ మెయింటెన్ చేయడం ఓ కళ అంటుంటారు. ఉరుకులు, పరుగుల జీవితంలో బైక్‌మీద(Bike Maintenance) శ్రద్ధ పెట్టేంత టైమ్ ఎక్కడుందీ అంటారా? కానీ రోజూ మనకు ఎంతో ఉపయోగపడుతున్న మన వాహనాన్ని మనమే స్వయంగా పరిశీలించి, జాగ్రత్తగా చూసుకోవడం ఎంతో సంతృప్తినిస్తుంది అంటున్నారు నిపుణులు. మేజర్ బైక్ రిపేర్లు కాకుండా.. చిన్న చిన్న రిపేర్లను మీరే సొంతంగా చేసుకోగలిగితే డబ్బు ఆదాతో పాటు.. బైక్ నడిపేటప్పుడు(Bike Driving) జాగ్రత్తగా డ్రైవ్ చేయాలన్న స్పృహ సైతం పెరుగుతుంది. మోటార్‌సైకిల్‌ను మెయింటెనెన్స్( Bike Maintenance) కోసం ఈ చిట్కాలు ట్రై చేయండి..
పరిశీలన..
హాస్యాస్పదంగా అనిపించినప్పటికీ ఇది నిజం.! మీ బైక్ మొత్తాన్ని క్లీన్‌గా పరిశీలించండి. రోజూ వాడేటప్పుడు మనం గుర్తించలేని విషయాలను ఒకటికి రెండుసార్లు చెక్ చేయండి. డ్రైవింగ్‌లో ఎదురవుతున్న ఇబ్బందులు, ఆయిల్ లీక్‌లు(Engine Oil leak) వంటి లోపాలను గుర్తించండి. మరీ అంత పెద్ద ప్రాబ్లమ్స్ కాదనిపిస్తే వెంటనే బాగుచేసుకునేందుకు టైమ్ కేటాయించుకోండి.
టైర్ ప్రెషర్..
మీ సురక్షిత ప్రయాణానికి హామీ ఇచ్చేది బైక్ టైర్లు మాత్రమేనని గుర్తుంచుకోండి. గాలి(Tyre Pressure) తగ్గితే కిందపడిపోయే ప్రమాదం ఉంది. బ్యాలెన్స్ ఆగక రిమ్ము దెబ్బతినవచ్చు. గాలి ఎంత ఉంచాలో యూజర్ మాన్యువల్‌లో ఇస్తారు. ప్రెజర్ గేజ్‌తో చెక్ చేసి.. నిర్ణీత రీడింగ్ వచ్చేవరకు గాలి పెట్టండి.
చైన్ లూజ్ ఉందా?
ఇంజిన్ నుంచి చక్రాలకు శక్తినిచ్చేది చైన్(Bike Chain Loose). ఇది సరిగ్గా లేకపోతే చాలా ప్రమాదకరం. రైడ్‌కి వెళ్లొచ్చిన వెంటనే చైన్‌లో ప్రాబ్లమ్ ఉందని గమనిస్తే.. అప్పుడే లూబ్రికేట్ చేయడం ఉత్తమం. ఎందుకంటే ఆ సమయంలో వేడిగా ఉంటుంది. లింక్లన్నింటికీ ఆయిల్ త్వరగా చేరుతుంది. ఇలా చేయడం వల్ల చైన్ లైఫ్ పెరుగుతుంది.
ఇంజిన్ ఆయిల్ చెకింగ్..
మీ బైక్ ఇంజిన్లో ఆయిల్(Bike Engine Oil Level) స్థాయిని సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. వేడిగా ఉన్న బైక్‌లో గేజ్‌ను చెక్ చేయండి. మీ బైక్‌ను సెంటర్ స్టాండ్‌పై ఉంచి.. ఇంజిన్ బేస్‌ని చూడండి. పూర్తిగా లేదనిపిస్తే కొంచెం నింపుకోవడం బెటర్. ఇక ఆయిల్ నల్లగా కనిపిస్తే దాన్ని మార్చడం చాలా ముఖ్యం.
ఎయిర్ ఫిల్టర్ క్లీనింగ్..
5,000 కిమీ దాటితే మోటార్‌సైకిళ్ల ఎయిర్ ఫిల్టర్‌లు(Bike Air Filter) మార్చేయడం మంచిది. దుమ్ము మార్గాలు, ఇసుక ఉన్న ప్రాంతాల్లో నడిపుతున్నట్లయితే ఎయిర్ ఫిల్టర్‌ను వారం, నెలకొకసారి శుభ్రపరచాలి. మీ ఎయిర్ ఫిల్టర్‌ను చెక్ చేయాలంటే.. ఎయిర్‌బాక్స్‌ని ఎత్తి ఫిల్టర్‌ను వేరు చేయండి. మురికిగా కనిపిస్తే దాన్ని శుభ్రం చేయండి. కొద్ది రోజులకే మార్చేస్తే మేలు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.