Cryptocurrency: రూ.44 కోట్ల విలువైన క్రిప్టోకరెన్సీ పోయినట్టేనా..ఆ దంపతులకు చిత్రమైన కష్టం..

ప్రతీకాత్మక చిత్రం

ఒక్కోసారి డిజిటల్ టోకెన్లను భద్రపరుచుకోవడం విఫలమైన కొందరికి వేదనను మిగిలిస్తోంది. పాస్​వర్డ్​లు మరిచిపోయి కొందరు.. మరికొన్ని డిజిటల్ డాక్యుమెంట్లు ఎక్కడున్నాయో మరిచి మరికొందరు క్రిప్టో కరెన్సీని కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది.

  • Share this:
ప్రపంచంలోనే అత్యంత పాపులర్ టాపిక్​గా మారిపోయింది క్రిప్టో కరెన్సీ. ఎంతో మందిని ధనవంతులను చేయడంతో క్రిప్టో పేరు మారుమోగిపోతుంది. ఈ క్రిప్టో కరెన్సీలో ఇథర్ అని ముద్దుగా పిలుచుకునే ఇథేరియం కూడా ఫేమస్​గా మారింది. బిట్​కాయి​న్ తర్వాత రెండో అతిపెద్ద క్రిప్టో కరెన్సీగా ఉన్న ఇథర్​ లావాదేవీలు ఇటీవల మరింతగా పెరిగిపోయాయి. డీసెంట్రలైజ్డ్​గా ఉండే క్రిప్టో కరెన్సీ ఎంతో మంది నుంచి ప్రశంసలు అందుకుంటున్నా.. ఒక్కోసారి డిజిటల్ టోకెన్లను భద్రపరుచుకోవడం విఫలమైన కొందరికి వేదనను మిగిలిస్తోంది. పాస్​వర్డ్​లు మరిచిపోయి కొందరు.. మరికొన్ని డిజిటల్ డాక్యుమెంట్లు ఎక్కడున్నాయో మరిచి మరికొందరు క్రిప్టో కరెన్సీని కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది.

తమ చిన్నచిన్న తప్పిదాల వల్ల క్రిప్టో కరెన్సీని యాక్సెస్ చేసుకోలేక నష్టపోయిన స్టోరీలు గతంలో కొన్ని జరిగాయి. పాస్​వర్డ్ మరిచిపోయి తమ క్రిప్టో కరెన్సీని వాడుకోలేక కొందరు డబ్బు నష్టపోయారు. అయితే తాజాగా ఓ చిత్రమైన ఘటన జరిగింది. వాషింగ్టన్ డీసీకి చెందిన దంపతులు తమ ఇళ్లు అగ్నిప్రమాదంలో కాలిపోవడంతో 6 మిలియన్ డాలర్ల విలువైన ఇథేరియం​ను కోల్పోయే ప్రమాదంలో పడ్డారు. అసలు ఏం జరిగిందంటే..

వాషింగ్టన్​కు చెందిన యూకీ, ఆర్ట్ విలియమ్స్ దంపతులు 2014లో ఇథేరియం ఫౌండేషన్ ప్రీసేల్​ సమయంలో​ 3వేల ఇథేరియంలను కొనుగోలు చేశారు. అప్పుడు వాటి విలువ కేవలం 932 డాలర్లు. ప్రస్తుతం వాటి విలువ ఏకంగా 6లక్షల డాలర్లకు (దాదాపు 44.57కోట్లు) పెరిగింది. అయితే ఇటీవలే విలియమ్స్ దంపతుల ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. మొత్తం బూడిదైంది. దీంతో తమ ఇథేరియమ్ వాలెట్​ను యాక్సెస్ చేసుకునే ఓ ముఖ్యమైన డేటా ఉన్న డిజిటల్​ ఫైల్​ అగ్నిప్రమాదం తర్వాత కోల్పోయారు.

తమకు పాస్​వర్డ్ గుర్తు ఉన్నా.. చాలా ముఖ్యమైన ప్రైవేట్ కీ ఉన్న జేఎస్​ఓఎన్​ ఫైల్​ పోయిందని, ఇథేరియమ్​ను యాక్సెస్ చేసేందుకు అందులో ఓ ప్రత్యేకమైన కీ ఉంటుందని చెప్పారు.
అయితే తమ జేఎస్​ఓఎన్ ఫైల్​ను మెయిల్ ద్వారా తమకు మళ్లీ పంపాలని ఇథేరియంను సంప్రదించామని ఆ దంపతులు చెప్పారు. కానీ తమకు ఎలాంటి స్పందన రాలేదని చెప్పారు. దీంతో వాలెట్​లో 3000 ఇథేరియమ్ ఉన్నట్టు చూపిస్తున్నా.. జేఎస్​ఓఎన్​ ఫైల్ లేకపోవడంతో తాము వినియోగించులేకపోతున్నామని చెప్పారు. దీంతో తమకు 2.5లక్షల డాలర్ల సాయం చేయాలని అంతర్జాతీయ చాంబర్​ ఆఫ్ కామర్స్​లో ఆ దంపతులు పిటిషన్ దాఖలు చేసినట్టు సమాచారం. అలాగే ఫండ్​రైస్​ను కూడా చేపట్టారు. మొత్తంగా మరి వారికి ఈ కీలకమైన ఫైల్​ మళ్లీ వస్తుందో లేదో చూడాలి.
Published by:Krishna Adithya
First published: