Budget 2019: ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహకాలు: నిర్మలా సీతారామన్

Union Budget 2019 | ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచడంతో పాటు ఛార్జింగ్ కోసం మౌలిక వసతులు కల్పించడం ఫేమ్-2 స్కీమ్ లక్ష్యమన్నారు నిర్మలా సీతారామన్.

news18-telugu
Updated: July 5, 2019, 11:41 AM IST
Budget 2019: ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహకాలు: నిర్మలా సీతారామన్
Budget 2019: ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహకాలు: నిర్మలా సీతారామన్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
పర్యావరణ హితమైన అభివృద్ధే తమ లక్ష్యమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అందులో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహిస్తామని తెలిపారు. ఇప్పటికే ఫాస్టర్ అడాప్షన్ & మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్-FAME-II స్కీమ్ 2019 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చిందన్నారు. ఫేమ్-2 స్కీమ్‌లో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలపై సబ్సిడీ ఇస్తున్నామన్నారు. వాహనాలతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి కావాల్సిన బ్యాటరీలు, ఇతర పరికరాలకూ సబ్సిడీ అందిస్తున్నట్టు చెప్పారు. కేవలం రిజిస్ట్రేషన్ చేసుకున్న ఇ-వాహనాలకు మాత్రమే ప్రోత్సాహకాలు లభిస్తాయని స్పష్టం చేశారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచడంతో పాటు ఛార్జింగ్ కోసం మౌలిక వసతులు కల్పించడం ఫేమ్-2 స్కీమ్ లక్ష్యమన్నారు నిర్మలా సీతారామన్.

దేశంలో పెరిగిపోతున్న కాలుష్యాన్ని తగ్గించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తోంది. FAME-II స్కీమ్‌లో ఎలక్ట్రిక్ బైకులు, కార్లకు భారీ సబ్సిడీ ఇస్తోంది కేంద్రం. ఫేమ్-2 పథకానికి రూ.10,000 కోట్ల ప్యాకేజీ కేటాయించింది కేంద్రం. ఈ పథకం 2019 ఏప్రిల్ 1 నుంచి 2022 మార్చి 31 వరకు వర్తిస్తుంది. 10 లక్షల ఎలక్ట్రిక్ టూవీలర్లు, 5 లక్షల ఎలక్ట్రిక్ త్రీవీలర్లు, 55,000 ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్లు, 7,000 ఎలక్ట్రిక్ బస్సులకు సబ్సిడీ ఇవ్వడంతో పాటు ప్రధాన పట్టణాలను కలిపే ప్రధాన రహదారుల్లో ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనుంది. అంతేకాదు... ఎలక్ట్రిక్ వాహనాలకు వసూలు చేస్తున్న పన్నుల్ని తగ్గించే ఆలోచనలోనూ ఉంది కేంద్రం. ప్రస్తుతం ఈ ప్రతిపాదన జీఎస్‌టీ కౌన్సిల్ దగ్గర పెండింగ్‌లో ఉంది.

Revolt RV400: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఎలక్ట్రిక్ బైక్


ఇవి కూడా చదవండి:

Budget 2019: ఈ పదాలతో బడ్జెట్‌ను సులభంగా అర్థం చేసుకోండి

Aadhaar Contest: మై ఆధార్ ఆన్‌లైన్ కాంటెస్ట్‌... రూ.30,000 గెలుచుకునే అవకాశంSmartphone: మీ ఫోన్ పేలిపోవద్దంటే ఈ 10 జాగ్రత్తలు తప్పనిసరి
Published by: Santhosh Kumar S
First published: July 5, 2019, 11:41 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading