SBI Alert: వాట్సప్ స్కామ్‌తో జాగ్రత్త... హెచ్చరిస్తున్న ఎస్‌బీఐ

SBI Alert of Fake Messages | "వాట్సప్‌తో పాటు సోషల్ మీడియాలో ఇలాంటి మెసేజ్‌లు సర్క్యులేట్ అవుతున్నట్టు మా దృష్టికి వచ్చింది. ఓటీపీ చెప్పాలంటూ మా ఖాతాదారులకు ఎస్ఎంఎస్‌లు వస్తున్నాయి" అని ట్విట్టర్‌లో వెల్లడించింది ఎస్‌బీఐ.

news18-telugu
Updated: March 13, 2019, 6:32 PM IST
SBI Alert: వాట్సప్ స్కామ్‌తో జాగ్రత్త... హెచ్చరిస్తున్న ఎస్‌బీఐ
SBI Alert: వాట్సప్ స్కామ్‌తో జాగ్రత్త... హెచ్చరిస్తున్న ఎస్‌బీఐ
news18-telugu
Updated: March 13, 2019, 6:32 PM IST
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా... భారతదేశంలో అతిపెద్ద బ్యాంక్. ఖాతాదారులు ఎక్కువ కావడంతో నేరగాళ్లు కూడా ఎస్‌‌బీఐ కస్టమర్లను ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. ఎస్‌బీఐ కస్టమర్లు తమ వ్యక్తిగత వివరాలతో పాటు బ్యాంకు అకౌంట్ వివరాలు షేర్ చేసుకునేలా వాట్సప్ మెసేజ్‌లు పంపిస్తున్నారు. ఇటీవల ఇలాంటి మోసాలు ఎక్కువ కావడంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రమత్తమైంది. అంతేకాదు... జాగ్రత్తగా ఉండాలంటూ తమ ఖాతాదారులను ఎస్‌బీఐ హెచ్చరిస్తోంది. "వాట్సప్‌తో పాటు సోషల్ మీడియాలో ఇలాంటి మెసేజ్‌లు సర్క్యులేట్ అవుతున్నట్టు మా దృష్టికి వచ్చింది. ఓటీపీ చెప్పాలంటూ మా ఖాతాదారులకు ఎస్ఎంఎస్‌లు వస్తున్నాయి" అని ట్విట్టర్‌లో వెల్లడించింది ఎస్‌బీఐ. అంతేకాదు... ఇలాంటి మోసాల పట్ల ఖాతాదారులు ఎలా అప్రమత్తంగా ఉండాలో కొన్ని సూచనలు కూడా చేస్తోంది.


మోసాలు జరిగేది ఇలాగే...




వాట్సప్‌లో ఆఫర్ల పేరుతో మెసేజ్‌లు సర్క్యులేట్ అవుతుంటాయి. అందులో ఉండే లింక్స్ క్లిక్ చేస్తే మీ వ్యక్తిగత డేటాతో పాటు ఫోన్‌లో సేవ్ అయిన బ్యాంకు అకౌంట్ల వివరాలు నేరగాళ్ల చేతిలోకి వెళ్తాయి. వాటి ద్వారా లావాదేవీలు చేసే కేటుగాళ్లు... ఆ తర్వాత ఓటీపీ కోసం ఏదో ఓ మార్గంలో మిమ్మల్ని సంప్రదిస్తారు. పొరపాటున మీరు ఓటీపీ చెప్పారంటే... అకౌంట్ ఖాళీ కావడం ఖాయం. అంతేకాదు... మీరు లింక్ క్లిక్ చేసినప్పుడే మీకు తెలియకుండా మీ ఫోన్‌లో ఓ యాప్ ఇన్‌స్టాల్ అవుతుంది. మీరు లావాదేవీలు జరిపినప్పుడు ఓటీపీలను నేరగాళ్లు ఈజీగా తెలుసుకోవచ్చు. దాంతో పాటు మీ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ రెన్యువల్ చేస్తామనో, అప్‌గ్రేడ్ చేస్తామనో ఫోన్ కాల్స్ వస్తుంటాయి. మీ కార్డు వివరాలు తెలుసుకొని మోసం చేయడం మరో పద్ధతి. ఇలా వేర్వేరు మార్గాల్లో కస్టమర్లను మోసం చేస్తున్నారు కేటుగాళ్లు..

Read this: PAN Card: మీ పాన్ కార్డులో తప్పులున్నాయా? ఇలా సరిదిద్దుకోవచ్చు

మోసపోతే ఏం చేయాలి?


ఒకవేళ మీరు ఇలాగే మోసపోతే మూడు రోజుల్లో బ్యాంకులో ఫిర్యాదు చేయాలి. 1800111109 నెంబర్‌కు కాల్ చేసి కంప్లైంట్ చేయొచ్చు. లేదా 'Problem' అని టైప్ చేసి 9212500888 నెంబర్‌కు ఎస్ఎంఎస్ చేయాలి. అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌ @SBICard_Connect ద్వారా కంప్లైంట్లను స్వీకరిస్తోంది ఎస్‌బీఐ. మోసపోకుండా ఉండాలంటే అప్రమత్తత తప్పనిసరి. మీకు వాట్సప్‌లో వచ్చే మెసేజ్‌లను పట్టించుకోవద్దు. లింక్స్‌తో వచ్చే ఎస్ఎంఎస్‌లనూ క్లిక్ చేయొద్దు. ఎట్టి పరిస్థితుల్లో మీ కార్డు వివరాలు, బ్యాంకు అకౌంట్ నెంబర్లు, ఓటీపీ ఎవరికీ చెప్పొద్దు. మీరు మీ ఫోన్ ద్వారా ఎక్కువగా లావాదేవీలు జరిపేట్టయితే యాంటీవైరస్ వాడాలి.
Photos: ఈ 50 లగ్జరీ కార్లు చూస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే...

ఇవి కూడా చదవండి:

Alert: కస్టమర్ కేర్‌కు కాల్ చేస్తున్నారా? మోసపోతారు జాగ్రత్త

YouTube Music: మ్యూజిక్ లవర్స్‌కు గుడ్ న్యూస్... యూట్యూబ్ మ్యూజిక్ వచ్చేసింది

Save Money: రూ.1 కోటి పొదుపు చేయడానికి 6 స్టెప్స్
First published: March 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...