ATM : ఏటీఎం పనిచెయ్యట్లేదా... బ్యాంకులకు షాకే... RBI న్యూ రూల్స్...

ATM New Rules : ఇకపై బ్యాంకులు కస్టమర్ల సమస్యను వెంటనే పరిష్కరించడమే కాదు... అసౌకర్యం కలిగించినందుకు పరిహారం కూడా చెల్లించాల్సిందే.

Krishna Kumar N | news18-telugu
Updated: September 21, 2019, 7:09 AM IST
ATM : ఏటీఎం పనిచెయ్యట్లేదా... బ్యాంకులకు షాకే... RBI న్యూ రూల్స్...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మన డబ్బును తీసుకొని... మనకే లేనిపోని ఇబ్బందులు పెడుతుంటాయి బ్యాంకులు. ముఖ్యంగా చాలా ATMలు పేరుకే అన్నట్లు ఉంటున్నాయి. వాటిలో సరిగా డబ్బు రాదు. కొన్నింటికి అవుట్ ఆఫ్ సర్వీస్ బోర్డ్ ఉంటుంది. ఇంకొన్ని ATMలు సరిగా పనిచెయ్యవు. ఈ పరిస్థితుల్లో అడ్డంగా నష్టపోతున్నది మనమే. ఇలాంటి కంప్లైంట్లు ఎక్కువగా వస్తుండటంతో... ATMల పనితీరుపై రిజర్వ్ బ్యాంక్ కొత్త రూల్స్ తెచ్చింది. ఇకపై ట్రాన్సాక్షన్స్ ఫెయిలైతే... వాటిని పరిష్కరించడమే కాదు... బ్యాంకులు బాధిత కస్టమర్‌కి పరిహారం కూడా చెల్లించాల్సి ఉంటుంది. ట్రాన్సాక్షన్ ఫెయిలైందని కస్టమర్ కంప్లైంట్ ఇవ్వాల్సిన పనిలేదు. అసలా విషయాన్ని కస్టమర్ గుర్తించాల్సిన అవసరమే లేదు. ఆటోమేటిక్‌గా బ్యాంకులే ఆ విషయాన్ని గుర్తించి పరిహారం చెల్లించాలి. ఇది ఆర్బీఐ కొత్త నిబంధన.

వాస్తవంలో కొన్ని సందర్భాల్లో ఏటీఎం నుంచీ డబ్బు రావట్లేదు. కానీ... అకౌంట్‌లో డబ్బు తగ్గిపోతోంది. దీనిపై కంప్లైంట్ ఇచ్చాక... బ్యాంకులు ఎప్పుడో గానీ దాన్ని పరిష్కరించట్లేదు. ఇలాంటి చాలా కంప్లైంట్లు వస్తున్నా... బ్యాంకులు సీరియస్‌గా తీసుకోవట్లేదు. ఈ పరిస్థితికి చెక్ పెట్టేందుకు RBI సిద్ధమైంది. ఇకపై కస్టమర్ల సమస్యను వెంటనే పరిష్కరించడమే కాదు... అసౌకర్యం కలిగించినందుకు పరిహారం కూడా చెల్లించాల్సిందే.

ఇలాంటి 8 రకాల ట్రాన్సాక్షన్లకు సంబంధించి RBI కొత్త నిబంధనలు తెచ్చింది. వీటిలో ATM కేంద్రాల్లో ట్రాన్సాక్షన్లు, డెబిట్, క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్లు వంటివి ఉన్నాయి. ఇకపై ట్రాన్సాక్షన్ ఫెయిలైతే... ఐదు రోజుల్లో దాన్ని పరిష్కరించాల్సిందే. ఆలోగా పరిష్కరించలేకపోతే... తర్వాతి రోజు నుంచీ... రోజుకు రూ.100 చొప్పున పరిహారం చెల్లించాల్సిందే. ప్రజలు పడుతున్న ఇబ్బందుల నుంచీ వారిని బయటపడేసేందుకే RBI ఈ కొత్త రూల్స్ తెచ్చింది.

కొత్త రూల్స్ ప్రకారం కస్టమర్‌ ప్రయోజనం పొందకపోతే, బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌లో కంప్లైంట్ ఇవ్వవచ్చు. ఇలాంటి కంప్లైంట్ల విషయంలో బ్యాంకులకు ఇకపై ఎక్కువ మొత్తంలో పెనాల్టీలు తప్పవు.
First published: September 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading