Home /News /business /

FACTORS IMPACTING TWO WHEELER INSURANCE PURCHASE GH VB

Bike Insurance: మీ బైక్​కు బీమా చేయించాలనుకుంటున్నారా..? అయితే వీటిని తప్పక తెలుసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అత్యవసర సమయాల్లో అవసరాలు తీర్చే బైక్​కు బీమా కలిగి ఉండే విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ద్విచక్ర వాహన బీమా ధరను ప్రభావం చూపే ప్రధాన అంశాలేంటో ఓసారి చూద్దాం..

ఈరోజుల్లో దాదాపు ప్రతి ఇంట్లో ద్విచక్ర వాహనం(Two Wheeler) తప్పనిసరి అయింది. మనలోనూ చాలా మందికి బైక్​ ఉండే ఉంటుంది. ట్రాఫిక్​ రోడ్లపై(Traffic Roads) సులభంగా ప్రయాణించగలగడమే కాకుండా.. కారుతో పోల్చుకుంటే బైక్​ నిర్వహణ సులువు. బైక్ వినియోగం ఎంత ప్రాముఖ్యమైనదో.. దాని భద్రత (Bike Insurance) సైతం అంతే ముఖ్యం. చాలామంది ద్విచక్ర వాహనదారులు బీమా(Insurance) లేకుండానే వాహనాన్ని నడుపుతున్నట్లు ఓ సర్వేలో తేలింది. అయితే అత్యవసర సమయాల్లో అవసరాలు తీర్చే బైక్​కు బీమా కలిగి ఉండే విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ద్విచక్ర వాహన బీమా ధరను ప్రభావం చూపే ప్రధాన అంశాలేంటో ఓసారి చూద్దాం..

బైక్​ రకం..
ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు, తయారీ, మోడల్ ఆధారంగా ద్విచక్ర వాహనం ధర మారుతుంది. బైక్ ధరకు బీమా వర్తిస్తుంది. కాబట్టి.. బీమా ప్రీమియం(bike insurance premium) వాహనం ధరకు నేరుగా అనులోమానుపాతంలో ఉంటుంది. ఉదాహరణకు.. బైక్ కాస్ట్ 75 వేల రూపాయలు ఉంటే.. ప్రీమియం లక్ష రూపాయల విలువైన వాహన ప్రీమియం కంటే తక్కువగా ఉంటుంది.

సీసీ కూడా ముఖ్యమే..!
బీమా ప్రీమియం ధరను ప్రభావితం చేసే మరో ముఖ్యమైన అంశం.. ఇంజిన్ పవర్​ గురించి తెలిపే క్యూబిక్ కెపాసిటీ (CC). 350 సీసీ బైక్ కంటే 75 సీసీ బైక్​కు తక్కువ ప్రీమియం ఉంటుంది. థర్డ్ పార్టీ ప్రీమియంను లెక్కించేందుకు వాహనం యొక్క సీసీ ఆధారంగానే స్లాబ్ రేట్లను లెక్కగడతారు.

5G Effect: 5G టెక్నాలజీతో పొంచి ఉన్న ప్రమాదం.. ఈ రంగానికి ముప్పు తప్పదా..? నివేదికలు ఏం చెబుతున్నాయి..?


డిక్లేర్డ్ వాల్యూ
బైక్ ఇన్సూరెన్స్ తీసుకునే సమయంలో మీ బీమా సంస్థ వాహనం తీసుకొని ఎన్నేళ్లయింది (Bike Age) అని అడగటం మీరు గమనించే ఉంటారు. ఎందుకంటే.. పాత వాహనం విలువ తక్కువగా ఉంటుంది. అందువల్ల ప్రీమియం తక్కువగా ఉంటుంది. ఇతర వస్తువుల్లాగే ద్విచక్ర వాహనం విలువ కూడా తగ్గుతూ ఉంటుందని గుర్తుంచుకోండి. ఈ తరుగుదల రేటును 6 నెలల కంటే తక్కువ వయస్సు ఉన్న వాహనానికి 5 శాతంగా.. ఐదేళ్ల కంటే ఎక్కువ ఉంటే 50 శాతంగా నిర్ణయిస్తారు. ఇక బైక్ దొంగతనానికి గురైన సమయంలో బీమా సంస్థ చెల్లించే గరిష్ట విలువ పరంగా ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వ్యాల్యూ(ఐడీవీ)ని బీమా సంస్థలు ఛార్జ్ చేస్తాయి. ప్రతి సంవత్సరం IDV లెక్కిస్తారు.

కవరేజ్ రకం..
వాహన బీమాలో థర్డ్ పార్టీ (TP), ఫుల్ కవర్ అనే రెండు రకాలు అందుబాటులో ఉన్నాయి. చట్టం ప్రకారం వాహనాన్ని రోడ్డుపై నడపడానికి తప్పనిసరిగా థర్డ్ పార్టీ అయినా ఉండాలి. అయితే TPతో మీ వాహనానికి రక్షణ ఉండదు. ఇది కేవలం దానిపై ప్రయాణించే మనిషికి కవరేజీని అందిస్తుంది. సమగ్రమైన పాలసీ తీసుకుంటేనే వాహనానికి కవరేజీ ఉంటుంది.

వడగళ్ల వానలు, భూకంపాలు, వరదలు, తుపానులు, కొండచరియలు విరిగిపడటం వంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి మీ వాహనాన్ని సమగ్ర పాలసీ రక్షిస్తుంది. ప్రమాదాలు, దొంగతనాలు వంటి మానవ విపత్తులు కూడా ఇందులో కవర్ అవుతాయి. మీ వాహనానికి పూర్తి రక్షణ కావాలంటే ఫుల్ ఇన్సూరెన్స్​ను ఎంచుకోవడం మంచిది. ఊహించని ఘటన జరిగినప్పుడు సంభవించే నష్టం కంటే బీమా ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది.

నో క్లెయిమ్ బోనస్ (NCB)
ఈ ఏడాది తీసుకున్న బీమాను క్లెయిమ్ చేసుకోనట్లయితే ఆ సంవత్సరానికి బీమా సంస్థ నుంచి NCB మంజూరు అవుతుంది. వాస్తవానికి ఇది మీ డ్రైవింగ్​కు లభించే బహుమతి అనుకోవచ్చు. ఆయా స్లాబ్‌ల ప్రకారం డిస్కౌంట్ మంజూరు అవుతుంది. మొదటి క్లెయిమ్ ఫ్రీ సంవత్సరానికి 20 శాతం నుంచి ప్రారంభమై.. ఐదు వరుస క్లెయిమ్ రహిత సంవత్సరాలకు గరిష్టంగా 50 శాతం వరకు NCB వస్తుంది. బీమా ప్రీమియాన్ని తగ్గించడానికి NCB ప్లస్ అవుతుంది.

యాడ్-ఆన్ కవర్లు..
మీ బైక్ రక్షణను మరింత బలోపేతం చేయడంలో యాడ్ ఆన్ కవర్లు సహాయపడతాయి. రోడ్‌సైడ్ అసిస్టెన్స్, జీరో డిప్రిసియేషన్, మెడికల్ కవర్, ఇంజిన్ ప్రొటెక్షన్ వంటి అనేక యాడ్-ఆన్‌లను బీమా సంస్థలు అందిస్తున్నాయి. అయితే వీటితో మీ ప్రీమియం పెరుగుతుందని గుర్తుంచుకోండి. మీ అవసరాలకు సరిపోయే వాటిని ఎంచుకోవడం మంచిది.
Published by:Veera Babu
First published:

Tags: Personal Finance, Two wheeler

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు