news18-telugu
Updated: November 18, 2020, 5:36 PM IST
ప్రతీకాత్మకచిత్రం
సోషల్ మీడియాలో అనేక కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి పుకార్లు వైరల్ గా వ్యాప్తి చెందుతున్నాయి. వీటి వెనుక కొందరు డేటా చౌర్యం వంటి నేరాలకు సైతం పాల్పడుతున్నారు. తాజాగా మోదీ ప్రభుత్వం దేశంలోని మహిళలందరి ఖాతాలో 1,24,000 రూపాయలు జమ చేస్తోందని ఇటీవల ఒక మెసేజ్ తెగ వైరల్ అవుతోంది. మహిళలందరి బ్యాంకు ఖాతాల్లో 'స్త్రీ స్వాభిమాన్ యోజన' కింద రూ .1 లక్ష 24 వేలను ప్రభుత్వం జమ చేస్తోందని ఈ వైరల్ మెసేజ్ బాగా సర్క్యూలేట్ అవుతోంది. ఈ మెసేజ్ కింద ప్రజలు వారి వ్యక్తిగత, బ్యాంక్ అకౌంట్ వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు.
అయితే తాజాగా స్త్రీ స్వాభిమాన్ యోజన పథకం గురించి భారత ప్రభుత్వ పిఐబి ఫాక్ట్ చెక్ (పిఐబి ఫాక్ట్ చెక్) యొక్క అధికారిక ట్విట్టర్ హ్యాండిల్, ఇది పూర్తిగా నకిలీదని పేర్కొంది. అటువంటి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రకటించలేదని, ఇది పూర్తిగా అవవాస్తవమని పేర్కొంది. అంతేకాదు ఈ తరహా మెసేజ్ వచ్చిన తరువాత, ఏ కస్టమర్ కూడా తన వ్యక్తిగత వివరాలను పంచుకోకుండా జాగ్రత్త పడాలని పేర్కొంది.
First published:
November 18, 2020, 5:33 PM IST