పిల్లల స్కూలు, కాలేజీ ఫీజులు చెల్లించేందుకు మోదీ ప్రభుత్వం నుంచి రూ.11 వేల సహాయం...

సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. కరోనా మహమ్మారి కారణంగా, పాఠశాలలు, కళాశాలల విద్యార్థులందరికీ వారి ఫీజులు చెల్లించడానికి కేంద్ర ప్రభుత్వం రూ .11 వేలు ఇస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది.

news18-telugu
Updated: September 22, 2020, 4:33 PM IST
పిల్లల స్కూలు, కాలేజీ ఫీజులు చెల్లించేందుకు మోదీ ప్రభుత్వం నుంచి రూ.11 వేల సహాయం...
ప్రధాని నరేంద్ర మోదీ(ఫైల్ ఫోటో)
  • Share this:
సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. కరోనా మహమ్మారి కారణంగా, పాఠశాలలు, కళాశాలల విద్యార్థులందరికీ వారి ఫీజులు చెల్లించడానికి కేంద్ర ప్రభుత్వం రూ .11 వేలు ఇస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. ఈ పోస్ట్‌లో ఒక లింక్ కూడా కనిపిస్తోంది. ఆ లింక్ సహాయంతో మీకు డబ్బు లభిస్తుందని, అందులో పేర్కొన్నారు. అంతేకాదు కరోనా వైరస్ మహమ్మారి కారణంగా, విద్యార్థులు పాఠశాల, కళాశాల ఫీజులను చెల్లించలేకపోతున్నారని, అందువల్ల కేంద్ర ప్రభుత్వం విద్యార్థులందరికీ రూ .11000 ఉచితంగా అందిస్తోంది. తద్వారా వారు తమ ఫీజులను సులభంగా చెల్లించగలరు. అనేది ఆ పోస్ట్ సారాంశం.

అయితే ఈ వెబ్‌సైట్ నకిలీదని PIB ఫాక్ట్ చెక్ పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం అలాంటి ప్రకటన చేయలేదు. అనాలోచిత లింక్‌లపై క్లిక్ చేయడం లేదా మీ వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవడం కూడా మీకు ప్రమాదకరమని సూచించింది.
PIB Fact Check ఏమి చేస్తుంది?కేంద్ర ప్రభుత్వ విధానం / పథకాలు / విభాగాలు / మంత్రిత్వ శాఖల గురించి తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి PIB Fact Check పనిచేస్తుంది. ప్రభుత్వానికి సంబంధించిన ఏవైనా వార్తలు నిజమా కాదా అని తెలుసుకోవడానికి PIB Fact Check సహాయం తీసుకోవచ్చు. స్క్రీన్‌షాట్, ట్వీట్, ఫేస్‌బుక్ పోస్ట్ లేదా యుఆర్‌ఎల్‌ను PIB Fact Check కు వాట్సాప్ నంబర్ 918799711259 కు పంపవచ్చు లేదా pibfactcheck@gmail.comకు మెయిల్ చేయవచ్చు.
Published by: Krishna Adithya
First published: September 22, 2020, 4:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading