Small Business Loans Initiative పేరిట కొనసాగనున్న ఈ కార్యక్రమంలో ఫేస్బుక్ తమ వెబ్ మీడియాలో అడ్వర్టైజ్ చేస్తున్న చిన్న, మధ్యతరహా వ్యాపారాలకు పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపింది.
డిజిటల్ సోషల్ మీడియా దిగ్గజ సంస్థ ఫేస్బుక్ కొత్త కార్యక్రమం ప్రారంభించనుంది. ఇందులో భాగంగా చిన్న వ్యాపారులకు అండగా ఉండాలని ఫేస్బుక్ ఇండియా వినూత్నమైన ఇనిషియేటివ్ ప్రారంభించనుంది. Small Business Loans Initiative పేరిట కొనసాగనున్న ఈ కార్యక్రమంలో ఫేస్బుక్ తమ వెబ్ మీడియాలో అడ్వర్టైజ్ చేస్తున్న చిన్న, మధ్యతరహా వ్యాపారాలకు పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపింది. తద్వారా వారి ఆర్థిక కష్టాలను తీర్చడం కోసం ఈ ప్రోగ్రామ్‌ను ఫేస్బుక్ లాంచ్ చేసింది. సుమారు మనదేశంలోని 200 నగరాల్లో ఈ ప్రోగ్రామ్‌ను ఫేస్బుక్ ప్రారంభించింది. దీని కోసం ఫేస్బుక్ Indifi అనే ఫైనాన్సియల్ సంస్థతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. మన దేశంలోని సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు క్రెడిట్ లోటు లేకుండా చూసేందుకు చిరు వ్యాపారులకు బిజినెస్ లోన్స్‌ను సులభతరం చేయడం కోసమే.. ఈ ప్రోగ్రామ్‌ను ప్రారంభించామని ఫేస్బుక్ వెల్లడించింది.
ఫేస్బుక్.. 2020లో Future of Business అనే ఓ సర్వేను చేయించింది. చిన్న, మధ్యతరహా వ్యాపారులకు క్యాష్ ఫ్లో పెద్ద సమస్యగా ఉన్నట్టు తేలింది. ముఖ్యంగా స్టార్టప్ బిజినెస్‌లకు లాంగ్ టైమ్ క్రెడిట్ హిస్టరీ ఉండదు కాబట్టి.. అటువంటి వ్యాపారాలకు రుణాలు దొరకడం చాలా కష్టంగా మారింది. ఆ సర్వే ద్వారా చిన్న వ్యాపారుల కష్టాలను తెలుసుకున్న ఫేస్బుక్ ఈ నిర్ణయం తీసుకుంది.
ఫేస్బుక్లో చిన్న వ్యాపారులు.. తమ వ్యాపారానికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చినప్పటికీ.. వాళ్లకు 17 నుంచి 20 శాతం వరకు వార్షిక వడ్డీతో లోన్స్ ఇవ్వనున్నట్టు ఫేస్బుక్ వెల్లడించింది. ఈ వ్యాపారులకు ఎటువంటి షూరిటీ లేకుండానే ఆన్లైన్ ద్వారా అప్లయి చేసుకుంటే.. ఫేస్బుక్ వెంటనే లోన్‌ను అప్రూవ్ చేయనుంది. అలాగే.. ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు ఉండదు. అప్లయి చేసుకున్న 5 రోజుల్లో లోన్ అమౌంట్‌ను ఇండిఫీ ఫైనాన్సియల్ సంస్థ క్రెడిట్ చేస్తుంది. కనీసం 5 లక్షల నుంచి 50 లక్షల వరకు బిజినెస్ రేంజ్‌ను బట్టి ఫేస్బుక్ లోన్‌ను అందివ్వనుంది.
ఈ ప్రోగ్రామ్‌ను వర్చువల్ ఈవెంట్ ద్వారా ఎఫ్ఐసీసీఐ పార్టనర్షిప్తో ఫేస్బుక్ ఇండియా ప్రకటించింది. ఈ ప్రోగ్రామ్‌కు నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ కూడా హాజరయ్యారు.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.