FACEBOOK SUED OVER FAILURE TO CENSOR ANTI MUSLIM HATE SPEECH MK GH
Facebook: అమెరికాలో ఫేస్‌బుక్‌పై పిటిషన్ దాఖలు చేసిన ‘ముస్లిం అడ్వకేట్స్’
ప్రతీకాత్మకచిత్రం
ఫేస్బుక్ మరో వివాదంలో చిక్కుకుంది. విద్వేషపూరిత ప్రసంగాలు, కంటెంట్‌ను నియంత్రించడంలో విఫలమైనందుకు ఫేస్‌బుక్‌పై ‘ముస్లిం అడ్వకేట్స్’ అనే సంస్థ అమెరికా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ ప్లాట్‌పాంలో ముస్లింలకు వ్యతిరేకంగా చేస్తున్న ప్రచారాన్ని సంస్థ అడ్డుకోలేకపోయిందని లాయర్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఫేస్బుక్ మరో వివాదంలో చిక్కుకుంది. విద్వేషపూరిత ప్రసంగాలు, కంటెంట్‌ను నియంత్రించడంలో విఫలమైనందుకు ఫేస్‌బుక్‌పై ‘ముస్లిం అడ్వకేట్స్’ అనే సంస్థ అమెరికా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ ప్లాట్‌పాంలో ముస్లింలకు వ్యతిరేకంగా చేస్తున్న ప్రచారాన్ని సంస్థ అడ్డుకోలేకపోయిందని లాయర్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉద్వేగాలను రెచ్చగొట్టే ప్రసంగాలను అడ్డుకుంటామని ఫేస్బుక్ అమెరికా చట్ట సభలను నమ్మించిందని తెలిపారు. ఈ ఆరోపణలపై అమెరికన్ ముస్లిం న్యాయవాదుల బృందం గురువారం కోర్టులో దావా వేసింది. వాషింగ్టన్‌లోని డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా సుపీరియర్ కోర్టులో ఈ వ్యాజ్యం దాఖలైంది. ఇందులో ఫేస్బుక్ అధిపతి మార్క్ జుకర్ బర్గ్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ షెరిల్ శాండ్ బర్గ్, ఇతర ఎగ్జిక్యూటివ్‌లను ప్రతివాదులుగా చేర్చారు.
నియమ నిబంధనలను అతిక్రమించే కంటెంట్ నిర్వహణలో వైఫల్యం కావడం ద్వారా వినియోగదారుల రక్షణ చట్టాన్ని ఫేస్బుక్ ఉల్లంఘించిందని న్యాయవాదులు పిటిషన్లో పేర్కొన్నారు. ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫాంలు హేట్ స్పీచ్ లేదా విద్వేషాలను రెచ్చగొట్టే కంటెంట్‌ను నియంత్రించడంలో విఫలమవుతున్నాయని స్వచ్చంద సంస్థలు ముందు నుంచి ఆరోపిస్తున్నాయి. వీటిల్లో ప్రస్తుతం పిటిషన్ దాఖలు చేసిన ముస్లిం అడ్వకేట్స్ స్వచ్ఛంద సంస్థ ఒకటి.
మరింత కృషి అవసరం
ద్వేషపూరిత ప్రసంగం, హింసాత్మక కంటెంట్, ఇతర కుట్రలను వివిధ సంస్థలు పెద్దగా పట్టించుకోవట్లేదని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రతిపాదనలపై గత సంవత్సరం ఫేస్బుక్ ఒక కమిటీని నియమించింది. కమిటీ రూపొందించిన సివిల్ రైట్స్ ఆడిట్‌ను సంస్థ 2020 జులైలో వెల్లడించింది. తమ ప్లాట్‌ఫాంలో ముస్లింలకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాన్ని అడ్డుకోవడానికి మరింత సమర్థంగా పనిచేయాలని నివేదిక పేర్కొంది. ఇందుకు అవసరమైన వనరుల్లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ఆడిట్ రిపోర్టు తెలిపింది. దీని ప్రకారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో పోస్టులను స్క్రీనింగ్ చేస్తున్నట్టు ఫేస్బుక్ వెల్లడించింది.
హింసకు వ్యతిరేకం అంటున్న ఫేస్బుక్
తమ సంస్థ విద్వేషపూరిత ప్రసంగాలను, కంటెంట్‌ను ఏమాత్రం సమర్థించదని ఫేస్బుక్ ప్రతినిధి ఒకరు తెలిపారు. ముస్లిం వ్యతిరేక ప్రచారాన్ని అడ్డుకోవడానికి, తమ సంస్థను సురక్షితమైన ప్లాట్‌ఫాంగా తీర్చిదిద్దడానికి.. నిపుణులు, స్వచ్ఛంద సంస్థలు, వాటాదారులతో కలిసి పనిచేస్తామని చెప్పారు. ఫేస్బుక్ విధానాలను ఉల్లంఘించే పేజీలను, హింసను ప్రేరేపించే అన్ని రకాల పోస్టులను తమ సంస్థ నుంచి తొలగిస్తామని ఫేస్బుక్ సీఈఓ జుకర్ బర్గ్ సైతం చెప్పారు. కానీ ముస్లింలపై వ్యతిరేక ప్రచారం కోసం అమెరికా కేంద్రంగా ఎన్నో ఫేస్బుక్ పేజీలు పనిచేస్తున్నాయని సామాజిక సంస్థల అధ్యయనంలో తేలింది. ఈ క్రమంలో ఫేస్బుక్ ప్రతినిధుల ప్రకటనలు వినియోగదారుల రక్షణ చట్టాన్ని ఉల్లంఘించినట్టుగా భావించాలని, ఇందుకు డ్యామేజీలు చెల్లించాలని న్యాయవాదులు పిటిషన్లో కోరుతున్నారు.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.