వ్యాపారాలు చేయాలనుకునేవారికి శుభవార్త. సోషల్ మీడియా దిగ్గజం అయిన ఫేస్బుక్ ఇండియాలో కొత్త బిజినెస్ మొదలుపెట్టింది. కొత్తగా లెండింగ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభించింది. చిరు వ్యాపారులకు రూ.50,00,000 వరకు రుణాలు ఇవ్వనుంది. ఫేస్బుక్ లెండింగ్ బిజినెస్ మొదటిసారిగా ఇండియాలోనే ఈ వ్యాపారం మొదలుపెట్టడం విశేషం. 200 పట్టణాల్లో చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రూ.5,00,000 నుంచి రూ.50,00,000 రుణాలు ఇచ్చేందుకు ఇండిఫై లెండింగ్ ప్లాట్‌ఫామ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది ఫేస్బుక్. ఈ రుణాలు తీసుకోవడానికి ష్యూరిటీ అవసరం లేదని, వడ్డీ రేటు 17 శాతం నుంచి 20 శాతం మధ్య ఉంటుందని కేవలం 5 రోజుల్లో రుణాలు మంజూరు చేస్తామని ఫేస్బుక్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, వైస్ ప్రెసిడెంట్ అజిత్ మోహన్ తెలిపారు. మహిళలు ఈ రుణాలు తీసుకుంటే 0.2 శాతం వడ్డీ తక్కువగా ఉంటుందని తెలిపారు. చిన్న, మధ్యతరహా వ్యాపారులకు రుణాలు దొరకడం ఓ సమస్య అని, ఆ సమస్యకు పరిష్కారంగా ఈ సర్వీస్ ప్రారంభించామని తెలిపారు.
గతేడాది సెప్టెంబర్‌లో 100 మిలియన్ డాలర్ల ఫేస్బుక్ బిజినెస్ గ్రాంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. భారతదేశంతో పాటు 30 దేశాల్లో వ్యాపారులకు మద్దతుగా నిలిచేందుకు ఫేస్బుక్ ఈ చొరవ తీసుకుంది. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, గుర్గావ్, న్యూఢిల్లీలో కరోనా వైరస్‌తో దెబ్బతిన్న 3,000 చిన్న, మధ్యతరహా వ్యాపారులకు 4 మిలియన్ డాలర్ల ఆర్థిక సహకారాన్ని అందించిన ఫేస్బుక్. 200 పట్టణాల్లో వ్యాపారులకు రుణాలు ఇచ్చేందుకు ఇండిఫై లెండింగ్ ప్లాట్‌ఫామ్‌తో చేతులు కలిపింది ఫేస్బుక్ ఇండియా. ఎంతమందికి రుణాలు ఇవ్వాలన్న లిమిట్ ఏమీ పెట్టుకోలేదు.
ఇక ఫేస్బుక్ విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల మంది వ్యాపారు ఫేస్‌బుక్‌కు చెందిన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సప్ యాప్స్ ఉపయోగిస్తున్నారు. భారతదేశానికి చెందిన వ్యాపారులు కూడా ఈ యాప్స్ ద్వారా తమ వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకుంటున్నారు. ఒక్కవాట్సప్లోనే 1.5 కోట్ల మంది బిజినెస్ యూజర్స్ ఉన్నారు.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.