FACEBOOK OUTAGE ADVERTISERS COUNT THE COST DETAILS HERE SU GH
Facebook Outage: ఫేస్బుక్ అంతరాయం కారణంగా భారీగా నష్టపోయిన అడ్వటైజింగ్ కంపెనీలు.. ఈ ఘటన ఫేస్బుక్ తలరాతను మార్చేయనుందా?
ప్రతీకాత్మక చిత్రం
ఈ సోమవారం దాదాపు ఐదు గంటల పాటు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్ పనిచేయకపోవడం.. మామూలు వినియోగదారులకు అది ఒక సాంకేతిక సమస్య కాని, ఫేస్బుక్ ఆధారంగా ప్రకటనలు ఇచ్చే అడ్వైర్టైజర్లకు అది చాలా ఖరీదైన వ్యవహారం.
ఈ సోమవారం దాదాపు ఐదు గంటల పాటు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్ పనిచేయకుండా నిలిచిపోయాయి. మామూలు వినియోగదారులకు అది ఒక సాంకేతిక సమస్య కాని, ఫేస్బుక్ ఆధారంగా ప్రకటనలు ఇచ్చే అడ్వైర్టైజర్లకు అది చాలా ఖరీదైన వ్యవహారం. ఫేస్బుక్లో (Facebook) మాత్రమే ప్రకటనలు ఇచ్చే ఒక కంపెనీ ఈ విషయంపై స్పందించింది. గత వారంతో పోలిస్తే అంతరాయం ఏర్పడిన సమయంలో తమ ఆదాయం 70% పడిపోయిందని తెలిపింది. ప్రకటనలపై ప్రతీ రోజు $ 40,000 ఖర్చు చేసే మరో కంపెనీ అమ్మకాలు 30% క్షీణించాయి. ఫేస్బుక్లో దాదాపు కోటి మంది ప్రకటనలు ఇస్తుంటారు. సంస్థ ఆదాయంలో 98% ఈ ప్రకటనల నుంచే వస్తుంది. జూన్ 30తో త్రైమాసికంలో ప్రతి ఆరు గంటలకు ప్రకటనల విక్రయం ద్వారా సగటున $78 మిలియన్ల ఆదాయం ఫేస్ బుక్ ఆర్జించింది. ఇదంతా చిన్న కంపెనీలు, సంస్థలు, వ్యక్తుల నుంచి వచ్చిందే.
ఈ మధ్య కాలంలో వెల్లువలా వస్తున్న విమర్శల కారణంగా చాలా మంది ఫేస్‌బుక్‌పై మండిపడుతున్నారు. విజిల్ బ్లోయర్‌గా (Whistleblower) మారిన ఫేస్బుక్ మాజీ ప్రాజెక్టు మేనేజర్ ఫ్రానెస్ హుగెన్, మంగళవారం అమెరికా సెనెటర్ల ముందు వివరణ ఇచ్చారు. తమ సేవల ద్వారా కలిగే హాని గురించి ముఖ్యంగా టీనేజ్ అమ్మాయిలపై ఇన్స్టాగ్రామ్ (Instagram) ప్రతికూల ప్రభావం ఉందనే విషయం కంపెనీకి తెలుసని ఆయన వాంగూల్మం ఇచ్చారు. విద్వేష ప్రసంగాలు, తప్పుడు సమాచారం, గోప్యతకు సంబంధించి ఈ మధ్య కాలంలో ప్రకటనకర్తల నుంచి ఫేస్బుక్ విమర్శలు ఎదుర్కొంటోంది.
మరో వైపు అంతరాయంపై ఫేస్బుక్ వైస్ ప్రెసిడెంట్ గ్రాహం మడ్ (Graham Mudd) ట్విట్టర్ వేదికగా క్షమాపణలు కోరారు. అంతరాయం సమయంలో ప్రకటనలకు డబ్బులు వసూలు చేయమని ఫేస్బుక్ ప్రకటించింది.
ఫ్రీలాన్స్ మీడియా కొనుగోలుదారు డేవిడ్ హెర్మన్ ఈ పరిణామాలపై అసహనం వ్యక్తం చేశారు. “ఆ రోజంతా నేను ఫేస్బుక్ చెక్ చేస్తూనే ఉన్నాను ఔటేజ్ నుంచి ఫేస్బుక్ బయటకు వస్తుందేమోనని” అన్నారు హెర్మెన్. ఆ విషయంలో ఫేస్బుక్ నుంచి స్పష్టమైన సమాచారమేది లేకపోవడంతో వేచి ఉండాల్సి వచ్చిందని చికాకు పడ్డారు.
మహమ్మారి ఆంక్షల కారణంగా అమెరికాలో సరఫరా వ్యవస్థ సంక్లిష్టంగా మారింది. ఈ సంవత్సరంలో ఇప్పుడు సెలవుల సీజన్ ప్రారంభమైన వేళ ఈ అంతరాయ ఏర్పడటం చాలా మంది ప్రకటనకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఖాతాదారులకు చేరవయ్యేందుకు అమెరికాలో చాలా మంది ఫేస్‌బుక్‌పైనే పూర్తిగా ఆదారపడుతుంటారు. తాజా పరిణామాలతో ఇందులో మార్పులు సంభవిస్తున్నాయి. ఒక్కదానిపైనే పూర్తిగా ఆధారపడరాదనే విషయం తెలిసిందని చాలా మంది ప్రకటనకర్తలు అంటున్నారు.
ఈ అంతరాయం కారణంగా ఫేస్బుక్ కష్టాలు తీవ్రమవుతున్నాయి. తనను తాను కాపాడుకునేందుకు ఫేస్బుక్ ప్రయత్నిస్తోందని ప్రముఖ ప్రకటనల సంస్థ ఓమ్నికామ్ మీడియా గ్రూప్ తన క్లైంట్స్‌కు మెసేజస్ పంపించింది. ఫేస్బుక్ గురించి వాల్‌స్ట్రీట్ జర్నల్‌లో వచ్చిన అనేక ఆర్టికల్స్‌ను తన క్లైంట్స్‌కు ఈ కంపెనీ పంపించింది. ముందస్తు సమాచారం ఉన్న ఫేస్బుక్ స్పందించలేదని తెలిపారు. ఎటువంటి బహిరంగ జవాబుదారీతనం, పారదర్శకత లేకుండా పనిచేసే ఒక సమాంతర న్యాయవ్యవస్థ ఫేస్బుక్లో ఉందని ఓమ్నికామ్ పేర్కొంది.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.