JIO-Facebook Deal : జియో మార్ట్, వాట్సాప్‌‌ భాగస్వామ్యం.. కోట్ల మంది చిరు వ్యాపారులకు లాభం..

Facebook-Jio Deal : డిజిటల్ వ్యాపారం వేగంగా పుంజుకునే దిశగా రిలయన్స్ జియో, ఫేస్‌బుక్ వేసిన అడుగులు ఇండియాలోని లక్షల మంది చిన్న వ్యాపారులకు, కోట్లాది వినియోగదారులకు మేలు చేయనుంది.

news18-telugu
Updated: April 22, 2020, 1:37 PM IST
JIO-Facebook Deal : జియో మార్ట్, వాట్సాప్‌‌ భాగస్వామ్యం.. కోట్ల మంది చిరు వ్యాపారులకు లాభం..
జియో మార్ట్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
Facebook-Jio Deal : డిజిటల్ వ్యాపారం వేగంగా పుంజుకునే దిశగా రిలయన్స్ జియో, ఫేస్‌బుక్ వేసిన అడుగులు ఇండియాలోని లక్షల మంది చిన్న వ్యాపారులకు, కోట్లాది వినియోగదారులకు మేలు చేయనుంది. జియోలో 9.99 శాతం వాటాను కొనుగోలు చేసిన ఫేస్‌బుక్.. వ్యాపార, ఆర్థిక రంగాలను కొత్త పుంతలు తొక్కించే దిశగా తమ బంధం ఉంటుందని పేర్కొంది. అయితే, ఈ డీల్ వల్ల జియో మార్ట్ ప్రజల్లోకి చొచ్చుకెళ్లనుంది. అందుకు ఫేస్‌బుక్‌కు చెందిన వాట్సాప్ సపోర్టు తీసుకోనుంది. చిన్న వ్యాపారులకు, కస్టమర్లకు మేలు చేయడంలో ప్రముఖ పాత్రను పోషిస్తాయని జియో కూడా ఒక ప్రకటనలో తెలిపింది. స్థానిక కిరాణా స్టోర్లతో వినియోగదారులు అనుసంధానం అయ్యేందుకు జియో మార్ట్, వాట్సాప్ ఉపయోగపడనున్నాయని వెల్లడించింది. వినియోగదారునికి కావాల్సిన సరుకులను స్థానిక కిరాణా స్టోర్ నుంచి ఎలాంటి మినిమమ్ ఆర్డర్ లేకుండా ఇంటికే చేర్చేలా జియో మార్ట్, వాట్సాప్ వివరించింది.

దీంతో జియో మార్ట్ మార్కెట్‌లో దూసుకెళ్లడమే కాకుండా, వాట్సాప్‌కు కొత్త యూజర్లు వస్తారు. తద్వారా బిజినెస్ పెరిగి కోట్ల మంది చిన్న వ్యాపారులకు లబ్ధి చేకూరుతుంది.
First published: April 22, 2020, 1:36 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading