Facebook Data Leak: ఫేస్‌బుక్ డేటా లీక్ సంబంధించి ఐర్లాండ్ కోర్టు...సంచలన నిర్ణయం

Facebook Data Leak: ఫేస్‌బుక్ డేటా లీక్ సంబంధించి ఐర్లాండ్ కోర్టు...సంచలన నిర్ణయం

ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్

యూజర్ల పర్సనల్ ఫోన్ నంబర్లు సహా 50 కోట్లకు పైగా ఫేస్ బుక్ వినియోగదారుల సమాచారాన్ని ఉచితంగా అందిస్తున్నట్లు ఒక హ్యాకర్ ప్రకటించి సంచలనం రేపాడు. దీనికి సంబంధించి ఐర్లాండ్ కు చెందిన కోర్టులు కేసులను స్వీకరించేందుకు సిద్ధమవుతున్నాయి.

  • Share this:
    ఇటీవల ఫేస్‌బుక్ డేటా లీక్ అంశం ఎంతటి గందరగోళాన్ని క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుమారు 53.3 కోట్ల మంది డేటా లీక్‌ అయినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. యూజర్ల పర్సనల్ ఫోన్ నంబర్లు సహా 50 కోట్లకు పైగా ఫేస్ బుక్ వినియోగదారుల సమాచారాన్ని ఉచితంగా అందిస్తున్నట్లు ఒక హ్యాకర్ ప్రకటించి సంచలనం రేపాడు. దీనికి సంబంధించి ఐర్లాండ్ కు చెందిన కోర్టులు కేసులను స్వీకరించేందుకు సిద్ధమవుతున్నాయి. ఎవరైతే తమ ప్రైవసీకి భంగం కలిగిందని భావిస్తున్నారో వారంతా కేసులు పెట్టవచ్చని ఐరిష్ కోర్టులు పేర్కొన్నాయి. అయితే ఫేస్ బుక్ మాత్రం తమ వైపు నుంచి ఎలాంటి లోపం లేదని వాదిస్తోంది. అలాగే ఎలాంటి డాటా లీక్ కాలేదని తెలుపుతోంది. మరోవైపు ఇజ్రాయెల్ సైబర్ క్రైమ్ ఇంటెలిజెన్స్ సంస్థ హడ్సన్ రాక్ సహ వ్యవస్థాపకుడు అలోన్ గాల్ ప్రకారం, ఆ డేటాబేస్ జనవరి నుండి హ్యాకర్ సర్కిల్‌లలో చెలామణి అవుతున్న ఫేస్ బుక్-లింక్డ్ టెలిఫోన్ నంబర్ లు లానే కనిపిస్తుందని పేర్కొన్నారు.

    ఫేస్ బుక్ డేటా లీక్ 106 దేశాల నుండి 533 మిలియన్లకు పైగా ఫేస్ బుక్ ఖాతాలను తాకింది. వీటిలో భారతదేశంలో 6 మిలియన్లకు పైగా వినియోగదారులు, యుఎస్లో 32 మిలియన్లు మరియు యుకెలో 11 మిలియన్లు ఉన్నారు.

    అయితే ఈ డేటా చాలా పాతది మరియు 2019 ఆగస్టులో పరిష్కరించిన సమస్యకు సంబంధించినదని ఫేస్ బుక్ ఒక ప్రకటనలో తెలిపింది.
    Published by:Krishna Adithya
    First published:

    అగ్ర కథనాలు