• Home
  • »
  • News
  • »
  • business
  • »
  • FACEBOOK ANOTHER FEAT OF FACEBOOK IF EVERYONE DOES THIS IT IS VERY GOOD FOR NATURE MK GH

Facebook: మరో ఘనత సాధించిన ఫేస్‌బుక్‌...అందరూ ఇలా చేస్తే ప్రకృతికి ఎంతో మేలు!

ప్రతీకాత్మక చిత్రం

ప్రపంచవ్యాప్తంగా తమ కార్యాలయాల్లో పునరుత్పాదక శక్తి, సున్నా ఉద్గార లక్ష్యాలను అందుకున్నట్లు తెలిపింది. 2020కి చెందిన సస్టైనబిలిటీ నివేదికను ఫేస్‌బుక్‌ ఇటీవల వెలువరించింది. అందులో ప్రకృతి పరిరక్షణ కోసం ఫేస్‌బుక్‌ తీసుకున్న నిర్ణయాల గురించి ప్రస్తావించింది.

  • Share this:
ప్రకృతి పరిరక్షణకు వంద శాతం పునరుత్పాదక శక్తి, సున్నా ఉద్గారాలు చాలా అవసరం అని పర్యావరణ నిపుణులు చెబుతూ ఉంటారు. తాజాగా ఆ లక్ష్యాలను చేరుకున్నట్లు ఫేస్‌బుక్‌ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా తమ కార్యాలయాల్లో పునరుత్పాదక శక్తి, సున్నా ఉద్గార లక్ష్యాలను అందుకున్నట్లు తెలిపింది. 2020కి చెందిన సస్టైనబిలిటీ నివేదికను ఫేస్‌బుక్‌ ఇటీవల వెలువరించింది. అందులో ప్రకృతి పరిరక్షణ కోసం ఫేస్‌బుక్‌ తీసుకున్న నిర్ణయాల గురించి ప్రస్తావించింది.

సస్టైనబిలిటీ నివేదిక ప్రకారం చూస్తే... ఫేస్‌బుక్‌ గ్రీన్‌ హౌస్‌ ఉద్గారాలను తగ్గించగలిగింది. 2017లో 94 శాతంగా ఉన్న ఉద్గారాలను 75 శాతానికి తగ్గించి లక్ష్యాన్ని అందుకుంది. ఇప్పుడు 2020లో సున్నా ఉద్గార స్థాయిని అందుకుంది. మరోవైపు పునరుత్పాదక శక్తి విషయంలోనూ ఫేస్‌బుక్‌ మంచి ఫలితాలు చూపించింది. మొత్తంగా 5.9 గిగావాట్స్‌ పవన విద్యుత్త, సౌర విద్యుత్తును ఉత్పత్తి చేసింది. మరోవైపు 5.8 మిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల నీటిని రీస్టోర్‌ చేసింది ఫేస్‌బుక్‌.

ప్రకృతి పరిరక్షణ కోసం ఫేస్‌బుక్‌ క్లైమేట్‌సైన్స్‌ ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌ను లాంచ్‌ చేసింది. ఈ హబ్‌లో ప్రకృతి పరిరక్షణకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించారు. అలాగే ప్రకృతి పరిక్షణ కోసం చాలా రకాల చర్యలు తీసుకున్నారు. వాతావరణంలో కార్బన్‌ పరిమాణాన్ని తగ్గించడానికి కూడా ఫేస్‌బుక్‌ చర్చలు చేపట్టింది. దీని కోసం హై క్వాలిటీీ కార్బన్‌ రిమూవల్‌ ప్రాజెక్ట్స్‌ను ఏర్పాటు చేసింది. ఇవి 1,45,000 మెట్రిక్‌ టన్నుల కార్బన్‌ను వాతావరణం నుంచి సంగ్రహించాయి. దీంతోపాటు తూర్పు ఆఫ్రికా, మిసిసిపీ రివర్‌ వ్యాలీలో మొక్కల పెంపకం కార్యక్రమాన్ని చేపట్టింది.

ప్రస్తుతం మానవాళి ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యల్లో వాతావరణ మార్పు ఒకటి. ఈ విపత్తును ఎదుర్కోవడానికి ఫేస్‌బుక్‌ ఎప్పుడూ ముందుంటుంది. వాతావరణంలో జీరో కార్బన్‌ స్థాయిని అందుకోవడమే తమ లక్ష్యమని ఫేస్‌బుక్‌ చెబుతోంది. టెక్నాలజీ పరంగా యూజర్లకు ఉత్తమ ఫీచర్లు ఇస్తూనే, ఇలా ప్రకృతి పరిరక్షణకు నడుం కట్టడం మంచి విషయమే కదా. ఫేస్‌బుక్‌ చాలా కాలంగా ప్రయత్నాలు చేసి ఇప్పటికి తన లక్ష్యం అందుకుంది. భవిష్యత్తులోనూ ఇలాంటి మంచి పనులు కొనసాగించాలని నిర్ణయించుకుంది.
Published by:Krishna Adithya
First published: