FABINDIA LIFESTYLE COMPANY IS COMING UP WITH AN IPO AIMING TO RAISE RS 4000 CRORE MK
Fab India IPO: ఐపీఓకు వచ్చిన ఫ్యాబ్ ఇండియా, రూ.4000 కోట్ల సమీకరణే లక్ష్యంగా IPO...
fab india ( ప్రతీకాత్మకచిత్రం)
లైఫ్ స్టైల్ ఉత్పత్తుల కంపెనీ ఫ్యాబ్ ఇండియా (Fab India) ఐపీఓ ద్వారా రూ.4,000 కోట్లు సమీకరించాలని యోచిస్తోంది. ఇందుకోసం కంపెనీ శనివారం మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి దరఖాస్తు చేసింది.
లైఫ్ స్టైల్ ఉత్పత్తుల కంపెనీ ఫ్యాబ్ ఇండియా (Fab India) ఐపీఓ ద్వారా రూ.4,000 కోట్లు సమీకరించాలని యోచిస్తోంది. ఇందుకోసం కంపెనీ శనివారం మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి దరఖాస్తు చేసింది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఆమోదం కోసం సమర్పించిన డ్రాఫ్ట్ ప్రతిపాదన ప్రకారం, ఈ ఆఫర్లో రూ. 500 కోట్ల విలువైన కొత్త షేర్లు జారీ చేయనున్నారు. ఇది కాకుండా, ఫ్యాబ్ఇండియా 2,50,50,543 పాత షేర్లను కూడా విక్రయించనుంది. PTI అందించిన సమాచారం ప్రకారం, ఈ IPO ద్వారా FabIndia రూ. 4,000 కోట్లను సమీకరించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలకు తెలిపింది. కంపెనీ వ్యాపారంతో అనుబంధం ఉన్న ఆర్టిస్టుల, రైతులకు కంపెనీ ప్రమోటర్లకు చెందిన ఏడు లక్షల షేర్లను అందజేసే యోచన కూడా ఉంది. కంపెనీ దాని అనుబంధ సంస్థలతో అనుబంధం ఉన్న కొంతమంది రైతులు, కళాకారులకు కృతజ్ఞతగా, FabIndia సంస్థ తమ ఇద్దరు ప్రమోటర్లు, Bimal Nanda Bisel చెందిన 4,00,000 షేర్లు, Madhukar Khedaలకు చెందిన , 3,75,080 ఇవ్వనున్నట్లు IPO ముసాయిదా తీర్మానం పేర్కొంది.
ఇది కాకుండా ఆసియాలోనే రెండో అత్యంత సంపన్నుడైన గౌతమ్ అదానీకి చెందిన మరో కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ కానుంది. మీడియా కథనాల ప్రకారం, అదానీ విల్మార్ , IPO ఈ నెలలో వస్తుంది. అదానీ విల్మార్ , IPO విలువ రూ. 3600 కోట్లు. జనవరి 27న సబ్స్క్రిప్షన్ కోసం ప్రారంభం కానుంది. ఈ కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ , విల్మార్ ఇంటర్నేషనల్ జాయింట్ వెంచర్. అందుబాటులో ఉన్న నివేదికల ప్రకారం, అదానీ విల్మార్ IPO కోసం ఇష్యూ ధర రూ. 218-230 కాగా, కంపెనీ వాల్యుయేషన్ రూ. 26,287 కోట్లుగా అంచనా వేశారు. వచ్చే నెలలో ఔషధ తయారీ సంస్థ ఎంక్యూర్ ఫార్మాస్యూటికల్స్ రూ. 5000 కోట్ల ఐపీఓతో ముందుకు రానుంది.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.