• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • EXPLAINED KNOW HOW TO CHANGE MUTUAL FUND KYC DETAILS SS GH

Mutual Fund KYC: మ్యూచువల్ ఫండ్ కేవైసీ వివరాలు మార్చాలా? ఇలా సులభంగా అప్లై చేయండి

Mutual Fund KYC: మ్యూచువల్ ఫండ్ కేవైసీ వివరాలు మార్చాలా? ఇలా సులభంగా అప్లై చేయండి

Mutual Fund KYC: మ్యూచువల్ ఫండ్ కేవైసీ వివరాలు మార్చాలా? ఇలా సులభంగా అప్లై చేయండి (ప్రతీకాత్మక చిత్రం)

Mutual Fund KYC | మీ బ్యాంక్ అకౌంట్ కేవైసీ వివరాలు, డీమ్యాట్ అకౌంట్, మ్యూచువల్ ఫండ్స్ వంటివన్నీ వేర్వేరుగా ఉంటాయి. ఒక్క మ్యూచువల్ ఫండ్స్ కేవైసీని మార్చుకోవాలనుకుంటే అదే మారుతుంది తప్ప మిగిలిన వాటిపై అది ప్రభావం చూపించదు.

  • Share this:
ప్రస్తుతం ఏ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ పూర్తి చేయాలన్నా దానికి కేవైసీ పూర్తి చేయడం తప్పనిసరిగా మారింది. అలాగే మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టేముందు, పెట్టుబడులు పెట్టిన తర్వాత కూడా కొన్ని సార్లు అప్పుడప్పుడూ మీ కేవైసీ ఫార్మాలిటీస్ పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే చాలామంది కేవైసీ ఒకసారి పూర్తి చేస్తే సరిపోతుందని భావిస్తారు. కానీ ఇది పొరపాటు. కేవైసీ వివరాలను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తూ ఉండడం వల్ల భవిష్యత్తులో మీకు ఎలాంటి ఇబ్బందులూ ఉండవు.

కేవైసీ ఎందుకు మార్చాలి?


సాధారణంగా ఒకే అడ్రస్ లో ఉన్నంత కాలం కేవైసీలో పెద్దగా మార్పులేవీ ఉండవు. కానీ కొన్నిసార్లు ఇళ్లు మారడం, ఉద్యోగరీత్యా పట్టణాలు మారడం, కొంతమంది వేరే దేశాలకు కూడా వెళ్తుంటారు. ఇలాంటప్పుడు అడ్రస్ మారుతుంది. మీ పేరులో మార్పుల కోసం, మీరు వేరే దేశానికి వలస వెళ్లినప్పుడు దాన్ని కన్ఫార్మ్ చేయడం కోసం.. ఇలా వివిధ రకాల సమయాల్లో కేవైసీ వివరాలను మార్చాల్సి ఉంటుంది.

IRCTC Goa Tour: హైదరాబాద్ నుంచి ఫ్లైట్‌లో గోవాకు హనీమూన్... ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ వివరాలివే

Paytm: పేటీఎం కొత్త ఆఫర్... రూ.1,000 క్యాష్‌బ్యాక్, రివార్డ్స్ పొందండి ఇలా

ఒకటి మార్చితే సరిపోతుందా?


మీ బ్యాంక్ అకౌంట్ కేవైసీ వివరాలు, డీమ్యాట్ అకౌంట్, మ్యూచువల్ ఫండ్స్ వంటివన్నీ వేర్వేరుగా ఉంటాయి. ఒక్క మ్యూచువల్ ఫండ్స్ కేవైసీని మార్చుకోవాలనుకుంటే అదే మారుతుంది తప్ప మిగిలిన వాటిపై అది ప్రభావం చూపించదు. ఒకవేళ మీరు మార్చుకోవాలనుకుంటే వీటన్నింటినీ విడివిడిగా మార్చుకోవాల్సి ఉంటుంది. అన్నింటికీ కలిపి ఒకే కేవైసీ పద్ధతి ఇంకా రాలేదు. అయితే ఒక మ్యూచువల్ ఫండ్‌కి సంబంధించి మీరు కేవైసీ మార్చితే మాత్రం అదే ఫండ్ హౌజ్ కాకపోయినా వేరే మ్యూచువల్ ఫండ్స్‌కి సంబంధించిన కేవైసీ కూడా మారుతుంది.

ఎలా మార్చాలి?


మొదటిసారి మ్యూచువల్ ఫండ్స్ తీసుకుంటున్నప్పుడు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ ఫారం నింపడం ద్వారా కేవైసీ పూర్తి చేసే వీలుంటుంది. దీనికోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు ఫారం నింపి దానికి అవసరమైన డాక్యుమెంట్లను జత చేయాలి. ఆ తర్వాత పర్సనల్ వెరిఫికేషన్ ఉంటుంది. దీనికోసం ఏజెంట్ మీ ఇంటికి రావడమో లేక వీడియో కాల్ లో మీతో మాట్లాడడమో చేస్తారు. దీనివల్ల ఆ కేవైసీ డాక్యుమెంట్లలో ఉన్నది మీ ఫొటోనేనా.. ఆ వివరాలు మీవేనా అని వారు తెలుసుకుంటారు. ఆ తర్వాత కేవైసీ వివరాలు మార్చుకోవాలనుకుంటే మాత్రం మీరు నేరుగా ఆ మ్యూచువల్ ఫండ్స్ ఆఫీస్ కి వెళ్లి అప్లై చేయాల్సి ఉంటుంది. మీరు అప్లై చేసిన 7 నుంచి 10 రోజుల్లో మీ సమాచారంలో మార్పు కనిపిస్తుంది.

Driver License Services: గుడ్ న్యూస్... ఇక ఈ 18 రకాల సేవల కోసం ఆర్‌టీఓ ఆఫీసుకి వెళ్లాల్సిన అవసరం లేదు

Driving License: డ్రైవింగ్ లైసెన్స్‌కు ఆన్‌లైన్‌లో అప్లై చేయండి ఇలా

ఏం డాక్యుమెంట్స్ కావాలి?


మ్యూచువల్ ఫండ్స్ కేవైసీ లో మార్పు కోసం మీరు కేవైసీ డీటెయిల్స్ ఛేంజ్ ఫారం ని నింపాల్సి ఉంటుంది. దీన్ని వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవడం లేదా మ్యూచువల్ ఫండ్స్ రిజిస్టర్ అండ్ ట్రాన్స్ ఫర్ ఏజెంట్స్ దగ్గర నుంచి కానీ పొందవచ్చు. దీన్ని పూర్తిగా నింపి దీనితో పాటు సెల్ఫ్ అటెస్టెడ్ (సంతకం చేసిన) పాన్ కార్డును జత చేయాలి. దీనితో పాటు మీరు మార్పు చేయాల్సిన వివరాలను బట్టి సెల్ఫ్ అటెస్ట్ చేసిన పాస్ పోర్ట్, రేషన్ కార్డ్, ఎలక్ట్రిసిటీ బిల్, బ్యాంక్ స్టేట్ మెంట్ వంటివి జత చేయాలి. మీ పర్మనెంట్, ప్రస్తుత చిరునామాలు వేర్వేరు అయితే రెండు అడ్రస్ లకు సంబంధించిన డాక్యుమెంట్స్ జత చేయాల్సి ఉంటుంది. వీటిని మీరు మ్యూచువల్ ఫండ్ సంస్థలు, లేదా ఏజెంట్ల దగ్గర సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో మీ ఒరిజినల్స్ చూపించాల్సి ఉంటుంది. జిరాక్స్ కాపీలను సెల్ఫ్ అటెస్ట్ చేసి జత చేయాల్సి ఉంటుంది.
Published by:Santhosh Kumar S
First published:

అగ్ర కథనాలు