Home /News /business /

EXPLAINED ABOUT HOW TOKENISATION WHICH KICKS OFF ON JULY 1 UMG GH

Explained: వెరీ యూజ్‌ఫుల్.. ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్‌లో రానున్న మార్పులివే.. జూలై 1 నుంచే అమలు..!

ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ సమయంలో టోకెన్ సిస్టమ్ . (ప్రతీకాత్మక చిత్రం)

ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ సమయంలో టోకెన్ సిస్టమ్ . (ప్రతీకాత్మక చిత్రం)

ఆన్‌లైన్‌ (Online) ట్రాన్సాక్షన్‌లను మరింత సురక్షితంగా మార్చేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) టోకెనైజేషన్‌ (Tokenisation) అనే పద్ధతిని అమలు చేసేందుకు సిద్ధమైంది. దీని ద్వారా వినియోగదారుల ప్రైవసీకి రక్షణ ఉంటుందని పేర్కొంది.

ఇంకా చదవండి ...
ఆన్‌లైన్‌ ట్రాన్సాక్షన్‌లను మరింత సురక్షితంగా మార్చేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా టోకెనైజేషన్‌ (Tokenisation) అనే పద్ధతిని అమలు చేసేందుకు సిద్ధమైంది. దీని ద్వారా వినియోగదారుల ప్రైవసీకి రక్షణ ఉంటుందని పేర్కొంది. జూలై 1 నుంచి క్రెడిట్, డెబిట్ కార్డ్‌లను ఉపయోగించి చేసే ఆన్‌లైన్ షాపింగ్, ఇతర ట్రాన్సాక్షన్లు మరింత సురక్షితంగా మారనున్నాయి.

పేమెంట్‌ అగ్రిగేటర్లు, వాలెట్లు, ఆన్‌లైన్ వ్యాపారులు వినియోగదారుల కార్డ్ వివరాలతో సహా ఎటువంటి సున్నితమైన సమాచారాన్ని స్టోర్‌ చేయకూడదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆదేశించింది. 16 అంకెల కార్డ్ నంబర్‌లను 'టోకెన్'తో భర్తీ చేస్తారు. వాస్తవ సమాచారం తెలుసుకునే వీలుండదు. కార్డ్‌ల ద్వారా చేసే ట్రాన్సాక్షన్‌లు కార్డ్ టోకెనైజేషన్ ప్రక్రియ ద్వారా ప్రభావితం కాకుండా ఉంటాయని క్యాష్‌ఫ్రీ పేమెంట్స్‌ సహ వ్యవస్థాపకుడు రీజు దత్తా చెప్పారు. కస్టమర్‌గా, టోకెన్ వివరాలను గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదని, పేమెంట్స్‌ సమయంలో ఎలాంటి మార్పులు ఉండవని వరల్డ్‌లైన్ ఇండియాలో డిజిటల్ కామర్స్ వీపీ ప్రొడక్ట్స్ అండ్ సొల్యూషన్స్ జగదీష్ కుమార్ చెప్పారు.

ఇదీ చదవండి: క్రెడిట్‌, డెబిట్‌ కార్డ్‌లకు కొత్త రూల్‌.. ఇకపై అది చేయకపోతే ప్రతిసారీ డీటేల్స్ ఎంటర్‌ చేయాల్సిందే..!


కార్డుల టోకెనైజేషన్ అంటే ఏమిటి?
ఇప్పటి వరకు, ఇ-కామర్స్ వెబ్‌సైట్‌ల నుంచి వస్తువులను కొనుగోలు చేసినప్పుడల్లా లేదా ట్రావెల్ వెబ్‌సైట్ ద్వారా రైలు లేదా విమాన టిక్కెట్‌లను బుక్ చేసినప్పుడల్లా, ఫ్యూచర్‌ ట్రాన్సాక్షన్‌లు సులభంగా జరిగేందుకు డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ వివరాలను సేవ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత చేసే పేమెంట్స్‌కు కేవలం మూడు అంకెల CVV నంబర్‌ను మాత్రమే నమోదు చేస్తే, పేమెంట్‌ చెక్అవుట్‌ను సెకన్లలోపు చేస్తారు. కానీ ప్రస్తుతం కార్డు వివరాలను సేవ్ చేయడం ప్రమాదకరం. ప్రముఖ వెబ్‌సైట్‌ల నుంచి హ్యాకర్లు డేటాను సేకరించిన సందర్భాలు ఉన్నాయి.

ఇప్పుడు టోకెనైజేషన్ ప్రక్రియ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ 16-అంకెల నంబర్‌ను యూనిక్ టోకెన్‌తో రీప్లేస్ చేస్తుంది. ఈ టోకెన్ ఒక కార్డుకు, ఒక మర్చెంట్‌కు ఒకేసారి ఉపయోగపడుతుంది. ఈ టోకెన్, కార్డ్ వివరాలను పూర్తిగా అందించదు. కాబట్టి మర్చంట్ వెబ్‌సైట్ నుంచి డేటా లీక్ అయినా, హ్యాకర్‌ కార్డ్ వివరాలను దుర్వినియోగం చేయలేడు. ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్, మొబైల్ పాయింట్ ఆఫ్ సేల్ లావాదేవీలు లేదా యాప్‌లో లావాదేవీల కోసం టోకెన్‌లను ఉపయోగించవచ్చు.

ఇదీ చదవండి: క్రెడిట్ కార్డ్ బాధితులారా.. మినిమం అమౌంటే చెల్లిస్తున్నారా..? అయితే, ఈ విషయాలు తెలుసుకోండి..!


టోకెనైజేషన్ తప్పనిసరి నిబంధనా?
జూలై 1 నుంచి అమలులోకి వచ్చే టోకెనైజేషన్ నియమం ఆన్‌లైన్ లావాదేవీలను ప్రాసెస్ చేయడం కోసం కార్డ్ నంబర్‌లు, CVV లేదా గడువు తేదీని సర్వర్‌లో సేవ్ చేయకుండా మర్చంట్ వెబ్‌సైట్‌లను నిషేధిస్తుంది. కార్డ్ వినియోగదారులు షాపింగ్ వెబ్‌సైట్‌లో వస్తువును కొనుగోలు చేసే ముందు టోకెన్‌ను తయారు చేసి, నిర్దిష్ట వెబ్‌సైట్‌లో (భవిష్యత్తు ఉపయోగం కోసం) ఆ టోకెన్‌ను సేవ్ చేయాలి లేదా టోకెన్‌ను సృష్టించి, షాపింగ్ తర్వాత చెల్లింపు సమయంలో (భవిష్యత్తులో ఉపయోగం కోసం) సేవ్ చేయాలి.

అయితే డెబిట్, క్రెడిట్ కార్డ్ టోకెనైజేషన్ ప్రక్రియ తప్పనిసరి కాదు. కస్టమర్‌లు తమ కార్డ్‌లను మర్చంట్ వెబ్‌సైట్‌లో టోకనైజ్ చేయాలా వద్దా అని ఎంచుకోవచ్చు. అలాంటప్పుడు, కస్టమర్ ఏదైనా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసేటప్పుడు 16-అంకెల కార్డ్ నంబర్, గడువు తేదీ, CVV సహా ప్రతి లావాదేవీకి కార్డ్ వివరాలను మళ్లీ మళ్లీ నమోదు చేయాలి. కార్డ్ వివరాలు Flipkart, Amazon, Myntra మొదలైన వెబ్‌సైట్‌లలో స్టోర్‌ కావు. ఆన్‌లైన్‌లో ఏదైనా కొనుగోలు చేసిన ప్రతిసారీ కార్డ్‌ని టోకనైజ్ చేసి, టోకెన్‌ని స్టోర్ చేసుకునేలా సెలక్ట్‌ చేసుకోవచ్చు, లేదా కార్డ్ వివరాలను ప్రతిసారి నమోదు చేయవచ్చు.

ఇదీ చదవండి: ఏసీ కొనేవారికి అలర్ట్.. జూలై 1 నుంచి కొత్త స్టార్ రేటింగ్స్‌.. అసలు ప్రభావం ఇదే..!


ప్రస్తుత ప్రక్రియ నుంచి సజావుగా మారడానికి RBI దేశవ్యాప్తంగా కార్డ్ టోకెనైజేషన్ అడాప్షన్‌ను 2022 జనవరి 1 నుంచి జూలై 1, వరకు ఆరు నెలల పాటు పొడిగించింది. జూన్ 8న, మానిటరీ పాలసీ కమిటీ సమావేశం తరువాత, ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ టి రబీ శంకర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కొత్త నిబంధనల కోసం జూన్ 30 గడువు కంటే ముందే కార్డ్ ఆధారిత లావాదేవీల కోసం టోకెనైజేషన్‌ను అమలు చేయడానికి పేమెంట్స్‌ ఎకోసిస్టమ్‌ సిద్ధంగా ఉందని చెప్పారు.

ఆన్‌లైన్ మర్చంట్‌తో కార్డ్‌ని ఎలా టోకెనైజ్ చేయవచ్చు?
ఆన్‌లైన్ మర్చంట్‌ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌లో పేమెంట్ చేస్తున్నప్పుడు, కార్డ్ వివరాలను నమోదు చేసి, టోకెనైజేషన్‌ని సెలక్ట్‌ చేయాలి. మర్చంట్‌ దానిని సంబంధిత బ్యాంక్ లేదా కార్డ్ నెట్‌వర్క్‌కు (వీసా, రూపే, మాస్టర్ కార్డ్, మొదలైనవి) ఫార్వర్డ్ చేస్తారు. టోకెన్ జనరేట్ అవుతుంది. దానిని సేవ్ చేసే మర్చంట్‌కి తిరిగి చేరుతుంది. ఇప్పుడు, వినియోగదారుడు మరోసారి షాపింగ్ చేయడానికి తిరిగి వచ్చినప్పుడు, చెక్-అవుట్ సమయంలో ఈ సేవ్ చేసిన టోకెన్‌ని సెలక్ట్‌ చేసుకోవాలి. అదే మాస్క్‌డ్ కార్డ్ వివరాలను, కార్డ్ నంబర్‌లోని చివరి నాలుగు అంకెలను చూపిస్తుంది. CVVని నమోదు చేసి, ట్రాన్సాక్షన్‌ పూర్తి చేయవచ్చు. ఆ వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా ఉపయోగిస్తుంటే మాత్రమే కార్డ్‌ల టోకెనైజేషన్‌ని ఎంచుకోవాలి. టోకెనైజేషన్ తప్పనిసరి కాదు.

అమలు, కీలక సవాళ్లు
వీసా, రూపే, మాస్టర్‌కార్డ్‌తో సహా అన్ని కార్డ్ నెట్‌వర్క్‌లు టోకెనైజేషన్‌ను అందిస్తున్నాయని, ఇప్పటివరకు 16 కోట్ల టోకెన్‌లను సృష్టించినట్లు ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ శంకర్ తెలిపారు. స్విగ్గీ, క్రెడ్‌, ఉబర్‌, మేక్‌మైట్రిప్‌ మొదలైనవాటితో సహా కొంతమంది వ్యాపారులు కస్టమర్‌లు తమ కార్డ్‌లను టోకెనైజ్ చేసుకోవడానికి అనుమతిస్తున్నారు. అనేక ప్రముఖ ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లు టోకెనైజేషన్ ప్రక్రియను సమగ్రపరిచే చివరి దశలో ఉన్నాయి. టోకెనైజేషన్ అమలుతో, EMIలు ద్వారా చేసిన కొనుగోళ్లను ప్రాసెస్ చేయడం, కార్డ్ డేటా లేనప్పుడు కస్టమర్‌లకు క్యాష్‌బ్యాక్‌లు, రివార్డ్‌లను ప్రాసెస్ చేయడంలో సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉందని ఓ ఇ-కామర్స్ వెబ్‌సైట్ ప్రతినిధి చెప్పారు.



ఒక మర్చంట్‌పై ఉన్న టోకెన్‌ను మరొక మర్చంట్‌కి ఉపయోగించవచ్చా?
లేదు. ఒక మర్చంట్‌ నమోదు చేసిన టోకెన్‌ను మరొక మర్చంట్‌ ఉపయోగించలేరు. ప్రతి మర్చంట్‌ సేవ్ చేసిన ప్రతి కార్డ్‌తో అనుసంధానమయ్యే ప్రత్యేక టోకెన్‌ ఉంటుంది. ఉదాహరణకు.. ఫ్లిప్‌కార్ట్‌లో టోకెనైజ్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ ఉంటే, అదే కార్డ్‌కు అమెజాన్‌లో వేరే టోకెన్ క్రియేట్‌ అయి ఉంటుంది.

టోకెన్‌లను ఎలా నిర్వహించాలి?
మర్చంట్‌ వెబ్‌సైట్‌లో సేవ్ చేసిన టోకెన్‌ను తీసివేయాలనుకుంటే, మర్చంట్‌ వెబ్‌సైట్ లేదా యాప్‌లో ఆ టోకెన్‌ను తొలగించవచ్చు. చెల్లింపు ప్రాధాన్యతల నుంచి టోకెన్‌తో అనుసంధానమైన కార్డ్‌ని తొలగించవచ్చు.

టోకెనైజేషన్ సేవ ఉచితమా?
అవును, కార్డ్‌ల టోకెనైజేషన్ పూర్తిగా ఉచితం. ప్రస్తుతం, దేశీయ కార్డులకు మాత్రమే టోకెనైజేషన్ వర్తిస్తుంది. ఈ మార్గదర్శకం అంతర్జాతీయ కార్డ్‌లను కవర్ చేయదు. లావాదేవీని నిర్వహించడానికి ఎన్ని కార్డ్‌లనైనా టోకెనైజేషన్ కోసం రిక్వెస్ట్‌ చేయవచ్చు.

ఒకసారి టోకెన్‌ క్రియేట్‌ అయిన తర్వాత కార్డ్‌ను రీప్లేస్‌, అప్‌గ్రేడ్‌, లేదా కొత్తది పొందితే టోకెన్‌కు ఏం జరుగుతుంది?
మర్చంట్‌ వెబ్‌ పేజీని మళ్లీ సందర్శించి, కొత్త టోకెన్‌ని సృష్టించాలి. ఎందుకంటే కొత్త కార్డ్ (క్రెడిట్ లేదా డెబిట్) కొత్త నంబర్, CVVతో వస్తుంది.
Published by:Mahesh
First published:

Tags: Credit card, Debit card, Online payments, Rbi

తదుపరి వార్తలు