మీరు సొంతింటి కోసం రుణం తీసుకుంటున్నారా? అయితే.. మీకో షాకింగ్ న్యూస్. హౌసింగ్ డెవలప్‌మెంట్ అండ్ ఫైనాన్స్ కార్పొరేషన్ (HDFC) తాజాగా షాకింగ్ నిర్ణయం తీసుకుంది. తాజాగా ఐదు బేసిక్ పాయింట్లు రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్ (RPLR) పెంచుతున్నట్లు వెల్లడించింది. ఆదివారం ఈ మేరకు ప్రకటన చేసింది HDFC. తక్షణం ఈ వడ్డీరేట్ల పెంపు అమల్లోకి వస్తుందని HDFC తెలిపింది. ఈ మేరకు హెచ్డీఎఫ్‌సీ హోమ్ లోన్లపై వడ్డీరేట్లు ఆర్పీఎల్ఆర్‌కు అనుగుణంగా సర్దుబాటు చేయనున్నారు. రూ.30 లక్షల్లోపు రుణాలపై 6.80 శాతం, రూ.30-75 లక్షల్లోపు రుణాలపై 7.05 శాతం, రూ.75 లక్షలకు పైగా రుణాలపై 7.15 శాతం వడ్డీరేటు విధించనుంది HDFC. అన్ని సెగ్మెంట్లలో మహిళా కస్టమర్లకు ఐదు బేసిక్ పాయింట్లు వడ్డీరేటు రాయితీ ఉంటుంది. ఎస్బీఐ(SBI) గత నెల 15 నుంచి 10 పాయింట్ల ఎంసీఎల్ఆర్, యాక్సిస్ బ్యాంక్ ఐదు బేసిక్ పాయింట్లు, కొటక్ మహీంద్రా బ్యాంక్ ఐదు నుంచి 7.4, బ్యాంక్ ఆఫ్ బరోడా ఐదు బేసిక్ పాయింట్లు ఎంసీఎల్ఆర్ పెంచేశాయి.
అయినప్పటికీ సిబిల్ (క్రెడిట్) స్కోర్ 750 పాయింట్లపై చిలుకు ఉన్న కస్టమర్లకు 6.70 శాతం వడ్డీరేటుపై HDFC ఇంటి రుణాలు మంజూరు చేస్తుంది. ఇప్పటికే దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(SBI), బ్యాంకు ఆఫ్ బరోడా(BOB) వంటి బ్యాంకులు లెండింగ్ రేట్లను పెంచేశాయి. ఇతర లెండార్ల రేట్ల పెంపుకు అనుగుణంగా హెచ్‌డీఎఫ్‌సీ కూడా తన లెండింగ్ రేట్లను పెంచేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank loans, HDFC bank