హోమ్ /వార్తలు /బిజినెస్ /

Exclusive: నిర్మలా సీతారామన్‌ స్పెషల్‌ ఇంటర్వ్యూ.. క్యాపెక్స్, ప్రైవేటీకరణపై ఆమె స్పందన తెలుసుకోండి

Exclusive: నిర్మలా సీతారామన్‌ స్పెషల్‌ ఇంటర్వ్యూ.. క్యాపెక్స్, ప్రైవేటీకరణపై ఆమె స్పందన తెలుసుకోండి

Exclusive: నిర్మలా సీతారామన్‌ స్పెషల్‌ ఇంటర్వ్యూ.. క్యాపెక్స్, ప్రైవేటీకరణపై ఆమె స్పందన తెలుసుకోండి

Exclusive: నిర్మలా సీతారామన్‌ స్పెషల్‌ ఇంటర్వ్యూ.. క్యాపెక్స్, ప్రైవేటీకరణపై ఆమె స్పందన తెలుసుకోండి

Exclusive: నెట్‌వర్క్ 18 గ్రూప్ ఎడిటర్ రాహుల్ జోషికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడారు. ఆమె తెలిపిన వివరాలు ఆమె మాటల్లోనే చూద్దాం.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఫిబ్రవరి 1న కేంద్రం బడ్జెట్‌ (Budget)ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆర్థిక వృద్ధికి తోడ్పడేదిగా బడ్జెట్ 2023 ప్రశంసలు అందుకుంటోంది. మోదీ ప్రభుత్వం సెకండ్‌ టర్మ్‌లో వచ్చిన ఈ పూర్తి స్థాయి బడ్జెట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆసక్తిగా చూస్తున్న అనేక మంది వాటాదారుల అంచనాలను అందుకోవడం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman)కు చాలా కష్టమైన పని. రూ.10 లక్షల కోట్ల మెగా క్యాపెక్స్ ప్రోగ్రామ్‌ ప్రకటనతో దాదాపు అన్ని ప్రధాన అంచనాలను తీర్చినట్లు భావించాలి. కొత్త ఆదాయ పన్ను విధానంలో ఉపశమనం అందించడం ద్వారా వినియోగాన్ని పెంచారు. ఈ బడ్జెట్‌ ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంపై కేంద్రం సీరియస్‌గా ఉందనే సంకేతాలు ఇచ్చింది. నిర్దిష్ట వ్యయాలను తగ్గించడం, ఈ స్పేస్‌ను క్యాపెక్స్‌పై కేటాయింపులను పెంచడానికి ఉపయోగించడం స్సెండింగ్‌ క్వాలిటీని మెరుగుపరచాలనే ఉద్దేశ్యాన్ని చూపుతుంది.

నెట్‌వర్క్ 18 గ్రూప్ ఎడిటర్ రాహుల్ జోషికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడారు. ఆమె తెలిపిన వివరాలు ఆమె మాటల్లోనే చూద్దాం.

* ఆర్థిక వృద్ధి

ప్రపంచం మొత్తం ఆర్థిక అనిశ్చితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో కూడా బడ్జెట్‌లో పేర్కొన్న వృద్ధి సంఖ్యలు వాస్తవం. ఈ స్థాయిలో ప్రపంచ అస్థిరతలు ఎదుర్కొని, ప్రభావితం కాకుండా నిలిచిన మరో దేశం ఉందని నేను అనుకోను.

* LIC, SBI, అదానీ కంపెనీల గురించి

లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేసన్‌ ఆఫ్‌ ఇండియా(LIC), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వంటి పెద్ద రుణదాతలను సంక్షోభంలో ఉన్న అదానీ గ్రూప్‌ బహిర్గతం చేయడం అనుమతించదగిన పరిమితుల్లోనే ఉంది.

* ప్రపంచ పెట్టుబడిదారులకు సందేశం

భారతదేశం సుపరిపాలన, వెరీ వెల్‌ రెగ్యులేటెడ్‌ ఫైనాన్షియల్‌ మార్కెట్‌గా కొనసాగుతుంది. ఇన్వెస్టర్ల విశ్వాసం కొనసాగుతుంది. ఇది మాత్రమే భారతీయ ఆర్థిక మార్కెట్‌లు ఎంత చక్కగా ఉన్నాయనే అంశానికి సూచిక కాదు.

* ప్రైవేటీకరణ

పెట్టుబడుల ఉపసంహరణ, ఆస్తుల మానిటైజేషన్ ఇప్పటికీ బడ్జెట్‌లో భాగమే. ఇది ప్రసంగంలో భాగం కాకపోవచ్చు. ఆస్తులను మానిటైజ్ చేయడానికి ఉత్తమ సమయం ఎప్పుడు ఉంటుందో చూడాలి. PSU బ్యాంకుల ప్రైవేటీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. సవరణలు చేయాల్సి ఉంటుంది.

ఇది కూడా చదవండి : ఏడాదికి రూ.10 లక్షలు సంపాదిస్తున్నారా? అయితే పాత పన్ను విధానమే బెస్ట్‌, ఎందుకంటే?

* ద్రవ్యోల్బణం

ఆర్‌బీఐ , ప్రభుత్వం సంయుక్త కృషితో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టింది. ద్రవ్యోల్బణం నియంత్రణ కొనసాగుతుందని భావిస్తున్నాం. రేట్ల పెంపుపై ఎలాంటి ఒత్తిడి ఉండకూడదు. ట్విన్‌ డెఫిసిట్స్‌ ప్రాబ్లం మునుపటిలా తీవ్రంగా లేదు.

* ఆదాయ పన్ను మార్పులు

సమ్మతి, పన్ను రేట్ల పరంగా మరింత ఆకర్షణీయంగా ఉండటమే ఉద్దేశ్యం. ప్రతి ఒక్కరూ తాము ఎంత మొత్తంలో పన్నులు చెల్లిస్తున్నారో తెలుసుకోవాలి. వారి ఇంటి నుంచి పన్ను రిటర్న్‌లను దాఖలు చేయాలి.

* బ్యాంకింగ్ వ్యవస్థ

మొండి బకాయిల పరిస్థితి మెరుగైంది. బ్యాంకింగ్ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంది. ట్విన్ బ్యాలెన్స్ షీట్ సమస్య ద్వారా వెళ్ళాను. భారతీయ బ్యాంకింగ్ రంగం అనుకూలమైన స్థాయిలో ఉంది, ఎన్‌పిఎలు పూర్తిగా కనిష్ట స్థాయికి దిగివస్తున్నాయి, రికవరీ జరుగుతోంది.

* MGNREGA

ప్రధానమంత్రి ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్ వంటి పథకాలపై అధిక దృష్టి సారించడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగాలు లభిస్తాయి. MGNREA అనేది డిమాండ్ ఆధారిత పథకం. రాష్ట్రాల నుంచి ఎక్కువ డిమాండ్ వచ్చినప్పుడు, మేము అనుబంధ డిమాండ్ల కోసం పార్లమెంటుకు వెళ్తాం.

* ప్రైవేట్ కాపెక్స్(Private capex)

ఎనర్జీ రిలేటెడ్‌ మ్యాటర్స్‌ పరివర్తన కోసం కొత్త, పాత ఇండియా ఇంక్ ఎదురుచూస్తున్నాయి. ఇప్పుడు స్థిరత్వాన్ని ప్రోత్సహించే కొత్త టెక్నాలజీలో పెట్టుబడి పెట్టడానికి నిర్ణయాలు తీసుకుంటున్నాం.

* పునరుత్పాదక ఇంధనం

వినియోగదారుడు నుంచి పునరుత్పాదక ఇంధనం ఉత్పత్తిదారుడు వరకు ప్రతి దశలో ప్రయోజనాలు అందుకుంటారు. అన్ని వర్గాలకు ప్రయోజనాలు అందించే ప్రయత్నాలు చేసింది.

First published:

Tags: Banks Privatization, Budget 2023, Nirmala sitharaman