హోమ్ /వార్తలు /బిజినెస్ /

Excitel Broadband: చౌక ధరకే బ్రాడ్​బ్యాండ్​ ప్లాన్​ అందిస్తున్న ఎక్సైటెల్.. కేవలం రూ.399లకే 100 ఎంబిపిఎస్..

Excitel Broadband: చౌక ధరకే బ్రాడ్​బ్యాండ్​ ప్లాన్​ అందిస్తున్న ఎక్సైటెల్.. కేవలం రూ.399లకే 100 ఎంబిపిఎస్..

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ప్రైవేటు బ్రాడ్​బ్యాండ్​ కంపెనీ ఎక్సైటెల్​ తన వినియోగదారులకు శుభవార్త అందించింది. నెలకు కేవలం రూ.399లకే 100 ఎంబీపీఎస్​ హైస్పీడ్​ డేటాను అందిచే ప్లాన్​ను ప్రవేశపెట్టింది.

  బ్రాడ్​బ్యాండ్​ నెట్​వర్క్​ సెక్టార్​లో పెరుగుతున్న పోటీ కారణంగా పలు కంపెనీలు తక్కువ ధరకే హైస్పీడ్​ డేటా​ ప్లాన్​లను ఆఫర్​ చేస్తున్నాయి. తాజాగా ప్రైవేటు బ్రాడ్​బ్యాండ్​ కంపెనీ ఎక్సైటెల్​ తన వినియోగదారులకు శుభవార్త అందించింది. నెలకు కేవలం రూ.399లకే 100 ఎంబీపీఎస్​ హైస్పీడ్​ డేటాను అందిచే ప్లాన్​ను ప్రవేశపెట్టింది. బీఎస్​ఎన్​ఎల్, ఎయిర్​టెల్​ వంటి సంస్థలు అచ్చం ఇవే ప్రయోజనాలను రూ.499లకు అందిస్తుండగా, ఎక్సైటెల్ మాత్రం రూ.399లకే అందిస్తుండటం విశేషం. ప్రస్తుతం ఎక్సైటెల్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ (ISP)​ తమ సర్వీసులను ఢిల్లీ ఎన్‌సిఆర్, హైదరాబాద్, బెంగళూరు, జైపూర్ వంటి ప్రధాన నగరాల్లోనే అందిస్తుంది. ఈ సేవలను దేశమంతటా వేగంగా విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. బ్రాడ్​బ్యాండ్​ కస్టమర్లను పెంచుకోవాలనే లక్ష్యంతో తక్కువ ధరకే హైస్పీడ్​ డేటాను ఆఫర్​ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం, కేవలం రూ.400లోపు ప్రవేశపెట్టిన ఈ ప్లాన్​ ప్రయోజనాలను పరిశీలిద్దాం.

  ప్లాన్ ధర, వ్యాలిడిటీ వివరాలు..

  ఎక్సైటెల్100 Mbps స్పీడ్​ డేటా ప్లాన్​ను ఏడాది కాలానికి సబ్​స్క్రైబ్​ చేసుకోవాలంటే.. ఒకేసారి రూ.4,788 + 18% జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. అంటే వినియోగదారుడికి ప్రతినెలా రూ.399 ఖర్చు అవుతుంది. ఈ ప్లాన్ ఎటువంటి పరిమితులు లేకుండా అపరిమిత డేటాను అందిస్తుంది. ఇక, ఎక్సైటెల్ 100 ఎంబీపీఎస్​ ప్లాన్‌ వేర్వేరు వ్యాలిడిటీ పీరియడ్‌లలో కూడా అందుబాటులో ఉంది. 9 నెలలు వ్యాలిడిటీని ఎంచుకునే కొత్త కస్టమర్లు ఇదే ప్లాన్​ కోసం రూ .424 ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంటే, కొత్త కస్టమర్లు 12 నెలల మొత్తానికి రూ .5,088 + జీఎస్​టీ చెల్లించాల్సి ఉంటుంది. ఇదే ప్లాన్ మూడు, నాలుగు, ఆరు నెలల వేర్వేరు వ్యాలిడిటీల్లో కూడా లభిస్తుందని ఎక్సైటెల్​ పేర్కొంది. 3 నెలల వ్యాలిడిటీని ఎంచుకన్న వారు ప్రతి నెలా రూ .555 ఖర్చు చేయాల్సి ఉంటుంది. లేదంటే ఒకే సారి రూ .1,695 + జిఎస్‌టిని చెల్లించినా సరిపోతుంది. అదే, 4 నెలలు వ్యాలిడిటీ కోసం ప్రతి నెలా రూ .508 ఖర్చు చేయాలి. లేదంటే ఒకేసారి రూ .2,032+జీఎస్​టీ చెల్లించినా సరిపోతుంది. 6 నెలల వ్యాలిడిటీ కోసం ప్రతినెలా రూ .490 ఖర్చు అవుతుంది, అంటే ఒక్కసారి రూ. 2,940+జీఎస్​టీ చెల్లించినా సరిపోతుంది. కేవలం ఒక నెల మాత్రమే ఎంచుకుంటే రూ .699+జీఎస్​టీ చెల్లించాల్సి ఉంటుంది.

  సెక్యూరిటీ డిపాజిట్‌ కింద బ్రాడ్​బ్యాండ్​ కనెక్షన్​ తీసుకునే వినియోగదారుల నుండి ONU డివైజెస్​ కోసం రూ .2,000 వసూలు చేయబడుతుంది. కాని, కంపెనీ దీనికి ఎటువంటి ఇన్‌స్టాలేషన్ ఛార్జీలను వసూలు చేయదు. ఫైబర్ కనెక్షన్‌ తీసుకునే వినియోగదారులు డ్యూయల్-బ్యాండ్ వై-ఫై రౌటర్‌ను కూడా కొనుగోలు చేయడం మంచిదని, తద్వారా ఎక్కువ పరికరాల్లో ఒకేసారి ఇంటర్నెట్ వినియోగించుకోవచ్చని ఎక్సైటెల్​ తమ వినియోగదారులను కోరింది.

  First published:

  Tags: Business

  ఉత్తమ కథలు