Home /News /business /

EXCITED ABOUT JOB OFFER YOU GOT FROM A START UP DO THESE BACKGROUND CHECK BEFORE JOINING UMG GH

Start-up: స్టార్టప్ కంపెనీలో జాబ్ ఆఫర్ వచ్చిందా..? అయితే ముందు ఈ విషయాలు చెక్ చేసుకోండి..!

స్టార్టప్ కంపెనీలో జాబ్ ఆఫర్ వచ్చిందా..?

స్టార్టప్ కంపెనీలో జాబ్ ఆఫర్ వచ్చిందా..?

మీకు స్టార్టప్ (Start up) కంపెనీలో జాబ్ ఆఫర్ (Job Offer) వస్తే... జాయిన్ కాకముందు కొన్ని విషయాల గురించి తెలుసుకోవడం మంచిది. ముఖ్యంగా ఫండింగ్, కంపెనీ వివరాలు, ఫౌండర్, కంపెనీ మిషన్ అండ్ విజన్, జాబ్ ప్రొఫైల్ వంటి ప్రధాన అంశాలను క్రాస్ -చెక్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
స్టార్టప్ కంపెనీలకు ప్రధాన సమస్య నిధుల కొరత. దీంతో అవి స్థిరంగా కొనసాగలేవు. కరోనా సమయంలో చాలా కంపెనీలు ఉద్యోగులను పెద్ద ఎత్తున తొలగించాయి. నిధులను కూడా స్తంభింపజేసిన సందర్భాలు ఉన్నాయి. ఒకవేళ మీకు స్టార్టప్ కంపెనీలో జాబ్ ఆఫర్ వస్తే... జాయిన్ కాకముందు కొన్ని విషయాల గురించి తెలుసుకోవడం మంచిది. ముఖ్యంగా ఫండింగ్, కంపెనీ వివరాలు, ఫౌండర్, కంపెనీ మిషన్ అండ్ విజన్, జాబ్ ప్రొఫైల్ వంటి ప్రధాన అంశాలను క్రాస్ -చెక్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ విషయంలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ చెకింగ్ అవసరమో తెలియజేశారు.

* స్టార్టప్ ఫండింగ్ స్టేటస్
స్టార్టప్ కంపెనీల ఫండ్స్ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఫండ్స్ సమృద్ధిగా ఉంటేనే సమయానికి జీతం వస్తుంది. బిజినెస్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. స్టార్టప్స్ ఎక్కువ ఫండ్స్‌ను ఖర్చు చేస్తాయి. ఇతర సంస్థలతో పోటీ కారణంగా పరిశోధనల్లో అగ్రస్థానానికి చేరుకోవాలనే ఒత్తిడి ఈ కంపెనీలపై ఉంటుంది. దీంతో ఈ పరిస్థితి నిధుల కొరతకు దారితీయవచ్చు.

స్టార్టప్‌కు దరఖాస్తు చేసుకునే ఫ్రెషర్లు తప్పనిసరిగా ఈ వాస్తవ అంశాలను మరింత లోతుగా పరిశీలించాలి. వారు సకాలంలో జీతం పొందితేనే ఎడ్యుకేషన్ లోన్స్‌ను తిరిగి చెల్లించడానికి అవకాశం ఉంటుంది. వ్యాపారం మందగించినప్పుడు లేదా పెట్టుబడిదారుల దృక్పథంలో మార్పు వచ్చినప్పుడు స్టార్టప్ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించడం ప్రారంభిస్తాయి. దీంతో ఈ సమయంలో గ్రాడ్యుయేట్స్ తీవ్రంగా నష్టపోతున్నారు.

ఇదీ చదవండి: BGMIపై సంచలన నిర్ణయం.. మొబైల్ గేమ్ నిషేధంపై కంపెనీ రియాక్షన్ ఇదే..!


* జాబ్ ప్రొఫైల్
స్టార్టప్ జాబ్ ప్రొఫైల్‌కు తగ్గట్టు తమ స్కిల్ సెట్స్ సరిపోలుతున్నాయా లేదో అభ్యర్థులు చెక్ చేసుకోవాలి. మీకున్న స్కిల్స్, కంపెనీ విలువతో సరిపోతాయా? కొత్త విషయాలను ప్రయత్నించే సామర్థ్యాన్ని స్టార్టప్ మీకు అందిస్తుందా? ఇలాంటి అంశాలను పరిశీలించి ఉద్యోగంలో చేరడానికి ముందు స్కిల్స్, సామర్థ్యాలను విస్తరించుకోవాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

కొత్త ఉద్యోగావకాశాల పట్ల ఉత్సాహంగా ఉన్నప్పుడు, దానితో వచ్చే ప్రమాదాన్ని తక్కువగా అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది నిపుణుల అభిప్రాయపడుతున్నారు. కాబట్టి, కొన్నిసార్లు అభిరుచి, ఉత్సాహాన్ని తగ్గించుకుని హేతుబద్ధంగా ఉండటం చాలా అవసరం. ప్రధానంగా స్టార్టప్ వినియోగించే సమయం, డబ్బు, రెప్యుటేషనల్ క్యాపిటల్‌ను తప్పక చెక్ చేయాలని స్టడీ24x7 సీఈఓ లోకేష్ అరోరా సూచించారు.* ఫౌండర్ నేపథ్యం
స్టార్టప్ వ్యవస్థాపకుడి అకడమిక్ బ్యాక్ గ్రౌండ్, ​​గత జాబ్ రోల్స్, ట్రాక్ రికార్డ్ వంటి అంశాలను తెలుసుకుంటే ప్రయోజనకరంగా ఉంటుందని ఓడ్జర్స్ బెర్న్‌డ్‌సన్ ఇండియా అధికారి కునాల్ సేన్ అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో కంపెనీ ఏ స్థాయికి వెళుతుందో అంచనా వేయడానికి ఈ అంశాలు సహాయపడతాయన్నారు.

* మిషన్ అండ్ విజన్
స్టార్టప్ ప్రారంభంలో సక్సెస్ అయినప్పటికీ, భవిష్యత్‌లో కూడా అలా కొనసాగకపోవచ్చు. కాబట్టి మీరు పని చేయాలనుకుంటున్న సంస్థ మనుగడకు అత్యుత్తమ అవకాశాలను చూసుకోవడానికి కంపెనీ ఉద్దేశాలపై సొంతంగా పరిశోధించడం తప్పనిసరి. స్టార్టప్ విజన్, మిషన్, కల్చర్ అనేది వారి ఆలోచనా విధానంతో సరిపోతుందా అనే దానిపై అభ్యర్థికి స్పష్టమైన అవగాహన ఉండాలి. ఒక ఉద్యోగి లేదా యజమాని వారి ఉద్యోగంలో మంచిగా ఉండవచ్చు, కానీ మిషన్ బ్యాలెన్స్ చేయకపోతే పనితీరు ప్రభావితం కావచ్చు.
Published by:Mahesh
First published:

Tags: Business, Business plan, Company, Start-Up

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు