కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం, ఆ తర్వాత రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచ దేశాల ఆర్థిక పరిస్థితి ఏమీ అంతగా బాగాలేదు. ఎక్కడ చూసినా ధరల పెరుగుదల మాటే వినిపిస్తోంది. భారతదేశంలో అగ్గి పెట్టె నుంచి కాస్ట్‌లీ కార్ వరకు అన్నింటి ధరలు పెరుగుతున్నాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్, వంట నూనెలు, మెడిసిన్... ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా పెద్దగా ఉంది. ఇలా అన్నింటి ధరలు పెరుగుతుండటంతో (Price Hike) సామాన్యులకు ఇంటి బడ్జెట్ పెరుగుతోంది. ప్రతీ నెలా అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఆదాయం అంతే ఉన్నా ఖర్చులు పెరిగిపోతుండటం భారం అవుతోంది. అయితే ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఉపశమనం కలిగిస్తున్నాయి. ధరల్ని కాస్త కిందకు తీసుకొస్తున్నాయి. ఆ నిర్ణయాలేంటో తెలుసుకోండి.
Petrol Diesel Prices: పెట్రోల్, డీజిల్ ధరలు ఇటీవల వరుసగా పెరిగాయి. దీంతో అన్ని రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ రేట్స్ సెంచరీ దాటేశాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం మరోసారి ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. ఈ నిర్ణయంతో అన్ని రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు దిగొచ్చాయి.
PhonePe: ఫోన్‌పేలో 24 క్యారట్ బంగారం రూ.100 కే కొనొచ్చు... ఇలా పొదుపు చేయాలి
Gas Cylinder Subsidy: కేంద్ర ప్రభుత్వం ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధరల్ని తగ్గించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) పథకంలో ఉన్నవారికి సిలిండర్‌పై రూ.200 సబ్సిడీ ప్రకటించింది. ఏడాదిలో 12 సిలిండర్లకు సబ్సిడీ పొందొచ్చు. అంటే పీఎం ఉజ్వల స్కీమ్ లబ్ధిదారులు ఏటా రూ.2,400 వరకు సబ్సిడీ పొందొచ్చు.
Cooking Oil Prices: రష్యా, ఉక్రెయిన్ యుద్ధం, పామాయిల్ ఎగుమతులపై ఇండోనేషియా నిషేధంతో భారతదేశంలో వంట నూనెల ధరలు భారీగా పెరుగుతున్నాయి. వంట నూనెల ధరల్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఎలాంటి సుంకాలు లేకుండా ఏటా 20 లక్షల టన్నుల క్రూడ్ సోయాబీన్, సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతి చేసేందుకు కేంద్రం అనుమతిచ్చింది. దీంతో దేశంలో వంట నూనెల ధరలు కాస్త తగ్గుతాయి.
Tirupati Tour: హైదరాబాద్ టు తిరుపతి టూర్... తెలంగాణ టూరిజం ప్యాకేజీ రూ.4,000 లోపే
Cement Prices: పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం తగ్గించడం సిమెంట్ కంపెనీలకు వరంలా మారింది. సిమెంట్ కంపెనీలకు రవాణా ఖర్చులు తగ్గుతాయి కాబట్టి కంపెనీలు కూడా సిమెంట్ ధరల్ని తగ్గించే దిశగా అడుగులు వేస్తున్నాయి.
Fertilizer Subsidy: కేంద్ర ప్రభుత్వం రైతులకు వరం అందించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎరువులపై అదనంగా రూ.1.10 లక్షల కోట్ల సబ్సిడీ ప్రకటించింది. దీంతో పెరుగుతున్న ఎరువుల ధరలు దిగొచ్చాయి. ప్రభుత్వం తాజాగా ప్రకటించిన సబ్సిడీతో 2022-23 ఆర్థిక సంవత్సరంలో సబ్సిడీ రూ.2.15 లక్షల కోట్లకు చేరడం విశేషం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cooking oil, Diesel price, Lpg Cylinder Price, Petrol Price, Pm modi, Price Hike