• Home
  • »
  • News
  • »
  • business
  • »
  • EXCHANGE DAMAGED OR SOILED CURRENCY NOTES FOR FREE AT STATE BANK OF INDIA SBI BRANCH KNOW HOW SS

SBI: కరెన్సీ నోట్లు పాడయ్యాయా? ఎస్‌బీఐలో ఫ్రీగా మార్చుకోండి ఇలా

SBI: కరెన్సీ నోట్లు పాడయ్యాయా? ఎస్‌బీఐలో ఫ్రీగా మార్చుకోండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

కరెన్సీ నోట్లు పాడైపోతే ఏం చేయాలో అర్థం కావట్లేదా? మీ దగ్గర పాత నోట్లు ఉన్నాయా? వాటిని బ్యాంకులో మార్చుకోవచ్చు. ఎలాగో తెలుసుకోండి.

  • Share this:
    మీ దగ్గర ఉన్న కరెన్సీ నోట్లు పాడయ్యాయా? పాత నోట్లు ఎక్కడా తీసుకోవట్లేదా? అయితే మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI బ్రాంచ్‌లో ఉచితంగా మార్చుకోవచ్చు. రూ.5000 లోపు విలువ ఉన్న 20 నోట్లను ఉచితంగానే ఎక్స్‌ఛేంజ్ చేయొచ్చు. ఒకవేళ అంతకన్నా ఎక్కువ నోట్లను మార్చాలనుకుంటే సర్వీస్ ఛార్జీ చెల్లించాలి. గతేడాది అక్టోబర్‌లోనే ఈ సర్వీస్ ఛార్జీలను సవరించింది ఎస్‌బీఐ. బ్యాంకు వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం 20 కరెన్సీ నోట్ల కన్నా ఎక్కువ మార్చాలనుకుంటే ప్రతీ నోటుకు రూ.2+జీఎస్‌టీ చెల్లించాలి. అంటే రూ.5,000 కన్నా ఎక్కువ విలువైన నోట్లు మారిస్తే ప్రతీ నోటుకు ఈ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI నోట్ రీఫండ్ రూల్స్‌నే ఎస్‌బీఐ పాటిస్తుంది. పాడైన, ముక్కలైన నోట్లను మాత్రమే బ్యాంకు ఎక్స్‌ఛేంజ్ చేస్తుంది.

    ఎక్కువగా ఉపయోగించడం వల్ల పాడైన నోట్లనే ఎక్స్‌ఛేంజ్ చేస్తుంది బ్యాంకు. ఒకవేళ నోటు రెండు ముక్కలైతే, ఆ నోటులోని అన్ని భాగాలను సరిగ్గా అతికించినా బ్యాంకు ఎక్స్‌ఛేంజ్ చేస్తుంది. అయితే మోసం చేసేందుకే నోట్లు పాడుచేసినట్టు అనుమానం వస్తే బ్యాంకు ఆ నోట్లను మార్చుకోదు. అంతేకాదు... కరెన్సీ నోటుపైన ఏదైనా రాజకీయ పార్టీకి చెందిన నినాదాలు రాస్తే ఆ నోట్లు చెల్లవు. అలాంటి నోట్లను ఎక్స్‌ఛేంజ్ లేదా రీఫండ్ సమయంలో తిరస్కరించే హక్కు బ్యాంకులకు ఉంటుంది. నోట్లను కావాలనే ముక్కలు చేయడం, చించేయడం, ఉద్దేశపూర్వకంగా పాడుచేయడం లాంటివి బ్యాంకు గుర్తిస్తే ఆ నోట్లను తీసుకోవు. అందుకే మీరు బ్యాంకులో పాడైపోయిన నోట్లు మార్చడానికి వెళ్లినప్పుడు ఇవన్నీ పరిశీలించండి.

    ఇవి కూడా చదవండి:

    Petrol Price: వాహనదారులకు బిగ్ షాక్... ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు

    IRCTC: రైలులో ఫుడ్ ఫ్రీ... కానీ ఓ కండీషన్

    March Bank Holidays: మార్చిలో బ్యాంకులకు 12 రోజులు సెలవులు... ప్లాన్ చేసుకోండి ఇలా
    Published by:Santhosh Kumar S
    First published: