World bank president : ప్రపంచంలోనే మేటి సంస్థలకు పలువురు భారతీయులు సారథ్యం వహిస్తున్నారు. తాజాగా, మరో భారతీయుడు ప్రతిష్టాత్మక పదవిని దక్కించుకోనున్నాడు. వరల్డ్ బ్యాంకు(World bank) అధ్యక్ష పదవికి భారత సంతతికి చెందిన వ్యక్తి అజయ్ బంగా (63) సెలక్ట్ అయ్యారు. భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త అజయ్ బంగాను ప్రపంచ బ్యాంకు అధ్యక్ష పదవికి నామినేట్ చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe biden) గురువారం ప్రకటించారు. బంగా నామినేషన్‌కు ప్రపంచ బ్యాంకు డైరెక్టర్ల బోర్డు ఆమోదముద్ర తెలపడమే. ప్రస్తుత వరల్డ్ బ్యాంకు అధ్యక్షుడు డేవిస్ మాల్పాస్ ఈ ఏడాది జూన్‌లోనే పదవి నుంచి దిగేందుకు యోచిస్తున్నట్లు ప్రకటించడంతో బైడెన్.. అజయ్ బంగా(Ajay banga) పేరును ప్రతిపాదించారు. వాస్తవానికి 2024 చివరకు డేవిడ్ మాల్పస్ ఆయన పదవీకాలం ఉండగా.. దాదాపు రెండేళ్ల ముందు తప్పుకుంటున్నారు. దీంతో కొత్త అధ్యక్షుడి ఎంపిక అనివార్యమయ్యింది.
"ఈ క్లిష్టమైన సమయంలో ప్రపంచ బ్యాంకును సమర్థంగా నడిపించడంలో, సమస్యలను ఎదుర్కోవడంలో అజయ్ బంగానే సరైన వ్యక్తి అని, ప్రైవేటు, ప్రభుత్వ వనరులను ఉపయోగించుకోవడంలో అజయ్ కి మంచి అనుభవం ఉందని" బైడెన్ అభిప్రాయపడ్డారు. మూడు దశాబ్దాల పాటు పలు అంతర్జాతీయ సంస్థలను విజయవంతంగా నడిపించిన అనుభవం ఆయన సొంతమన్నారు. అన్నీ అనుకున్నట్టు సాగితే ప్రపంచ బ్యాంకు అధ్యక్ష పదవిని చేపట్టిన తొలి భారతీయ అమెరికన్‌గా సిక్కు అమెరికన్‌గా బంగా చరిత్ర సృష్టిస్తారు.
అధ్యక్ష పదవికి నామినేషన్ ప్రక్రియ మార్చి 29 వరకు కొనసాగుతోంది. అనంతరం బోర్డులోని డైరెక్టర్లు ఎవరివైపు మొగ్గుచూపితే వారే అధ్యక్షుడవుతారు. ప్రపంచ బ్యాంకులో అమెరికా అధిక వాటాలను కలిగి ఉంది. క్లైమెట్ ఛేంజ్, కర్బన ఉద్గారాల తగ్గింపు లాంటి ఎన్నో కీలకాంశాలను ప్రతిష్టాత్మక లక్ష్యాలుగా చేసుకుని వరల్డ్ బ్యాంక్ నిర్ణయాలు తీసుకుంటుంది.
Wedding invitation card : అలాంటోళ్లు మా పెళ్లికి రావద్దు..వైరల్ అవుతున్న వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డు
భారతదేశంలోని పూణెలో జన్మించిన అజయ్ బంగా ఆర్మీ జనరల్ కుమారుడు. 63 ఏళ్ల బంగా.. హైదరాబాద్ లోని బేగంపేట్ లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదువుకున్నారు. ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుంచి ఎకనామిక్స్ లో డిగ్రీ చేశారు. 1981లో నెస్లే కంపెనీ యొక్క కోల్‌కతా బ్రాంచ్ మేనేజర్ గా కెరీర్ ప్రారంభించారు.1996లో అమెరికాకు వలస వెళ్లి పెప్సికోలో చేరారు. పెప్సికో కు చెందిన అంతర్జాతీయ ఫాస్ట్ ఫుడ్ ఫ్రాంచైజీలను భారతదేశంలో ప్రారంభించడంలో కీలక పాత్ర పోషించారు. 2009లో అజయ్ మాస్టర్ కార్డు కంపెనీ సీఈఓగా పనిచేశారు. అంతకుముందు సిటీ గ్రూప్ సంస్థకు చెందిన ఆసియా పసిఫిక్ వ్యవహారాలు చూసేవారు. 2016లో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. ప్రస్తుతం అజయ్ జనరల్ అట్లాంటిక్ అనే ఈక్విటీ సంస్థకు వైస్ చైర్మన్ గా పనిచేస్తున్నారు.
బైడెన్ యంత్రాంగంలోని ఓ సీనియర్ అధికారి మాట్లాడుతూ..మాస్టర్ కార్డు, జనరల్ అట్లాంటిక్ సంస్థలో వాతావరణ మార్పులను ఎదుర్కోవడం, హరిత పరివర్తనను శక్తివంతం చేయడంలో సహకరించేలా ప్రైవేట్ మూలధనాన్ని సమీకరించడానికి అజయ్ ప్రాధాన్యతనిచ్చాడు.. ఇవి ప్రపంచ బ్యాంకులో రాబోయే సంవత్సరాల్లో అతని సామర్ధ్యాన్ని నడిపించే అనుభవాలు, ప్రాధాన్యతలని తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: USA, World Bank