హోమ్ /వార్తలు /బిజినెస్ /

Service Charges: రెస్టారెంట్లు సర్వీస్‌ ఛార్జీ చెల్లించాలని డిమాండ్‌ చేస్తే ఏం చేయాలి..? ఈ హక్కుల గురించి తెలుసుకోండి..

Service Charges: రెస్టారెంట్లు సర్వీస్‌ ఛార్జీ చెల్లించాలని డిమాండ్‌ చేస్తే ఏం చేయాలి..? ఈ హక్కుల గురించి తెలుసుకోండి..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Service Charges: సర్వీస్ ఛార్జీల విషయంలో వినియోగదారుల నుంచి వచ్చిన అనేక ఫిర్యాదుల కారణంగా, సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) 2022 జులై 4న మార్గదర్శకాలను జారీ చేసింది. హోటళ్లు, రెస్టారెంట్లు డిఫాల్ట్‌గా అలాంటి ఛార్జీలు విధించకుండా నిషేధించింది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

2016-2017కి ముందు, రెస్టారెంట్‌ (Restaurant)లలో భోజనం చేసేవారికి 5-20 శాతం మధ్య సర్వీస్ ఛార్జీలు (Service Charges) విధించేవారు. అప్పట్లో ఇది సాధారణ అంశం. ఆ తర్వాత 2016, 2017లో జారీ చేసిన మార్గదర్శకాలలో సర్వీస్‌ ఛార్జీలను ఆప్షనల్‌గా చేశారు. అయినప్పటికీ, అనేక హోటళ్లు (Hotels), రెస్టారెంట్లు కస్టమర్‌లకు సర్వీస్‌ ఛార్జీలు ఆప్షనల్‌ అని తెలియజేయకుండా డిఫాల్ట్‌గా బిల్‌లో యాడ్‌ చేసేవి. వాస్తవానికి కస్టమర్లు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ, అలాంటి ఛార్జీలు చెల్లించాలని చాలా మంది పట్టుబట్టారు. ఎందుకంటే రెస్టారెంట్‌లోకి ప్రవేశించిన తర్వాత ఇలాంటి రూల్స్‌కు కస్టమర్‌ (Customer) అంగీకరించినట్లేనని, ప్రవేశ ద్వారం వద్ద రూల్స్ అంగీకరిస్తేనే లోపలికి రావాలనే నోటీసు ఉంటుందని చెప్పేవారు.


* జులైలో CCPA మార్గదర్శకాలు
ఈ విషయంలో వినియోగదారుల నుంచి వచ్చిన అనేక ఫిర్యాదుల కారణంగా, సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) 2022 జులై 4న మార్గదర్శకాలను జారీ చేసింది. హోటళ్లు, రెస్టారెంట్లు డిఫాల్ట్‌గా అలాంటి ఛార్జీలు విధించకుండా నిషేధించింది. సర్వీస్‌ ఛార్జీ అనేది ఇతర ఖర్చుల మాదిరిగానే , ఆహారం లేదా పానీయాల ధరలో అంతర్లీనంగా ఉండాలని CCPA పేర్కొంది.అందువల్ల ధరలో వస్తువులు, సేవా భాగాలు రెండూ ఉండాలి. ఏదైనా ఎక్కువ వసూలు చేస్తే కన్స్యూమర్‌ ప్రొటెక్షన్‌ యాక్ట్‌(CPA), 2019 ప్రకారం అన్యాయమైన వాణిజ్య పద్ధతిగా పరిగణిస్తారు. ఏదైనా టిప్ లేదా గ్రాట్యుటీ అనేది హోటల్ సిబ్బంది, వినియోగదారుల మధ్య ఒక ప్రత్యేక లావాదేవీ. సర్వీస్‌ ఛార్జీ అనేది కస్టమర్‌ పొందిన ఎక్స్‌పీరియన్స్‌ మేరకు ఇవ్వడంపై ఆధారపడి ఉంటుంది.


* వినియోగదారు హక్కులను కాపాడే CCPA సర్వీస్‌ ఛార్జీ గైడ్‌లైన్స్


- హోటల్ లేదా రెస్టారెంట్ బిల్లుకు డిఫాల్ట్‌గా సర్వీస్ ఛార్జీని యాడ్ చేయకూడదు.


- ఏ ఇతర పేరుతోనూ వినియోగదారుల నుంచి సర్వీస్‌ ఛార్జీలు వసూలు చేయకూడదు.


- వినియోగదారులు సర్వీస్ ఛార్జీలు చెల్లించాలని ఏ హోటల్ లేదా రెస్టారెంట్ కూడా బలవంతం చేయకూడదు. సర్వీసు ఛార్జీ చెల్లించడం అనేది కస్టమర్‌కు ఆప్షనల్‌ అని, నిర్బంధం కాదని తప్పనిసరిగా తెలియజేయాలి.


- సర్వీస్‌ ఛార్జీ వసూలు ఆధారంగా వినియోగదారులు సేవలు పొందడం, ఇతర సదుపాయాలపై ఎటువంటి పరిమితి విధించే అవకాశం లేదు.


- ఫుడ్‌ బిల్‌కు సర్వీస్‌ ఛార్జీని కలిపి, ఆ మొత్తానికి జీఎస్‌టీ విధించకూడదు


* హోటల్ / రెస్టారెంట్ సర్వీస్ ఛార్జీలు విధిస్తున్నట్లు, లేదా మార్గదర్శకాలను ఉల్లంఘిస్తున్నట్లు గుర్తించిన వినియోగదారులు ఏం చేయాలి..?


- బిల్లు మొత్తం నుంచి విధించిన సర్వీస్‌ ఛార్జీని తీసివేయమని వినియోగదారులు సంస్థను కోరాలి.


ఇది కూడా చదవండి : రైతన్నలకు గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ ఈకేవైసీ గడువు పెంపు.. ప్రకియను ఇలా పూర్తిచేయండి..


- వినియోగదారులు 1915 నంబర్‌కు కాల్ చేయవచ్చు లేదా నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్ (NCH) యాప్‌ ద్వారా NCHకి ఫిర్యాదు చేయవచ్చు. NCH ​​అనేది వ్యాజ్యానికి ముందు స్థాయిలో ప్రత్యామ్నాయ వివాద పరిష్కార యంత్రాంగంగా పనిచేస్తుంది.


- పై పద్ధతుల ద్వారా వినియోగదారుల ఫిర్యాదు పరిష్కారం కాకపోతే, వారు వినియోగదారుల కమిషన్‌కు అన్యాయమైన వాణిజ్య పద్ధతులపై ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదును ఇ-దాఖిల్ పోర్టల్ (www.edaakhil.nic.in) ద్వారా ఎలక్ట్రానిక్ పద్ధతిలో దాఖలు చేయవచ్చు.


- చివరగా, వినియోగదారులు సంబంధిత జిల్లా జిల్లా కలెక్టర్‌కి ఫిర్యాదును సమర్పించవచ్చు. ఫిర్యాదు CCPAకి com-ccpa@nic.inలో ఇమెయిల్ పంపవచ్చు.


* చట్టంలోని సెక్షన్ 20 కింద ఇతర పక్షానికి వాదనలు వినిపించడానికి అవకాశం ఇచ్చిన తర్వాత, ఉల్లంఘన జరిగినట్లు CCPA సంతృప్తి చెందితే, కింది విధంగా ఉత్తర్వులు ఇవ్వవచ్చు..


- కస్టమర్‌కు అన్యాయమైన ఛార్జీలను రీఫండ్ చేయడం.


- వినియోగదారుల ప్రయోజనాలకు విఘాతం కలిగించే అన్యాయమైన పద్ధతులను నిలిపివేయడం.


2022 జులై 20 నాటి ఆర్డర్‌లో, ఢిల్లీ హైకోర్టు సర్వీస్ ఛార్జ్ మార్గదర్శకాలపై నవంబర్ 25 వరకు స్టే విధించింది. CPAలోని సెక్షన్ 2 (47) పరిధిలోకి ధర, సర్వీస్‌ ఛార్జీ రుసుము విధించే సమస్య వస్తుందా? లేదా? అనేది చర్చించాల్సిన అవసరం ఉందని కోర్టు పేర్కొంది.


షరతులతో కూడిన ప్రాతిపదికన స్టే ఇచ్చింది. రెస్టారెంట్లు ఎటువంటి టేక్-అవే వస్తువులపై సర్వీస్‌ ఛార్జీని విధించకూడదని కోర్టు పేర్కొంది. రెస్టారెంట్లు చెల్లించాల్సిన ధరలు, పన్నులకు అదనంగా విధించే సర్వీస్‌ ఛార్జీలను కూడా ప్రముఖంగా ప్రదర్శించాలని తెలిపింది. స్టేపై CCPA హైకోర్టులో అప్పీల్‌ను దాఖలు చేసింది, ఇది 31 ఆగస్టు 2022న విచారణకు రానుంది.

First published:

Tags: Bar and restaurants, Hotels, Service charges

ఉత్తమ కథలు