బంగారాన్నిడిపాజిట్ చేసి దానిపై ఋణాలు తీసుకోవడం అనేది భారతదేశంలో అతి సాధారణమైన విషయం. ఋణదాతలు తమకు ఇచ్చిన బంగారానికి బదులుగా డబ్బు ఇస్తారు. ఆ డబ్బును మీవ్యాపారం పెంచుకోవడం కోసం కానీ, వైద్యం కోసం కానీ లేదా ఏ ఆర్ధిక అవసరాల కోసమైనా ఇతరులపై ఆధారపడకుండా వాటిని స్వయంగా మీరే తీర్చుకోవచ్చు. అత్యవసర పరిస్థితిలో డబ్బు పొందడానికి గోల్డ్ లోన్ ఒక సులువైన మార్గం. అయితే దీని గురించి మీకు అనేక సందేహాలు ఉండవచ్చు. కాబట్టి ఇక్కడ కొన్ని సాధారణ ప్రశ్నలు, వాటికి నిపుణుల సమాధానాల జాబితా ఉంది.
గోల్డ్ లోన్ అంటే ఏమిటి?
గోల్డ్ లోన్ అనేది రుణదాత (బ్యాంక్ లేదా ఎన్బిఎఫ్సి) వద్ద బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి డబ్బు తీసుకోవడమే సురక్షితమైన గోల్డ్ లోన్. రుణదాత మార్కెట్లో బంగారం విలువ ఆధారంగా మీకు రుణ మొత్తాన్ని ఇస్తారు. మీరు ఎంచుకున్న సమయంలో రుణ మొత్తాన్ని అలాగే వడ్డీని చెల్లించిన తరువాత మీ బంగారం మీకు తిరిగి ఇవ్వబడుతుంది.
మీరు ఎటువంటి ఆభరణాలను తాకట్టుపెట్టవచ్చు?
మీరు బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టవచ్చు. బంగారం యొక్క స్వచ్ఛత మీరు ఎంత మొత్తం వరకు ఋణం తీసుకోవచ్చో నిర్ణయిస్తుంది. రుణాల కోసం బ్యాంకులు బంగారుకడ్డీలు, నాణేలు లేదా బులియన్లను అంగీకరించవని గమనించండి.
మీరు గోల్డ్ లోన్ ఏవిధంగా పొందవచ్చు?
మీరు మీ బంగారాన్నిరుణదాత వద్దకు తీసుకువెళ్లిన తరువాత, వారు దాని స్వచ్చతని అంచనా వేసి, మీకు ఎంత మొత్తం వరకు ఋణం అందుతుందో తెలియచేస్తారు. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం, ఈ మొత్తం బంగారం విలువలో 75% వరకు ఉంటుంది. బ్యాంక్ పాలసీ ప్రకారం వసూలు చేసే ప్రాసెసింగ్ ఫీజు మీరు చెల్లించవలసి ఉంటుంది.
రుణదాత వద్ద మీ బంగారం సురక్షితంగా ఉంటుందా?
లైసెన్స్ లేదా బ్యాంక్ లేదా ఎన్బీఎఫ్సీతో మీ బంగారు ఆభరణాలు మారిపోయే లేదా పోయే ప్రమాదం ఉంది. అందువలన HDFC బ్యాంక్ వంటి నమ్మకమైన రుణదాతల వద్ద గోల్డ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవడం మంచిది. అది మీఖజానాలో భద్రంగా ఉంటుంది. అందువలన మీరు మీబంగారం భద్రత గురించి చింతించవలసిన అవసరంలేదు. విలువైన మా భద్రత హామీతో మీరు నిశ్చింతగా ఉండవచ్చు.
మీకు ఎటువంటి పత్రాలు అవసరం?
ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోతోపాటు, మీగుర్తింపు రుజువులతో ఏదైనా (పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు) మరియు అడ్రస్ ప్రూఫ్ (విద్యుత్ బిల్లు, ఫోన్ బిల్లు) సమర్పించాల్సి ఉంటుంది. మీకు పాన్ కార్డు లేకపోతే ఫామ్ 60 సమర్పించవచ్చు.
గోల్డ్ లోన్ ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారు ఎవరైనా గోల్డ్ లోన్ దరఖాస్తు చేసుకొని తమ బంగారాన్నితాకట్టు పెట్టుకోవచ్చు.
ఋణం మంజూరు చేయడానికి ఎంత సమయం పడుతుంది?
బ్యాంక్ వంటి నమ్మకమైన బ్యాంకుల్లో ఋణమొత్తాన్నికేవలం 45 నిమిషాల్లో కౌంటర్ నుంచి తీసుకోవచ్చు.
గోల్డ్ లోన్ తిరిగి చెల్లించడానికి ఎటువంటి అవకాశాలు కలవు?
HDFC బ్యాంక్ వంటి రుణదాతలు రుణాన్నితిరిగి చెల్లించడానికి మీకు సౌకర్యవంతంగా ఉండే పలు రకాల అవకాశాలను అందిస్తారు.
• ముందస్తు వడ్డీ: మీరు ఎంచుకున్నసమయం ప్రారంభంలో మొత్తం వడ్డీని చెల్లించి, చివరిలో అసలు చెల్లించవచ్చు.
• బుల్లెట్ రీపేమెంట్: ఇక్కడ EMI వెసులుబాటులేదు. మీరుఎంచుకున్నసమయంచివరిలో వడ్డీతో సహా అసలు మొత్తాన్ని ఒకేసారి చెల్లించవచ్చు.
• రెగ్యులర్ EMI లు: చెల్లించవలసిన మొత్తం EMI ల రూపంలో ఉంటుంది.
• ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం: ఇది మీరు ఉపయోగించిన మొత్తానికి మాత్రమే వడ్డీ చెల్లించే సౌకర్యం.
తిరిగి చెల్లించే కాలపరిమితి అంటే ఏమిటి?
గోల్డ్ లోన్ తిరిగి చెల్లించవలసిన కాలపరిమితి సాధారణంగా ఋణదాతను బట్టి ఆరునెలల నుండి రెండు సంవత్సరాల మధ్య ఉంటుంది. ఉదాహరణకు
HDFC Bank gold loan HDFC బ్యాంక్ గోల్డ్ లోన్ కాలపరిమితి 6 నెలల నుంచి ప్రారంభమై 24 నెలల వరకు ఉంటుంది. కొంత మంది ఋణదాతలు మీ రుణాలను పునరుద్ధరించడం ద్వారా మీరు ఎంచుకున్న కాలపరిమితిని పొడిగించే అవకాశం కూడా కల్పిస్తారు. అయితే దీనికి ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. దానర్థం అధిక మొత్తం చెల్లించాల్సి వస్తుంది.
మీరు గోల్డ్ లోన్ చెల్లించలేక పోయినట్లయితే ఏమి జరుగుతుంది?
మీరు గోల్డ్ లోన్ తీసుకోవడానికి ముందే, మీరు దానిని తిరిగి చెల్లించగలరో లేదో అంచనా వేసుకోవడం చాలా అవసరం. ఒకవేళ మీరుచెల్లించలేకపోతే మిగిలిన ఋణమొత్తాన్ని తిరిగి పొందడం కోసం రుణదాతకు మీ బంగారాన్ని వేలం వేసే హక్కు ఉంటుంది.
గోల్డ్ లోన్ పై వడ్డీ రేటు ఎంత?
గోల్డ్ లోన్ వడ్డీ రేట్లు క్రెడిట్ కార్డ్, మ్యూచువల్ ఫండ్, వ్యక్తిగత రుణం వండి ఇతర రుణాలపై ఇచ్చే వడ్డీ రేటు కన్నా చాలా తక్కువ ఉంటాయి. ఋణదాతను బట్టి ఈ వడ్డీరేటు 11% నుండి 17% వరకు ఉంటుంది. HDFC బ్యాంక్ ఎటువంటి రహస్య చార్జీలు లేకుండా పోటీ వడ్డీ రేట్ల వద్ద ఋణాలను అందిస్తుంది.
మీరు బ్యాంకుని ఎంచుకోవాలా లేదా ఎన్బీఎఫ్సీని ఎంచుకోవాలా?
ఈ రోజుల్లో మీరు ఎన్బిఎఫ్సిలు, బ్యాంకుల నుండి కూడా గోల్డ్ లోన్ తీసుకోవచ్చు. రెండూ 75% లోన్ -టు -వాల్యూ రేషియోను అందిస్తున్నప్పటికీ, ఏదిసరైనదో తెలుసుకోవడానికి మీకు సహాయపడే అంశాలు ఇక్కడ కలవు.
HDFC బ్యాంక్ వంటి విశ్వసనీయ బ్యాంకుల నుండి బంగారు ఋణాలు ఎన్బిఎఫ్సిల కంటే పోటీ వడ్డీరేటుని అందిస్తాయి. అంతేకాకుండా HDFC బ్యాంకుకు వేగవంతమైన టర్న్ అరౌండ్ టైమ్ ఉంది. ఇక్కడ ఇటువంటి రహస్య ఛార్జీలు లేకుండా అతితక్కువ పత్రాలతో కేవలం 45 నిమిషాలలో ఋణం మంజూరు చేయబడుతుంది. ప్రముఖ బ్యాంకులు మెరుగైన భద్రతను కలిగిఉంటాయి. అందువలన పేరున్న బ్యాంకుల నుండి ఋణం తీసుకుని మీ ఆభరణాలను సురక్షితంగా ఉన్నాయన్న హామీతో నిశ్చింతగా ఉండండి.
ఎటువంటి చార్జీలు లేదా ఫీజులు వర్తిస్తాయి?
ప్రాసెసింగ్ ఫీజు, రీపేమెంట్ ఛార్జీలు, వాల్యూషన్ ఫీజు వంటి కొన్నిఅదనపు ఫీజులు మీరు చెల్లించవలసిఉంటుంది. కొంత మంది ఋణదాతలు అందరిని ఆకట్టుకోవడానికి పైకి ఇటువంటిచార్జీలను బయటపెట్టకపోవచ్చు. ఏదేమైనా HDFC వంటి బ్యాంకులు ఎటువంటి రహస్యచార్జీలు లేకుండా పూర్తిగా పారదర్శక ప్రక్రియ ద్వారా గోల్డ్ లోన్ మంజూరు చేయడంలో ప్రసిద్ధిచెందాయి.
ప్రస్తుతం మీకున్న అవసరాల కోసం త్వరగా డబ్బు పొందడానికి చూస్తున్నట్లయితే గోల్డ్ లోన్ తీసుకోవడం చాలా సులువైన మార్గం.
ప్రస్తుతం బంగారం ధర మరింత పెరగడంతో ఎక్కువ మొత్తాన్ని ఋణంగా పొందవచ్చు. గోల్డ్ లోన్ సులువుగా, త్వరగా పొందడానికి
ఇక్కడక్లిక్ చేయండి.