Cars Air Bags: చిన్న కార్లలోనూ కనీసం 6 ఎయిర్ బ్యాగ్స్.. కేంద్రమంత్రి కీలక ఆదేశాలు

ప్రతీకాత్మక చిత్రం

Car Air Bags: చిన్న కార్లను కేవలం పేదలు, మధ్య తరగతి ప్రజలు మాత్రమే కొంటారు కాబట్టి.. వాళ్ల ప్రాణాలు కూడా ముఖ్యమేనని చెబుతున్నారు కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ.

  • Share this:
ఈరోజుల్లో మధ్యతరగతి ప్రజలు సైతం కారును ఒక అవసరంగా భావిస్తున్నారు. అందుకే రోజురోజుకూ కార్ల సేల్స్ పెరుగుతున్నాయి. అలాగే కార్ల వల్ల ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయి. లగ్జరీ కార్లకు పెద్ద ప్రమాదం జరిగినా అందులో ఉండే ఎయిర్ బ్యాగ్స్‌తో ప్రాణాలను కొంతమేరకైనా కాపాడుకోవచ్చు. వాటిలో 8 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. కానీ చిన్న కార్లలో ఎయిర్ బ్యాగ్స్ ఉండవు. చిన్న కార్లను కేవలం పేదలు, మధ్య తరగతి ప్రజలు మాత్రమే కొంటారు కాబట్టి.. వాళ్ల ప్రాణాలు కూడా ముఖ్యమేనని చెబుతున్నారు కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. చిన్న కార్లలోనూ కనీసం 6 ఎయిర్ బ్యాగ్స్ ఉండేలా కార్ల కంపెనీలు చర్యలు తీసుకోవాలని గడ్కరీ ఆదేశించారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నితిన్ గడ్కరీ ఎంట్రీ లెవల్ కార్లలో ఎయిర్ బ్యాగ్స్ ఎందుకు ఉండవు అని ప్రశ్నించారు. మన దేశంలో రోడ్ల మీదికి వచ్చే ప్రతి కారులో కచ్చితంగా తగినన్ని ఎయిర్ బ్యాగ్స్ ఉండాలని స్పష్టం చేశారు.

"పెద్ద పెద్ద కార్లను, లగ్జరీ కార్లను కేవలం ధనవంతులు మాత్రమే కొనగలుగుతారు. ఆ కార్లలో మాత్రమే ఆటోమొబైల్ కంపెనీలు ఎయిర్ బ్యాగ్స్ ఏర్పాటు చేస్తున్నాయి. మరి ఎంట్రీ లెవల్ కార్లలో ఎందుకు ఎయిర్ బ్యాగ్స్ ఏర్పాటు చేయడం లేదు? కార్లను తయారు చేసే ప్రతి కంపెనీ కచ్చితంగా అన్ని కార్లలో ఎక్కువ ఎయిర్ బ్యాగ్స్ ఏర్పాటు చేసి రోడ్డు ప్రమాదాల ద్వారా సంభవించే మరణాల సంఖ్యను తగ్గేలా చర్యలు తీసుకోవాలి.." అని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు.

"మన దేశంలో పేదలు, మధ్య తరగతి ప్రజలే చిన్న కార్లను కొనుగోలు చేస్తారు. ఆ కార్లలో ఎయిర్ బ్యాగ్స్ లేకపోతే.. రోడ్డు ప్రమాదాల్లో వాళ్ల ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది కదా. అందుకే.. ఖచ్చితంగా అన్ని కార్లో ఆటోమొబైల్ కంపెనీలు.. కనీసం 6 ఎయిర్ బ్యాగ్స్‌ను ఏర్పాటు చేయాల్సిందే" అని ఆయన తెలిపారు.

కేంద్ర మంత్రి చెప్పిన విషయాలు కరెక్టే కానీ.. ప్రతి కారులో ఎయిర్ బ్యాగ్స్ అందించడం అనేది ఆటోమొబైల్ కంపెనీలకు పెద్ద సమస్యగా మారింది. మన దేశంలో ఇప్పటికే కార్ల మీద ఎక్కువ ట్యాక్స్ ఉంది. 28 శాతం వరకు జీఎస్టీని వసూలు చేస్తున్నారు. 22 శాతం వరకు సెస్, రోడ్ ట్యాక్స్ లాంటి వాటిని ఆటోమొబైల్ కంపెనీలే భరించాల్సి రావడంతో కార్ల ధరలకు రెక్కలు వస్తున్నాయి.

Telangana: ఇటు కాంగ్రెస్.. అటు బీజేపీ.. బ్యాలెన్స్ చేస్తున్న మాజీ ఎంపీ.. టార్గెట్ ఆ నాయకుడే..

YS Jagan: ఏపీ కేబినెట్‌లో మార్పులు చేర్పులు.. వారిచ్చే నివేదికలే సీఎం జగన్‌కు కీలకమా ?

2022-23 ఆర్థిక సంవత్సరంలో అన్ని వాహనాలలో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ లాంటి ఫీచర్లను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈ ఫీచర్లను కార్లలో ఏర్పాటు చేయాలంటే కార్ల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో కార్ల తయారీ సంస్థలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటాయో వేచి చూడాల్సిందే.
Published by:Kishore Akkaladevi
First published: