ఇటీవల వివిధ రకాల వాహనాలకు అన్లిమిటెడ్ లయబిలిటీ(Unlimited Liability ) కోసం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్(Third Party Insurance) బేస్ ప్రీమియంను కేంద్ర ప్రభుత్వం(Central Government) ప్రకటించింది. ఇవి ఇంధనం, విద్యుత్తు(Electricity) రెండింటితో నడిచే ప్రైవేట్ కార్లు(Private Cars), ద్విచక్ర వాహనాలు, గూడ్స్ క్యారేజీలతో సహా వివిధ వాహనాలకు వర్తిస్తాయి. ఇన్సూరెన్స్ రేట్లు పెరిగిన కారణంగా ఎలక్ట్రిక్ వాహనాలు, పెట్రోల్(Petrol), డీజిల్‌తో నడిచే కార్ల ధరలు పెరిగే అవకాశం ఉంది. రోడ్డు రవాణా, హైవే మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్లో.. కొత్త ఛార్జీలు 2022 జూన్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ప్రకారం.. హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రీమియంపై 7.5 శాతం తగ్గింపు లభిస్తుంది. అయితే EV థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ రేట్లు కూడా పెరిగాయి.
Fixed Deposits: ఎఫ్డీ చేయాలనుకొంటున్నారా.. అయితే ఈ వివరాలు తెలుసుకోండి
* 2022 జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చే ఎలక్ట్రిక్ వెహికల్ ఇన్సూరెన్స్ రేట్లు ఇవే
ప్రైవేట్ కార్లు: 30 KW కంటే ఎక్కువ పవర్ అవుట్‌పుట్ లేని ప్రైవేట్ ఫోర్ వీలర్ ఎలక్ట్రిక్ కార్లకు సవరించిన ఇన్సూరెన్స్ రేటు రూ.1,780గా ఉంది. ఎలక్ట్రిక్ వెహికల్ పవర్ అవుట్‌పుట్ 30 KW కంటే ఎక్కువ 65 KW కంటే తక్కువగా ఉంటే కొత్త ఇన్సూరెన్స్ రేటు రూ.2,904గా ఉంటుందని పేర్కొంది. ప్రైవేట్ ఎలక్ట్రిక్ కారు ఎలక్ట్రిక్ అవుట్‌పుట్ 65 కిలోవాట్లకు మించి ఉంటే యజమానులు రూ.6,712 ఇన్సూరెన్స్ చెల్లించాలి.
ద్విచక్ర వాహనాలు: 3 కిలోవాట్ల కంటే తక్కువ విద్యుత్ ఉత్పత్తి కలిగిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు ఇప్పుడు రూ.457 ఇన్సూరెన్స్ చెల్లించాలి. అయితే 3 కిలోవాట్ల కంటే ఎక్కువ పవర్ అవుట్‌పుట్‌లు ఉన్నవి 7 కిలోవాట్ల కంటే తక్కువ ఉండేవాటికి రూ.607 ఇన్సూరెన్స్ రేటు పేర్కొంది. 7 కిలోవాట్లకు మించిన పవర్ అవుట్‌పుట్‌లు, 16 కిలోవాట్లకు మించని ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు యజమానులు రూ.1,161 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. 16 KW కంటే ఎక్కువ EV పవర్ ఉన్నవాటికి ఇన్సూరెన్స్ ప్రీమియం రూ.2,383గా ఉంది.
నాలుగు చక్రాల వాహనాలకు EV లాంగ్ టర్మ్ ప్రీమియం: కొత్త ప్రైవేట్ కారు కోసం 30 కిలోవాట్ల ఎలక్ట్రిక్ అవుట్‌పుట్ మించని వాహనాలకు మూడు సంవత్సరాల సింగిల్ ప్రీమియం రూ.5,543గా ఉంది. అయితే 30 KW కంటే ఎక్కువ పవర్ అవుట్‌పుట్‌లు ఉన్న వాహనాలు 65 కిలోవాట్ల కంటే తక్కువ అవుట్‌పుట్ ఉన్న వాహనాలకు రూ.9,044 ప్రీమియం ఉంటుంది. 65 కిలోవాట్లకు మించిన వాహనాలకు ప్రీమియం రూ.20,907గా పేర్కొంది.
ద్విచక్ర వాహనాలకు EV లాంగ్ టర్మ్ ప్రీమియం: 3 కిలోవాట్ల ఎలక్ట్రిక్ అవుట్‌పుట్ మించని కొత్త ప్రైవేట్ కారుకు ఐదు సంవత్సరాల సింగిల్ ప్రీమియం రూ.2,466, అయితే 3 కిలోవాట్ల కంటే ఎక్కువ పవర్ అవుట్‌పుట్‌లు ఉన్న వాహనాలు, 7 కిలోవాట్లను మించకుండా వాటికి రూ.3,243 ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించాలి. 7 కిలోవాట్లకు మించి 16 కిలోవాట్లకు మించని వాహనాలకు ప్రీమియం రూ.6,260 కాగా, 16 కిలోవాట్ల కంటే ఎక్కువ పవర్ అవుట్‌పుట్ ఉన్న ద్విచక్ర వాహనాలకు రూ.12,849 ప్రీమియం చెల్లించాలి.
థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ కవరేజీ అనేది సొంత డ్యామేజ్ కాకుండా ఇతర వాటిని కవర్ చేస్తుంది. వాహన యజమాని కొనుగోలు చేయాల్సిన సొంత డ్యామేజ్ కవర్‌తో పాటు ఇది తప్పనిసరి. ఈ బీమా కవరేజీ అనేది థర్డ్ పార్టీ వ్యక్తులకు సంబంధించి ఉంటుంది. రోడ్డు ప్రమాదంలో ఒకరి కారణంగా గాయపడిన ఎదుటి వ్యక్తి కోసం ఉద్దేశించినది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కవరేజీ.
Home Loans: ఇల్లు కొనే వారికి భారీ షాక్ తప్పదా.. ఆర్బీఐ నిర్ణయం అదేనా?
దీనికి ముందు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ రేట్లను ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) నోటిఫై చేసింది. రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ బీమా నియంత్రణ సంస్థతో సంప్రదించి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ రేట్లను విడుదల చేయడం ఇదే తొలిసారి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Electric bike, Premium, Price hikes