Home /News /business /

EV BATTERIES COMAKI COMPANY LAUNCHES FIREPROOF BATTERIES FOR ELECTRIC TWO WHEELERS IN INDIA GH VB

EV Batteries: ఎలక్ట్రిక్ టూవీలర్ల కోసం ఫైర్‌ప్రూఫ్ బ్యాటరీలు లాంచ్ చేస్తున్న ప్రముఖ కంపెనీ.. ఆ వివరాలిలా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీదారు కొమాకి (Komaki) భారతదేశంలో ఫైర్‌ప్రూఫ్ (fireproof) బ్యాటరీలను విడుదల చేయడానికి సిద్ధమైంది. ఫైర్‌ప్రూఫ్ అంటే మండనిది, మంటలకు అంటుకోనిది, నిప్పుకు డ్యామేజ్ కానిది అని అర్థం.

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వరుసగా ఎలక్ట్రిక్ స్కూటర్లలో (Electric Scooters) మంటలు చెలరేగుతున్నాయి. ఈ ఈవీలు(EVs) అగ్నికి ఆహుతి అవుతున్న దృశ్యాలు వాహనదారుల్లో భయాన్ని పెంచుతున్నాయి. ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్స్ సేఫ్టీ (Safety) పెద్ద ప్రశ్నార్థకంగా మారిన ఈ నేపథ్యంలో ఒక ఈవీ కంపెనీ ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు రెడీ అయ్యింది. ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీదారు కొమాకి (Komaki) భారతదేశంలో ఫైర్‌ప్రూఫ్ (fireproof) బ్యాటరీలను విడుదల చేయడానికి సిద్ధమైంది. ఫైర్‌ప్రూఫ్ అంటే మండనిది, మంటలకు అంటుకోనిది, నిప్పుకు డ్యామేజ్ కానిది అని అర్థం. తమ ఫైర్‌ప్రూఫ్ బ్యాటరీలు గల బైక్స్ నడుపుతున్నప్పుడు అగ్ని ప్రమాదాల గురించి భయపడనక్కర్లేదని, ఎందుకంటే ఈ బ్యాటరీలలో నిప్పు చెలరేగే అవకాశమే ఉండదని కొమాకి కంపెనీ చెబుతోంది.

Indian Army Jobs: ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు.. కానీ.. 5 ఏళ్ల లోపే పదవీ విరమణ..! వివరాలిలా..


జనవరిలో రేంజర్, వెనిస్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను లాంచ్ చేసిన కొమాకి సంస్థ గత నెలలో డీటీ 3000ని విడుదల చేసింది. ఇటీవలి రోజుల్లో కనీసం నాలుగు టూ-వీలర్ ఈవీలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ క్రమంలో ఈవీల కోసం సురక్షితమైన బ్యాటరీలను నిర్మించాల్సిన తక్షణావసరం ఉందని ప్రభుత్వంతో సహా వివిధ వాటాదారులు భావిస్తున్నారు. ఈ సమస్య వారికి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

కొమాకి ఆపరేషన్ హెడ్ సుభాష్ శర్మ ప్రకారం, బ్యాటరీ సేఫ్టీ అనేది శక్తిని వినియోగించుకోవడానికి ఉపయోగించే టెక్నాలజీలో ఉంది. "నాణ్యత లేని లిథియం... బ్యాటరీ లోపల సెల్ లీకేజీ... బ్యాటరీ కంట్రోలర్, మోటారు (పవర్‌ట్రెయిన్) పారామీటర్ల మధ్య మిస్ మ్యాచ్ వంటి మూడు కారణాల వల్ల ఎలక్ట్రిక్ వాహనాల్లో మంటలు చెలరేగుతున్నాయి" అని సుభాష్ శర్మ తాజాగా చెప్పుకొచ్చారు. అతని ప్రకారం, గ్యాసోలిన్, లిథియం రెండూ కూడా మండే స్వభావాన్ని (Highly Flammable) ఎక్కువగా కలిగి ఉంటాయి. వీటి మధ్య తేడా ఏమిటంటే, ఈ రెండూ కూడా మంటలను క్యాచ్ చేసే ఉష్ణోగ్రత వేరు వేరుగా ఉంటుంది. గ్యాసోలిన్ సెల్ఫ్-ఇగ్నేషన్ టెంపరేచర్ 210+ డిగ్రీల సెల్సియస్ కాగా లిథియం సెల్ఫ్-ఇగ్నేషన్ టెంపరేచర్ 135+ డిగ్రీల సెల్సియస్ గా ఉంటుంది.

"ఇంటర్నల్‌ కంబషన్‌ ఇంజన్ (ICE) పరిశ్రమ చాలా పురాతనమైనది. అది దాని ప్రారంభ దశలలో ఈ తరహా సమస్యలను కలిగి ఉంది. విద్యుత్ రంగానికి సంబంధించి, ఇది కొత్తది. ఇది ఐసీఈ ప్రతిరూపాల వలె కొంతకాలంలో బాగా అభివృద్ధి చెందుతుంది," అని సుభాష్ శర్మ చెప్పుకొచ్చారు. ఓలా ఎలక్ట్రిక్, ఒకినావా ఈ-స్కూటర్‌ల్లో మంటలు చెలరేగడంతో ప్రభుత్వ సర్కిల్‌లలో అలారం మోగింది. అయితే హైదరాబాద్‌కు చెందిన ప్యూర్ ఈవీకి చెందిన మరో ఎలక్ట్రిక్ స్కూటర్ గత నెల చివరిలో తమిళనాడులో మంటల్లో కాలిపోయిందని సమాచారం. ఈ ఘటనలతో ప్రభుత్వం మేల్కొంది. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ వీటిపై విచారణకు ఆదేశించింది.

Telangana Governor: అమిత్ షాతో తమిళిసై భేటీ.. KCR తీరుపై ఫిర్యాదు?.. సీఎం ఢిల్లీలో ఉండగానే..


ఈ ఘటనల తర్వాత బ్యాటరీ తయారీదారులు జాగ్రత్త వహిస్తున్నారు. వేడెక్కడే సమస్యను పరిష్కరించడానికి సమగ్ర పరీక్షలు చేస్తూ మెరుగైన టెక్నాలజీలకు తీసుకొస్తామని హామీ ఇస్తున్నారు. కొమాకి కంపెనీ తన వాహనాలను బాగా టెస్ట్ చేస్తుందని శర్మ చెప్పారు. "మేం జనవరి 2022లో రేంజర్, వెనిస్‌లను ప్రారంభించాం. మేం గత సంవత్సరంగా ఫైర్‌ప్రూఫ్ బ్యాటరీలను భారతదేశంలో లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. దాని పేటెంట్‌ను కూడా పొందుతున్నాం," అని ఆయన పేర్కొన్నారు.
Published by:Veera Babu
First published:

Tags: Electric bike, Electric Vehicles

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు