Union Bank of India: ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్... ఈ అవకాశం మార్చి 31 వరకే

Union Bank of India: ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్... ఈ అవకాశం మార్చి 31 వరకే

మీకు గతంలో ఆంధ్రా బ్యాంకులో అకౌంట్ ఉందా? కార్పొరేషన్ బ్యాంక్ పాత కస్టమరా? ఈ రెండు బ్యాంకులు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం అయిన సంగతి తెలిసిందే.

  • Share this:
    ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంకులు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం అయిన సంగతి తెలిసిందే. ఈ విలీన ప్రక్రియలో కీలక మైలురాయిని చేరుకుంది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-UBI. గతంలో ఆంధ్రా బ్యాంకులుగా ఉన్న అన్ని బ్రాంచుల ఐటీ ఇంటిగ్రేషన్ పూర్తైందని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-UBI ప్రకటించింది. అంటే గతంలో ఆంధ్రా బ్యాంకులుగా సేవలు అందించిన అన్ని సర్వీస్ బ్రాంచ్‌లు, స్పెషలైజ్డ్ బ్రాంచ్‌లు ఇప్పుడు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో అనుసధానమయ్యాయి. 2020 నవంబర్‌లో కార్పొరేషన్ బ్యాంక్ బ్రాంచులన్నీ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో అనుసధానమైన సంగతి తెలిసిందే. దీంతో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీమైన ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంకుల ఐటీ ఇంటిగ్రేషన్ పూర్తైంది.

    గతంలో ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంకు కస్టమర్లుగా ఉన్నవరంతా UBI కోర్ బ్యాంకింగ్ సాఫ్ట్‌వేర్‌కు విజయవంతంగా మైగ్రేట్ అయ్యారు. దీంతో ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ, ఐఎంపీఎస్, ఎఫ్ఐ గేట్‌వే, ట్రెజరీ, స్విఫ్ట్ లాంటి సేవలన్నీ పాత ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంకు కస్టమర్లకు అందిస్తోంది UBI. ఇకపై ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంకు కస్టమర్లు అన్ని బ్రాంచుల్లో ఎలాంటి సమస్యలు లేకుండా లావాదేవీలు జరపొచ్చు. ఇక ఇప్పటికే ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంకు ఏటీఎంలు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెట్వర్క్‌లోకి వచ్చాయి.

    February 2021 Bank Holidays: ఫిబ్రవరిలో బ్యాంకులో పనులున్నాయా? గుడ్ న్యూస్

    EPF Account: ఈపీఎఫ్ అకౌంట్‌లో మొబైల్ నెంబర్, ఇమెయిల్ అప్‌డేట్ చేయండి ఇలా

    ఇన్ఫోసిస్, EY, BCG సహకారంతో ఈ విలీన ప్రక్రియను జరిపింది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ విలీన ప్రక్రియ అంతా కస్టమర్ల అకౌంట్ నెంబర్లు, డెబిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్ వివరాలు ఏమాత్రం మారకుండా జరగడం విశేషం. అయితే ప్రస్తుతం ఉన్న ఐఎఫ్ఎస్‌సీ కోడ్, చెక్స్‌ని ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంకు కస్టమర్లు 2021 మార్చి 31 వరకు ఉపయోగించుకోవచ్చు.

    ప్రస్తుతం భారతదేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాది ఐదో స్థానం. నెట్వర్క్ విషయంలో నాలుగో స్థానం. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 9590 పైగా బ్రాంచ్‌లు, 13,287 ఏటీఎంలు ఉన్నాయి.
    Published by:Santhosh Kumar S
    First published: