news18-telugu
Updated: November 3, 2020, 5:49 PM IST
(ప్రతీకాత్మక చిత్రం)
ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు(Equitas Small Finance Bank) ఫిక్స్డ్ డిపాజిట్ల(ఎఫ్డీ)పై ఆకర్షణీయమైన వడ్డీ రేటును ఇస్తోంది. ఆ బ్యాంకులో ఫిక్సిడ్ డిపాజిట్లు చేసుకునేందుకు 7 రోజుల నుంచి 10 సంవత్సరాల నిర్దిష్టకాలపరిమితిని అందుబాటులో ఉంచింది. వినియోగదారుల సౌలభ్యం ప్రకారం బ్యాంక్ అందించే కాలపరిమితిలో ఏదైనా 2007లో ప్రారంభమైన ఈక్వీటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు రెండు విభిన్న రకాల ఎఫ్డీ పథకాలను అందిస్తుంది. అవే ఈక్వీటాస్ ఫిక్స్డ్ డిపాజిట్, ఈక్వీటాస్ సెల్ఫీ ఎఫ్డీ. ఈక్వీటాస్ ఫిక్స్డ్ డిపాజిట్లో ఇంతకు ముందే ఉన్న ఖాతాదారుల కోసం 7 రోజుల నుంచి 10 ఏళ్ల వరకు కాలపరిమితి వరకు అందుబాటులో ఉంటుంది. కాలపరిమితి కంటే ముందుగానే డబ్బు విత్ డ్రా చేసుకోవాలంటే 1 శాతం జరిమానాతో ఎఫ్డీ ఉపసంహరించుకోవచ్చు. ఇక ఈక్వీటాస్ సెల్ఫీ ఎఫ్డీ బ్యాంకులో ఖాతా లేని వ్యక్తుల కోసం రూపొందించింది. పాన్, ఆధార్ సాయంతో తక్షణమే ఖాతా తీసుకోవచ్చు. ఇది వారం నుంచి ఏడాది కాలపరిమితి వరకు వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. ఇందులోనూ ఖాతాదారులు ముందుగానే ఫిక్స్డ్ డిపాజిట్ నగదు ఉపసంహరించుకోవచ్చు. ప్రతిగా ఒక శాతం నగదు జరిమానా చెల్లించాలి.
ఈక్వీటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో ఎఫ్డీలపై వడ్డీ రేట్లు...
7 నుంచి 14 రోజులు వరకు 3.60 శాతం
15 నుంచి 29 రోజుల వరకు 3.60 శాతం
20 నుంచి 45 రోజుల వరకు 4.10 శాతం
46 నుంచి 62 రోజుల వరకు 4.60 శాతం
63 నుంచి 90 రోజుల వరకు 5.60 శాతం91 నుంచి 120 రోజుల వరకు 5.85 శాతం
121 నుంచి 180 రోజుల వరకు 5.85 శాతం
181 నుంచి 210 రోజుల వరకు 6.10 శాతం
211 నుంచి 270 రోజుల వరకు 6.10 శాతం
271 నుంచి 364 రోజుల వరకు 6.60 శాతం
ఒక సంవత్సరం నుంచి 18 నెలల వరకు 7.10 శాతం
18 నెలల ఒక రోజు నుంచి 2 ఏళ్ల వరకు 7.10 శాతం
2 ఏళ్ల ఒక రోజు నుంచి 887 రోజల వరకు 7.10 శాతం
888 రోజులకు 7.35 శాతం
889 రోజుల నుంచి 3 ఏళ్ల వరకు 7.15 శాతం
3 ఏళ్ల ఒక రోజు నుంచి 4 సంవత్సరాలకు 6.75 శాతం
4 ఏళ్ల ఒక రోజు నుంచి 5 సంవత్సరాలకు 6.75 శాతం
5 ఏళ్ల ఒక రోజు నుంచి 10 సంవత్సరాలకు 6.75 శాతం.
November 2020 Bank Holidays: నవంబర్లో బ్యాంకులకు సెలవులు ఎప్పుడంటే
Flipkart Big Diwali sale: రెడ్మీ నుంచి రియల్మీ వరకు... ఈ 12 స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్
ఈ వడ్డీ రేట్లు జూన్ 1 నుంచి అందుబాటులో ఉన్నాయి. ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు వృద్ధుల కోసం 60 బేసిస్ పాయింట్ల అధిక రాబడిని అందిస్తుంది (ఎన్ఆర్ఈ, ఎన్ఆర్ఓ ఖాతాదారులకు ఇది వర్తించదు). ఈ బ్యాంకు వెబ్ సైట్ ప్రకారం దేశీయ స్థరి డిపాజిట్ల కోసం అందించే అత్యధిక వడ్డీరేటు 888 రోజుల కాలపరిమితిలో వృద్ధులకు 7.95 శాతం ఇస్తుంది. సీనియర్ సిటిజన్లకు 7 రోజుల నుంచి 10 ఏళ్ల వరకు పరిపక్వమైన డిపాజిట్లపై 4.2 నుంచి 7.95 శాతం వరకు లభిస్తుంది. ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు అవుట్ లెట్ల పరంగా భారతదేశంలోనే అతిపెద్ద ఎస్ఎఫ్బీ. 2019 ఆర్థిక సంవత్సరం నాటికి ఏయూఎం మొత్తం డిపాజిట్ల పరంగా భారత్ లో రెండో అతిపెద్ద ఎస్ఎఫ్బీ అవతరించింది. ఈ బ్యాంకు ప్రారంభ పబ్లిక్ ఆఫర్ 1.97 రెట్లు ఉంది. అక్టోబరు 22వ తేదీతో పబ్లిక్ ఆఫరింగ్ కు గడువు ముగిసింది.
Published by:
Santhosh Kumar S
First published:
November 3, 2020, 5:48 PM IST