హోమ్ /వార్తలు /బిజినెస్ /

Digital Life Certificate: EPFO పెన్షనర్లకు అలర్ట్.. లైఫ్ సర్టిఫికేట్‌ విషయంలో లేటెస్ట్ అప్ డేట్ ఇదే...

Digital Life Certificate: EPFO పెన్షనర్లకు అలర్ట్.. లైఫ్ సర్టిఫికేట్‌ విషయంలో లేటెస్ట్ అప్ డేట్ ఇదే...

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) సభ్యులకు శుభవార్త. EPFO ఇప్పుడు డిజిలాకర్ నుండి అనేక ముఖ్యమైన డాక్యుమెంట్లను డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయాన్ని సభ్యులు ప్రారంభించింది. సంస్థ తన అధికారిక ట్విట్టర్ ఖాతా నుండి ట్వీట్ చేయడం ద్వారా ఈ సమాచారాన్ని అందించింది.

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) సభ్యులకు శుభవార్త. EPFO ఇప్పుడు డిజిలాకర్ నుండి అనేక ముఖ్యమైన డాక్యుమెంట్లను డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయాన్ని సభ్యులు ప్రారంభించింది. సంస్థ తన అధికారిక ట్విట్టర్ ఖాతా నుండి ట్వీట్ చేయడం ద్వారా ఈ సమాచారాన్ని అందించింది.

Digital Life Certificate: పెన్షనర్లు పెన్షన్ పంపిణీ చేసే బ్యాంకు శాఖలు లేదా సాధారణ సేవా కేంద్రాలను సందర్శించి డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌ అందించాల్సిన శ్రమ దూరం అయింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌(EPFO) EPS'95 పెన్షనర్లు ఇప్పుడు ఏ సమయంలోనైనా లైఫ్ సర్టిఫికేట్‌ (Life Certificate)ను సమర్పించవచ్చు. ఈ లైఫ్‌ సర్టిఫికేట్‌ ఒక సంవత్సరం పాటు చెల్లుబాటు అవుతుంది. దీనికి సంబంధించి ఈపీఎఫ్‌వో చేసిన ట్వీట్‌లో.. ‘EPS'95 పెన్షనర్లు ఇప్పుడు లైఫ్ సర్టిఫికేట్‌ను ఎప్పుడైనా సమర్పించవచ్చు. ఇది సమర్పించిన తేదీ నుంచి సంవత్సరం వరకు చెల్లుబాటు అవుతుంది.’ అని ప్రకటించింది.ఈపీఎఫ్‌వో(EPFO) ​​పెన్షనర్లు ఇకపై డిజిటల్‌ లైఫ్‌ సర్టిఫికేట్‌(DLC) అందజేయడానికి ఆఫీస్‌లకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంటి వద్ద నుంచే డిజిటల్‌ లైఫ్‌ సర్టిఫికేట్‌ను ఫైల్‌ చేయవచ్చు.ఇకపై పెన్షనర్లు పెన్షన్ పంపిణీ చేసే బ్యాంకు శాఖలు లేదా సాధారణ సేవా కేంద్రాలను సందర్శించి డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌ అందించాల్సిన శ్రమ దూరం అయింది. పింఛను సేవలు కొనసాగేందుకు ప్రతి సంవత్సరం ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. రిటైర్‌మెంట్ ఫండ్ బాడీ ప్రారంభించిన ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీ ద్వారా ఇప్పుడు ఎక్కడి నుంచైనా డిజిటల్‌ లైఫ్‌ సర్టిఫికేట్‌ను ఫైల్‌ చేయవచ్చు.


* లైఫ్‌ సర్టిఫికేట్‌ను కింది పద్ధతులను ఉపయోగించి డిజిటల్‌గా ఫైల్‌ చేయవచ్చు..
- పెన్షన్ పంపిణీ బ్యాంకు
- IPPB/ఇండియన్ పోస్ట్ ఆఫీస్/పోస్ట్‌మ్యాన్
- ఉమంగ్ యాప్
- సమీప EPFO ​​ఆఫీస్
* లైఫ్ సర్టిఫికేట్‌ను డిజిటల్‌గా సమర్పించడానికి కింది డాక్యుమెంట్స్ అవసరం
- PPO నంబర్
- ఆధార్ నంబర్‌
- బ్యాంక్ అకౌంట్‌ వివరాలు
- ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్
* వృద్ధులకు బయోమెట్రిక్‌ సమస్యలు
వృద్ధాప్యం లేదా ఆరోగ్య సంబంధిత సమస్యల కారణంగా బయో-మెట్రిక్స్ (వేలిముద్ర లేదా కనుపాప) క్యాప్చర్ అవ్వక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పెన్షనర్లకు కొత్త సదుపాయం ఎంతో సహాయం చేస్తుంది. డిజిటల్‌ లైఫ్‌ సర్టిఫికేట్‌ ప్రొడ్యూస్‌ చేయడానికి బయో-మెట్రిక్స్ తప్పనిసరి. ఈపీఎఫ్‌ఓ గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.13,000 కోట్ల పెన్షన్‌ను అందజేసింది.
కొత్తగా అందుబాటులోకి తీసుకొస్తున్న టెక్నాలజీ గురించి ఓ ఈపీఎఫ్‌వో అధికారి మాట్లాడుతూ..‘కొత్త విధానం ప్రకారం, ఒక పెన్షనర్ తన ఇంటి నుంచి లేదా మరే ఇతర ప్రదేశం నుంచి అయినా డిజిటల్‌ లైఫ్‌ సర్టిఫికేట్‌(DLC)ను ప్రొడ్యూస్‌ చేయవచ్చు. ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ నుంచి ఒక నిర్దిష్ట యాప్‌ని ఓపెన్‌ చేసి, సర్టిఫికేట్‌ను ఫొటో తీసి అప్‌లోడ్ చేస్తే.. పెన్షనర్‌ ఇంకా బతికే ఉన్నట్లు రుజువు అవుతుంది. ఇది పెన్షన్‌ను నిర్ధారిస్తుంది.’ అని తెలిపారు. విదేశాల్లో నివసిస్తున్న పింఛనుదారులు తమ డిజిటల్‌ లైప్‌ సర్టిఫికేట్‌ని ఇప్పుడు సులువుగా కొత్త విధానంలో సమర్పించవచ్చు.
* డాక్యుమెంట్ లేకపోతే పెన్షన్‌ కోత
ఇప్పటివరకు ఉద్యోగుల పెన్షన్ స్కీమ్, 1995 కింద పింఛను పొందుతున్న పింఛనుదారులందరూ పెన్షన్ మంజూరైన నెల నుంచి 12 నెలల తర్వాత బ్యాంక్ మేనేజర్ ధ్రువీకరించిన లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వవలసి ఉంటుంది. పింఛను చెల్లిస్తున్న బ్యాంకుకు ఫిజికల్ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాలి.
ఇది కూడా చదవండి : వైకల్యం ఓడింది.. చూపు లేకున్నా రూ.47 లక్షల ప్యాకేజీతో జాబ్ ఆఫర్.. ఇదే కదా అసలైన విజయం..
ఒక సంవత్సరం తర్వాత లైఫ్ సర్టిఫికేట్ అందజేయకపోతే.. చివరిగా ధ్రువీకరణ పత్రం సమర్పించిన తేదీ నుంచి 12 నెలల తర్వాత పెన్షన్ నిలిచిపోతుంది. ఫిజికల్‌ లైఫ్‌ సర్టిఫికేట్‌ స్థానంలో, బయో-మెట్రిక్‌లను ఉపయోగించి 2015-16లో డిజిటల్‌ లైఫ్‌ సర్టిఫికేట్‌లను ప్రవేశపెట్టారు.
చాలా సందర్భాలలో ఒకే వ్యక్తికి సంబంధించిన బయో-మెట్రిక్‌లు కూడా సరిపోలడం లేదని గుర్తించారు. కాటరాక్ట్ సర్జరీ తర్వాత వేలిముద్ర సరిపోలకపోవడం లేదా ఐరిస్ సరిపోలకపోవడం దీనికి కారణం. ఫలితంగా, పెన్షనర్లు మళ్లీ గజిబిజిగా ఉన్న ఫిజికల్‌ సర్టిఫికేట్‌ ప్రక్రియను అనుసరించాల్సి వస్తోంది.

Published by:Sridhar Reddy
First published:

Tags: EPFO, Personal Finance

ఉత్తమ కథలు