1. ఇటీవల కాలంలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సేవల్ని ఉపయోగించేవారి సంఖ్య పెరిగిపోయింది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఉద్యోగులు తమ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) అకౌంట్ నుంచి డబ్బులు విత్‌డ్రా చేసే వెసులుబాటు కల్పించింది ఈపీఎఫ్ఓ. దీంతో లక్షలాది మంది ఉద్యోగులు తమ పీఎఫ్ అకౌంట్ (PF Account) నుంచి డబ్బులు విత్‌డ్రా చేస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
2. అయితే పీఎఫ్ అకౌంట్లో వివరాలు సరిగ్గా లేకపోవడం వల్ల క్లెయిమ్ సెటిల్మెంట్ పెండింగ్‌లో ఉంటోంది. మరోవైపు ఈపీఎఫ్ఓ ఇ-నామినేషన్ తప్పనిసరిగా ఫైల్ చేయమని కోరుతోంది. పీఎఫ్ అకౌంట్లో వివరాలు తప్పుగా ఉండటం వల్ల ఇ-నామినేషన్ ఫైలింగ్ కూడా సాధ్యం కావట్లేదు. (ప్రతీకాత్మక చిత్రం)
3. మరి మీ ఈపీఎప్ అకౌంట్లో పేరు, పుట్టిన తేదీ లాంటి వివరాలు తప్పుగా ఉన్నాయా? ఈ వివరాలు తప్పుగా ఉన్నందుకు మీరు ఈపీఎఫ్ఓ సేవల్ని వినియోగించలేకపోతున్నారా? ఈపీఎఫ్ ఖాతాదారులు తమ వివరాలను ఆన్లైన్లోనే సరిచేసుకునే అవకాశం కల్పిస్తోంది ఈపీఎఫ్ఓ. మెంబర్ యూనిఫైడ్ పోర్టల్‌లో లాగిన్ అయి వివరాలు సరిచేసుకోవచ్చు. ఎలాగో తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఈపీఎఫ్ అకౌంట్లో పేరు, పుట్టినతేదీ సరిచేయండానికి ఈపీఎఫ్ అకౌంట్ హోల్డర్లు ముందుగా https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ మెంబర్ యూనిఫైడ్ పోర్టల్ ఓపెన్ చేయాలి. తమ యూఏఎన్, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ కావాలి. లాగిన్ అయిన తర్వాత Manage సెక్షన్లోకి వెళ్లాలి. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఆ తర్వాత Basic Details పైన క్లిక్ చేయాలి. ఆధార్ నెంబర్, పేరు, పుట్టిన తేదీ లాంటి వివరాలన్నీ ఎంటర్ చేయాలి. Update Details పైన క్లిక్ చేయాలి. మీ పేరు మార్పు కోసం చేసిన రిక్వెస్ట్ మీ ఎంప్లాయర్ దగ్గరకు వెళ్తుంది. మీరు చేసిన రిక్వెస్ట్‌ను ఎంప్లాయర్ పరిశీలిస్తారు. వివరాలన్నీ చెక్ చేసిన తర్వాత మీ రిక్వెస్ట్‌ను అప్రూవ్ చేస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఈపీఎఫ్ అకౌంట్లో పేరు, పుట్టిన తేదీ మార్చడానికి బర్త్ సర్టిఫికెట్, ఎడ్యుకేషన్ సర్టిఫికెట్, కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ సర్వీస్ రికార్డ్స్‌కు సంబంధించిన సర్టిఫికెట్, పాస్‌పోర్ట్, ప్రభుత్వ శాఖలకు చెందిన ఏదైనా డాక్యుమెంట్, సివిల్ సర్జన్ జారీ చేసిన మెడికల్ సర్టిఫికెట్, ఆధార్ కార్డ్, ఇ-ఆధార్ లాంటి డాక్యుమెంట్స్ సమర్పించాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఈపీఎఫ్ అకౌంట్లో కాంటాక్ట్ డీటెయిల్స్ సరిచేయడానికి ఈపీఎఫ్ అకౌంట్ హోల్డర్లు మెంబర్ యూనిఫైడ్ పోర్టల్‌లో లాగిన్ కావాలి. ఆ తర్వాత Manage సెక్షన్లో Contact Details పైన క్లిక్ చేయాలి. మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ అప్డేట్ చేయాలి. Update Details పైన క్లిక్ చేయాలి. కాంటాక్ట్ డీటెయిల్స్ అప్డేట్ అవుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.