Home /News /business /

EPFO UAN FOLLOW THESE STEPS TO GENERATE UAN FROM EPFO POSTAL SS

EPFO UAN: ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్‌లో యూఏఎన్ జనరేట్ చేయండి ఇలా

EPFO UAN: ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్‌లో యూఏఎన్ జనరేట్ చేయండి ఇలా
(ప్రతీకాత్మక చిత్రం)

EPFO UAN: ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్‌లో యూఏఎన్ జనరేట్ చేయండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

EPFO UAN online generation | ఉద్యోగులు epfindia.gov.in వెబ్‌సైట్‌లో తమ యూఏఎన్ జనరేట్ చేసుకోవచ్చు. మరి మీరు కూడా యూఏఎన్ జనరేట్ చేయాలనుకుంటే ఈ స్టెప్స్ ఫాలో అవండి.

    ఉద్యోగులు తమ యూనివర్సల్ అకౌంట్ నెంబర్-UAN ఆన్‌లైన్‌లో జనరేట్ చేసుకునే అవకాశం కల్పిస్తూ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీని ద్వారా ఉద్యోగులు యూఏఎన్ కోసం సంస్థ యాజమాన్యంపై ఆధారపడాల్సిన అవసరం లేదు. ఉద్యోగులే స్వయంగా ఈపీఎఫ్ఓ పోర్టల్‌లో యూఏఎన్ జనరేట్ చేయొచ్చు. గతంలో చూస్తే ఉద్యోగులకు యూనివర్సల్ అకౌంట్ నెంబర్లను సంస్థ యాజమాన్యం జనరేట్ చేసి ఇచ్చేది. ఇప్పుడా అవసరం లేదు. epfindia.gov.in వెబ్‌సైట్‌లో ఉద్యోగులు తమ యూఏఎన్ జనరేట్ చేసుకోవచ్చు. మరి మీరు కూడా యూఏఎన్ జనరేట్ చేయాలనుకుంటే ఈ స్టెప్స్ ఫాలో అవండి.

    ముందుగా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO అధికారిక పోర్టల్ epfindia.gov.in/site_en/index.php ఓపెన్ చేయండి. హోమ్ పేజీలో 'Our Services' ట్యాబ్ కింద 'For Employees' ఆప్షన్ క్లిక్ చేయండి. ఆ తర్వాత 'Services' ఆప్షన్‌లో 'Member UAN/Online Service (OCS/OTCP)' పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత వచ్చే పేజీలో 'Important Links' కింద 'Direct UAN allotment by Employees' లింక్ క్లిక్ చేయండి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో మీ ఆధార్ నెంబర్‌కు లింక్ అయిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఈ ప్రాసెస్ ద్వారా మీ యూఏఎన్ నెంబర్ జనరేట్ అవుతుంది. యూఏఎన్ జనరేట్ చేయడానికి యాజమాన్యంపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా ఉద్యోగులకే ఈ సదుపాయాన్ని అందిస్తోంది ఈపీఎఫ్ఓ.

    Redmi Note 8T: రెడ్‌మీ నోట్ 8టీ రిలీజ్... ఎలా ఉందో చూడండి



    ఇవి కూడా చదవండి:

    Aadhaar-SBI link: మీ ఎస్‌బీఐ అకౌంట్‌కు ఆధార్ లింక్ చేయలేదా? ఇలా చేయండి

    RBI: గుడ్ న్యూస్ చెప్పిన ఆర్‌బీఐ... జనవరి నుంచి అమలు

    Credit Card: మీ క్రెడిట్ కార్డుపై లిమిట్ తక్కువగా ఉంటే పెంచుకోండి ఇలా
    First published:

    Tags: EPFO, Personal Finance

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు