హోమ్ /వార్తలు /బిజినెస్ /

EPF-Aadhaar: మీ పీఎఫ్ అకౌంట్‌కు ఆధార్ లింక్ చేస్తే లాభమిదే

EPF-Aadhaar: మీ పీఎఫ్ అకౌంట్‌కు ఆధార్ లింక్ చేస్తే లాభమిదే

EPF-Aadhaar: మీ పీఎఫ్ అకౌంట్‌కు ఆధార్ లింక్ చేస్తే లాభమిదే
(ప్రతీకాత్మక చిత్రం)

EPF-Aadhaar: మీ పీఎఫ్ అకౌంట్‌కు ఆధార్ లింక్ చేస్తే లాభమిదే (ప్రతీకాత్మక చిత్రం)

EPF-Aadhaar Link | ఈపీఎఫ్ఓ ఆన్‌లైన్ సేవల్ని పొందాలన్నా పీఎఫ్ అకౌంట్‌కు ఆధార్ నెంబర్ లింక్ చేయడం తప్పనిసరి. ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్‌సైట్‌ epfindia.gov.in ఓపెన్ చేసి మీ పీఎఫ్ అకౌంట్‌కు ఆధార్ నెంబర్ లింక్ చేయొచ్చు.

  మీకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్-EPF అకౌంట్ ఉందా? మరి మీ ఈపీఎఫ్ అకౌంట్‌కు ఆధార్ లింక్ చేశారా? ఖాతాదారులు తమ ఆధార్ నెంబర్‌ను ఈపీఎఫ్ అకౌంట్‌కు లింక్ చేయాలని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO కోరుతోంది. మీరు మీ ఆధార్ నెంబర్‌కు ఈపీఎఫ్ అకౌంట్‌తో లింక్ చేస్తే ఓ ప్రయోజనం ఉంది. ఈపీఎఫ్ఓ నియమనిబంధనల్లో మార్పులున్నా, ఈపీఎఫ్ఓ ఏవైనా కీలక నిర్ణయాలు తీసుకున్నా దానికి సంబంధించిన అప్‌డేట్స్ మీకు ఎప్పటికప్పుడు తెలుస్తుంటాయి. ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్లు, పీఎఫ్ అకౌంట్ హోల్డర్స్‌కు ఆన్‌లైన్ సేవల్ని అందిస్తున్న ఈపీఎఫ్ఓ... ఆధార్ లింక్ చేసినవారికి అప్‌డేట్స్ అందిస్తోంది. అంతేకాదు... ఈపీఎఫ్ఓ ఆన్‌లైన్ సేవల్ని పొందాలన్నా పీఎఫ్ అకౌంట్‌కు ఆధార్ నెంబర్ లింక్ చేయడం తప్పనిసరి. ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్‌సైట్‌ epfindia.gov.in ఓపెన్ చేసి మీ పీఎఫ్ అకౌంట్‌కు ఆధార్ నెంబర్ లింక్ చేయొచ్చు. ఎలాగో తెలుసుకోండి.

  EPFO-Aadhaar Link: ఈపీఎఫ్ అకౌంట్‌కు ఆధార్ లింక్ చేయండిలా


  ముందుగా epfindia.gov.in ఓపెన్ చేయండి.

  ఆ తర్వాత e-KYC Portal పైన క్లిక్ చేయండి.

  link UAN Aadhaar పైన క్లిక్ చేయండి.

  మీ యూఏఎన్ నెంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి.

  మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయండి.

  ఆ తర్వాత మీ 12 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి.

  ఓటీపీ బటన్ క్లిక్ చేస్తే మళ్లీ మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.

  ఓటీపీ ఎంటర్ చేస్తే మీ ఆధార్ నెంబర్‌ పీఎఫ్ అకౌంట్‌కు లింక్ అవుతుంది.

  Realme X2 Pro: 33 నిమిషాల్లో ఫుల్ ఛార్జింగ్... రియల్‌మీ ఎక్స్2 ప్రో ఎలా ఉందో చూడండి

  ఇవి కూడా చదవండి:

  PAN-Aadhaar Linking: పాన్-ఆధార్ లింక్ డెడ్‌లైన్‌ డిసెంబర్ 31... లింక్ చేయండిలా

  Money Transfer: మనీ ట్రాన్స్‌ఫర్ చేసేవారికి గుడ్ న్యూస్... ఇవాళ్టి నుంచి మారిన రూల్స్ ఇవే

  IRCTC Rail Connect: ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్ యాప్ కొత్త ఫీచర్స్ ఇవే

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Aadhaar Card, Aadhaar card, AADHAR, EPFO, Personal Finance, UIDAI

  ఉత్తమ కథలు